విజ్ఞానకోశము - . టకు యోగ్యుడని మాలవికలో (1.2) చెప్పి, విద్వాంసులు మెచ్చినపుడే కవికి ఆత్మ తృప్తి రాగలదని శాకుంతలమున (1.2) అనినాడు. ఈ ఈ ఆశయములతో ప్రాచీనులలో కన్పించు ఇతివృత్తములను మొట్టమొదట వదలినాడు కాళిదాసు. తన మూడు నాటకములలోను కాళిదాస గ్రథితవస్తువు కలదనినాడు. ప్రసిద్ధమైన ఇతివృత్తమును ఆనవాలుగా గ్రహించి, తన భావనాశక్తి ద్వారా సన్ని వేశములను కల్పించి, క్రొత్త విషయమును సృష్టించి నాడు. క్లిష్ట సన్ని వేళములలో నాయికా నాయకులను చూపుట ఒక సన్ని వేశము. స్వాతంత్ర్యమును కోల్పోయి ధారణి వద్ద నిస్సహాయగా నున్నది మాలవిక, దైత్యుల చేతులలో చిక్కినది ఊర్వశి. మధుకరమునకు చిక్కి వల పించినది శకుంతల. కేవలము భౌతికముగా, ఇచ్ఛాజనితమై బయలుదేరిన శృంగారమున సుఖము గాని, సౌందర్యము గాని లేదని తెలుపుటకు గర్భసంధిని వినియోగించినాడు. ఆధ్యాత్మికముగా శృంగారము పరిణమించుటకు అంతర సంఘర్షణ అవసరము. "దుల్లహోపి ఓమే తస్సిం భవహిఅ అణిరాసం" అనినది మాలవిక. “సురాంగనా కర్షతి ఖండి తాగ్రాత్ సూత్రం మృణాలాదిన రాజహంసీ" అనినాడు పురూరవసుడు. గాలి కెదురుగా బోవు పతాక వెనుకకు తిరుగునట్లు దుష్యంతుని మనస్సు భ్రమించినది. తన నిజ స్వరూపమును వ్యక్తముచేయలేనిది మాలవిక. పుత్ర దర్శ నముతో పురూరవసుడు తన కేడము కాగలడని దుఃఖించి నది ఊర్వశి. భావ స్థిరములగు జననాంతర సౌహృద ములను సరిగా తెలిసికొనజాలని దుష్యంతుడు తీరని మనో వేదనకు లోనైనాడు. పతి పరిత్యక్తయై, సహజమైన ప్రకృతికి వేరై ఏ కాకినిగా విలపించినది శకుంతల. 8. నాయికా నాయకులు : మూడు నాటకములలోను నాయికలను అపూర్వ సౌందర్యమూర్తులని భావించినారు నాయకులు. మాలవికను చిత్రించిన శిల్పికి కళాసృష్టిలో నుండవలసిన సమాధి కుదరకపోవుటచే చిత్రము కాంతి విసంవాదమైనది. 'ఆభరణస్యా భరణ' మైన ఊర్వశి రత్న సృష్టిరపరా' శకుంతల అనాఘ్రాత పుష్పము, అలూనకిసలయము, అనాస్వాదిత మధువు, పుణ్యముల అఖండ ఫలము. ఇట్టి ప్రియురాలిని వీడి ఉండజూలని నాయకుడు పునర్దగ్శనమునకు యత్నించును. పొంచియుండి 723 కాళిదాసమహాకవి ప్రియుని పరిశీలించినది ఊర్వశి ; శకుంతలను గమనించిన వాడు దుష్యంతుడు. రస చిత్రణము : ఈ శృంగారము పరిశుద్ధమై, ఆధ్యా త్మిక ముగా భాసించి, శాంతమున పర్యవసించుటకు కుమార సంభవమున తపస్సు అపేక్షితమైనది. మాలవికకు బంధనము, ఊర్వశికి భరతుని శాపము, శకుంతలకు దుర్వాసుని శాపము విధింపబడినవి. శాపము అనినంతమాత్రమున క థా విషయ మున కళంకమున్నదని ఎంచరాదు. నాయికా నాయకుల ఎడబాటుకు గల కారణములను కొంతవరకు సామాజికు లకు వివరించుటకే శాపము ప్రస్తుతింపబడినది. మాలవికకు బంధనము విధించిన మహాకవి శాపమునే కోరి, ఆధ్యాత్మిక జగమున గల క్లిష్టతను కొంతవరకు చూపినాడు. తమతమ ధర్మములను వదలి, స్వసౌఖ్యములను కోరి, స్వవిషయము లనే పరమావధిగా ఎంచినవారికి ఇతరులతో వైమనస్య ములు వచ్చుట సహజము. స్వార్థము నశించనంతవరకు నిజమైన సౌఖ్యము లేదుకనుకనే 'రమ్యాణి విద్య ...'అని దుష్యంతుని స్థితి వివరించబడినది. స్వార్థ ప్రవృత్తిలో విస్మృతికి ప్రధాన స్థానమున్నది. విస్మృతికి బదులు మాలవిక విషయమున మౌనమును చూపినది కాళికి. ఇరావతి మూలమున ఉద్విగ్నుడై నాడు అగ్నిమిత్రుడు. ఉన్మాదియై పలవించినాడు పురూరవసుడు. చిత్రగతమైన కాంతను నిజమైన వ్యక్తిగా దలచి భావోన్మాదమున తగు ల్కొనినాడు దుష్యంతుడు. ఈ ఉద్విగ్నత నుండి బయలు దేరినది నిర్మలమైన, శాంత రసోపక్షేపకమగు శృంగారము. ఈ నాయికలు ప్రకృతిలోని సౌందర్యమునకు ప్రతీకలు. మాలవిక ను అశోక ములోను, శకుంతలను నవమాలికతోను తాదాత్మ్యముగావించిన కవి ఊర్వశిని లతగామార్చినాడు. ఇట్టి ' నాయికల నైష్ఠిక సౌందర్యమును దర్శించుటకు నాయకులను విషాదమున కాలనచేసి, శాంత స్వరూపమగు ప్రేమకు వారి ధర్మ సంతానమే ఆధారమని, ప్రాణమని నిరూపించినాడు. ముఖ్యమగు కొన్ని యంకములు : దుష్యంతుని వ్యథకు, శకుంతల పడిన బాధకు మూలము నాల్గవ అంకము. నాట కమున మరెచ్చట కన్పింపని కణ్వుడిట కలడు. శకుంతలను అత్తవారింటికి పంపు సన్ని వేళము గల ఈ ఒక్క అంకమే మహాకవి ప్రతీథకు, మానన స్వభావ పరిశీలనకు గొప్ప
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/776
ఈ పుటను అచ్చుదిద్దలేదు