పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/784

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - ౨ 1900లో నూతనమయిన, విప్లవకరమయిన సూచనయొ క సాయముచే ప్లాస్క్ (Planck) అను నతడు అంతిమ పరిష్కారమును కావించెను. 'శక్తి' అనునది స్వల్పమైన మొ త్తములలోగాక, వివేక ముగల (Discreet packets) కొలది ప్రమాణములలో కట్టలుగా ప్రసారితములైన వస్తువులచే శోషణ మొనర్చుకొనబడును అని తలచెను. కట్టల నే అతడు క్వాంటాస్ (Quantas) అనెను. ఊహాజనిత మయిన వాదము యొక్క ప్రాతిపదిక పై ఆధారపడి, ప్లాన్ కృష్ణవర్ణ పదార్థము యొక్క ప్రసారణ ఆకారము (Black body radiation) లన్నిటిని వివరించగల్గెను. తరువాత చేయబడిన ప్రయోగము లన్నిటివలనను ఇతడు సాధించిన ఫలితములు పూర్తిగా అవిరుద్ధములై యున్నట్లు తేటపడెను. ఈనాడు ప్రసరణము అను సమస్యపై ప్లాస్క్ కనిపెట్టిన సిద్ధాంతమే తుది సిద్ధాంతమువలె కన్పట్టు చున్నది. ఈ విషయమున ఈతడు వివరింపని అంశ మొక్క టియునులేదు. 'క్వాల్లియమ్ ఊహావాదము' (Quanli- umn Hypothesis) అను సిద్ధాంతము నవశకోదయము నకు నాందివంటి దయ్యెను. పరమాణువుల యొక్కయు, న్యూక్లియర్స్ (కేంద్రకణ) యొక్క యు భౌతిక శాస్త్ర ముల అభివృద్ధికి ‘ఈ క్వార్లియమ్ ' సిద్ధాంతము ఇప్పుడు వెన్నెముకగ పరిగణింపబడుచున్నది. ప్రసారణ అగ్నిమాపకశాస్త్రము (Radiation Pyro- metry) : ప్రసారణ సిద్ధాంతములను అన్వయించుటలో ముఖ్యమయిన అంశము యొక్కటి కలదు. అది అత్యున్నత మయిన ఉష్ణోగ్రతలను కొలుచు విధానమునకు సంబం ధించినది. ఈ కార్యమునకు ఉపయోగించు పరికరములను అగ్నిమాపకము (pyrometers) అని అందురు. రెండు రకములయిన ప్రసారణ అగ్నిమాపకములు (radiation pyrometers) ప్రస్తుతమున అమలునందున్నవి. 1. పూర్ణ ప్రసారణ అగ్ని మాపకములు (total radiation pyro- meters). 2. దృక్సంబంధి అగ్నిమాపకములు (optical pyrometers). మొదటిది ‘స్టెఫాన్ -బోల్ట్ మాన్ ' సూశ్రము పైనను, రెండవది 'ప్లాస్క్' సిద్ధాంతముపైనను ఆధార పడియున్నవి. 'స్టెఫాన్ - బోల్ట్ మాన్' సూత్రమునందు, ఉష్ణపదార్థమునుండి ప్రసరణమయిన పూర్ణశక్తి, దాని ఉష్ణోగ్రత యొక్క చతుర్థాఘాత (proportional to 731 కిరీటి వేంకటాచార్యులు fourth power) మునకు అనురూపముగ (propor- tional) నుండునని చెప్పబడినది. నిర్ణీతమయిన కాల వ్యవధిలో, పరిచితమయిన స్థలముమీద పడు ఒక ఉష్ణ పదార్థమునుండి ప్రసారితమయిన శక్తిని సేకరించి కొలు చుట సాధ్యమైనచో బహిర్గతమయిన పూర్ణ రక్తిని గణించి నిర్ణయించుట గూడ సాధ్యమే. పైన పేర్కొనిన పూర్ణ ప్రసారణ కిరణ అగ్నిమాపకము ఈ పనిని చేయును. ఇట్లు పూర్ణశ క్తిని కనుగొనినపుడు ఉష్ణోగ్రతను గణింప వీలగుచున్నది. ప్లాన్ సూత్రము ఇట్లుగాక, ఒకానొక వర్ణముగాని, లేక తరంగ దైర్ఘ్యముగాని కలిగియున్న ఒక నల్లని వేడిపదార్థము (black body) చే ప్రసారిత మయిన శక్తి యొక్క పరిమాణమును నిరూపించును. ప్రత్యేకమయిన ఒక వర్ణముగల శక్తిని మాత్రమే కొలుచు టకు ఏర్పరుపబడిన సాధనము ఈ కార్యమునకు ఉపయో గింపబడగలదు. పదార్థము యొక్క ఉష్ణోగ్రతను దీనిచే కనుగొనవచ్చును. ఈ సాధనము 'దృక్సంబంధి అగ్నిమాపక మ'ని పిలువబడుచున్నది. ఉష్ణోగ్రతను కొలుచుటకు ఇట్టి సాధనములు అనేకములు ఏర్పడి ఉపయోగమందున్నవి. అట్టి విధానముల సహాయముతో సూర్యబింబము యొక్క ఉష్ణోగ్రత కచ్చితముగ 6000° ఉన్నదని కనుగొనబడినది. కిరీటి వేంకటాచార్యులు : వి. కు. దే. శ్రీ శ్రీమత్తిరుమల బుక్కపట్టణం కిరీటి వేంకటా చార్యులవారి జనన మరణములకు సంబంధించిన తేదీలు సరిగా తెలియరావు. కాని వారు శాళ. 1655 ప్రాంతము లందున్నట్టివారు. వీరి జన్మస్థలము సురపురము (షోలా పూర్). వీరి తండ్రిగారు శ్రీమ తిరుమల బుక్కపట్టణం అణ్ణయ్యదీక్షితుల వారు (పెద్దయ్య వార్ల వారు). కా.ళ. 1828 తారణ సంవత్సర వృషభమాసము హస్తానక్షత్రమున జన్మించిరి. ఈ పెద్దయ్యవార్ల వారి తమ్ములు (చిన్నయ్య వార్ల వారు) శ్రీ మన్ని గమాంత దేశికుల యపరావతారముగా భావింపబడిన శ్రీమత్తిరుమల బుక్క పట్టణం శ్రీనివాస మహాదేశికుల వారే వేంకటాచార్యులవారికి సమస్త శాస్త్ర ములు నేర్పిరి. ఈ యిరువురు సోదరులు ధర్మవరం (అనంత పురంజిల్లానుండి సురపురమునకు పామనాయక భూపాల్ గారి కాలమున వచ్చి రాజగురువులుగా నిలచిపోయిరి.