పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/781

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కిరణప్రసరణము ప్రసరణము యొక్క ధర్మమును అధ్యయనమొనర్చి దాని స్వభావమును తెలిసికొనుటకై ప్రయోగాత్మక మును, తరంగ దైగ్యుము సిద్ధాంతరూపమునునైన పని బహుళముగా జరుపబడెను. దీని ఫలితముగ, ఉష్ణ పదార్థములనుండి బహిర్గతమైన విద్యుదయస్కాంత తరంగములు కిరణ ప్రసరణములో ఉన్నట్లు ఇప్పుడు స్థిరపడినది. ఈ తరంగములు, ఉత్పత్తి స్థానమునుండిబయలు దేరి ప్రయాణించునపుడుకూడ శ క్తిని కొనిపోవును. ఈతరంగములు ఏదేని యొక ఉపరితలముపై పడి దానిలో శోషణము (Absorption) చెందునపుడు, ఈ శక్తి ఉష్ణముగ మారును. "సూర్యుని ఉష్ణతాగుణము విద్యుదయస్కాంత ప్రసరణము వలన కలుగుచున్న చో, సూర్యకాంతి కూడ విద్యుదయస్కాంత స్వభావము కలిగి యున్న దా? కలిగియున్నచో, రెండింటికినిగల భేదమేమి?" అను రెండు ప్రశ్నలు పుట్టుచున్నవి. వీటిలో మొదటి ప్రశ్నకు అవుననునది సమాధానము. రెండవ ప్రశ్నకు సమాధాన మిచ్చుటకు పట్టకము (prism) గుండా పోవు సౌర కిరణ ప్రసరణము (solar radiation) యొక్క ఫలితమును పరిశీలింపవలసియున్నది. పతన శుక్ల ప్రభను (Incident white light) తదంతర్గతములై యున్న ఎరుపు, ఊదారంగు మొదలయిన అనేక భిన్న వర్ణములుగ గాజు పట్టకము చీల్చునని న్యూటన్ నిరూపించెను. దీనికి వర్ణమాల (spectrum) అని పేరు. ఈ వర్ణములు వేర్వేరు తరచుధవముల (frequencies) తో తరంగ దైర్ఘ్యముల (wave lengths) తో నొప్పు విద్యుదయస్కాంత తరంగ ముల వలననే కలుగుచున్నవి. ఊదారంగు కిరణతరంగ దైర్ఘ్యము కంటే అరుణ కిరణతరంగ దైర్ఘ్యము అధికము. కానీ దృశ్యపరిమితుల (visible limits) వద్ద వర్ణమాల అంత మొందదు. అరుణ కిరణముల కావల అంతకంటే ఉన్నతతరమైన తరంగ దైర్ఘ్యమండలములలో హెర్శ్బెల్ సంగ్రహ ఆంధ్ర అనునతడు క్రీ.శ. 1800 లో నూతనమయిన ప్రసరణము నొక దానిని కనిపెట్టెను. ఇది 'పరారుణ కిరణ ప్రసరణ' మని (Intra-red radiation) అనబడును. రిట్టర్ అను మరియొక శాస్త్రజ్ఞుడు తరంగ దైర్ఘ్యములతో కూడిన మరి యొక రీతి ప్రసరణమును కనుగొనెను. ఇది ఊదారంగు దానికంటె చిన్నది, దీనికి పూర్వ నీలలోహిత కిరణ ప్రస రణము (Ultra.violet radiation) అని పేరు. వరా రుణ కిరణ ప్రసరణము, పూర్వ నీలలోహిత కిరణ ప్రస రణము- ఈ రెండును వర్ణమాల యొక్క పరిమిత వైశా ల్యములపై వ్యాపించుచున్నవి. వీటిలో మొదటిది, దాని యొక్క గురుతర తరంగ దైర్ఘ్యములు కారణముగా బాహ్యదృశ్యములగు పూర్వనీలలోహిత ప్రసరణముల కంటె అధికతరముగా పదార్థమందు శోషణము చెందును. వాటికంటె అధికతరమైన ఉష్ణతాశ క్తిని ఉత్పత్తిచేయును. ఇది విద్యుదయస్కాంత వర్ణమాలలోని భాగము. దీనికి సాధారణముగ ఉష్ణధారణ ప్రసరణము (Thermal radiation) అని పేరు. పూర్ణమయిన విద్యుదయస్కాంత వర్ణమాల యందు దీర్ఘ తరముయినట్టియు, హ్రస్వతరమయి నట్టియు రెండు విధములయిన తరంగ దైర్ఘ్యములు గల మండలములుండును. దీర్ఘతరతరంగ దైర్ఘ్యము (Longer wave length) వై పున రేడియో తరంగములును, హ్రస్వ తరంగ దైర్ఘము (short wave length) వైపున x కిర ణములు, y కిరణములును మనకు లభించును. 728 ఉష్ణధారణ కిరణ ప్రసరణ ధర్మములు: తరంగ దైర్ఘ్య ములలో గల భేదము తప్ప ఉష్ణధారణ కిరణ ప్రసరణము వెలుతురు (light) ను పోలినదే యగుటచే, వీఠణశక్తిని కల్పించు ధర్మము తప్ప తక్కిన వెలుతురు యొక్క ధర్మములు, (Properties of light) అన్నియు దాని యందు కలవను విషయము సత్యమని (correct) ధ్రువ పడెను. ఈ ముఖ్య ధర్మములలో కొన్ని క్రింద వివరింప బడినవి. 1. కాంతి వలెనే కిరణ ప్రసరణము (Radiation) గూడ సరళ రేఖలలో ప్రయాణించునట్లు కనిపించును. 2. శాంతి వేగముతో సే కిరణ ప్రసరణము గూడ శూన్యము గుండా (అనగా వణమునకు 1,88,000 మైళ్ల వేగముతో) ప్రయాణింపగలదు.