కిరీటి వేంకటాచార్యులు వేంకటాచార్యులవారి చరిత్రమును వీరికి ఐదవ తరము తరువాత వారైన బాలసరస్వతి బుక్క పట్టణం శ్రీనివాసాచార్యులవారు "కిరీటి వేంకటాచార్య విజయ వైజ జయంతీ నాటకము"గా వ్రాసిరి. వేంకటాచార్యుల వారికి సర్వతంత్ర స్వతంత్ర, కవితార్కిక కంఠీరవ, రామా నుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ, శ్రీమద్రాజాధిరాజ గురు సార్వభౌమ వంటి వంశ పరంపరాగత బిరుదములే గాక, ప్రచండ పండితాఖండల మండలీ సార్వభౌమ, శ్లేష యమక చక్రవర్తి, తర్కాలంకార వాచస్పతి, సకల భాషా విశేషకవితా ధురంధర, ప్రతినవ ప్రబంధ పరమేశ్వరేత్యా ద్యనేక బిరుదములుండెను. సురపుర ప్రభువులగు పామ నాయక పుత్రులు వేంకటప్పనాయక్ భూపాలుని కాల మున వేంకటాచార్యులవారు రాజగురువులుగా, అస్థాన ప్రధాన విద్వాంసులుగా నుండిరి. వీరు కాశీ మున్నగు ప్రసిద్ధ స్థలములందనేక శాస్త్రవాదములందు గెలుపొంది, ద్వైతాద్వైత మతములనెడి పాదుకలను, స్వమతస్థాప నము పరమత ఖండనమనెడి చామరములను, విశిష్టాద్వైత మనెడి కిరీటమును ధరించుటచే వీరికి కిరీటి బిరుదుగలిగెను. వీరెచ్చటికి బయలు దేరినను దివా ప్రదీప చామరాదులతో పల్యంకి కారూఢులై వెడలెడివారు. వేంకటాచార్యుల వారు జీవించినది ముప్పది రెండు సంవత్సరములే యైనను అనేక గ్రంథములు రచించుటయేగాక, అనేక వాదసభ అందు విజయమును చేపట్టిరి. B అహోబల పీఠాధిపతులగు శ్రీ శ్రీనివాస యతీంద్రులు వారు శిష్యసంచారము చేయుచు సురపురమునకు వచ్చి నప్పుడు 'వేంకటాచార్యులవారు... “గదాధరీయ ఖండన ప్రచండవాది కండన ప్రకాండయు క్తి మండన ప్రభూతకీర్తి హిండనా జయ స్వపక్షరంజన ద్విపద్రుమ ప్రభంజన ప్రపంచ దర్భభంజన త్రయీవధూ దృగంజన" ఇశ్యాది బిరుద పద్యములతో వారి నెదుర్కొనిరి. ఇరువు రకును వేదాంతశాస్త్రమున 14 దినములు వాక్యార్థము జరిగెను. వేంకటాచార్యులవారే జయమును గాంచిరి. స్వాములవారు వేంకటాచార్యులవారి ప్రతిభాపాండిత్య ములకు మెచ్చి, మైత్రియొనర్చి తమను కవిత్వముచే సంప్రీ తుల గావింపవలసినదిగా కోరగా వెంకటాచార్యులవారు సంగ్రహ ఆంధ్ర దశావతార స్తోత్రమును, భావశతకమును రచించిరి. దశావతార స్తోత్రమందలి ప్రథమశ్లోకమిది : "వరదం వరదంతీ హృదాతపహృత్ శరదం, శరదంబుజ నేత్రయుగం దరదివ్య రథాంగధరం మధురం మధురాకృత ధామ ముహః కలయే" భావశతకము నందలి ప్రథమ శ్లోకమిది : "సాహితీ సౌహితీ రౌహితీ మోహితా, 732 యేహి శే నేహ తాత్పర్యమాతన్వతే, నాటకాలంక్రియా మండితాః పండితా, భావనా జీవనా భావ మాచిన్వతే.” వేంకటాచార్యుల వారొకప్పుడు శ్రావణమాసమున జరుగు విద్వత్సభలకు పూనా రాజధాని కేగిరి. అప్పుడు రెండవ మాధవరావు పాలకుడుగా నుండెను. ఆచార్యుల వారు తమ యలవాటు చొప్పున-- 46 " సంకరుహాసన వనితా కంకణ నిర్వాణ చంకణద్రసనః కింకురుతే మహితోసో కంకటకం ప్రాప్య వేంకటాచార్య” "గదాధరీయ ఖండ” నేత్యాది బిరుద పద్యములను చదువుచు సభాప్రవేశ మొనర్చిరట. అట్టి తరి శ్రీమంతుడు "క్యా కర్తా హే”, “క్యామ్లణతా హే" ("ఏమి చేయు చున్నావు, ఏ మనుచున్నావు ?") అను మరాఠీ వాక్యముల ప్రశ్నించెనట. ఆ మాటలర్థము కాక వేంకటాచార్యుల వారు సలక్షణములును, వైయాకరణ గజాంకుళములు నగు 'వ్రణతా', 'కర్తా' యను ధ్వనులు గల శ్లోకము నాళువుగా నిట్లు చెప్పిరట: "కణ భయితాహే తర్కే ఫణ ఖయితాహే సుళబ్ద గణవోద ర్కే మందర వృత్తం వస్తే, B శ్రుత్యంత సుధాంబు ధౌ మహాగర్తే"- ఆ విద్వత్సభలో నున్నవా రెవ్వరును ఆచార్యుల వారి నెదిరింప జూలకపోయి రట. అందుచే వా శ్రీమంతుడు నిత్య మిడు అగ్రతాంబూలనిధిని మార్చి, 118 రూప్యము లును, జోడు శాలువలును తాంబూలయు క్తముగా సఖా మధ్యమున నుంచి అర్హులగు వారు ఆ యగ్రతాంబూల
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/785
ఈ పుటను అచ్చుదిద్దలేదు