పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/775

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాళిదాసమహాకవి సోదరుడు మేఘుడు, మానవుని హృదయము ప్రకృతితో సంవలితమైనది. భ్రాతృకార్యమున నియుక్తుడైన మేము నకు పూర్వార్ధమున తీర్థయాత్రాచరణ కూడ విధింప బడినది. ఈ యాత్రల ఫలమె పతివ్రతను దర్శించుట. కుమారసంభవము : తారకాసుర వధకు నాయకుని వాంఛించిన దేవతలు బ్రహ్మవద్దకు వచ్చి, తదుపదేశాను సారము శివపార్వతుల వివాహమునకు ఇంద్రుడు చేసిన యత్నము, శివపార్వతుల తపస్సు, వారి శుభ వివాహము ఇతివృత్తముగాగల మహాకావ్యము కుమారసంభవము. ఎనిమిది సర్గల వరకే కాళిదాసమహాకవి వ్రాసి, ఏకారణ ములవలననో దీనిని వదలినాడు. దీనిని పూర్తిచేయదలచి నట్లు రఘువంశమున కొంతవరకు తెలియుచున్నది. భారతీయ సంస్కృతికి, జాతీయతకు ప్రతీకయై, దేవ 'తాత్మయగుటచే, హిమాలయ వర్ణనతో కావ్యమారంభ మగుచున్నది. సౌందర్యోపాసన ఉద్దిష్టార్థ విషయమగుట చేతను, ఆదర్శవంతమగు మాతృత్వమునకు మూలభూత మగుటచేతను, తర్వాత పార్వతి వర్ణన వచ్చినది. ఆధ్యాత్మిక శక్తి యే ప్రబలమైనదని చెప్పుటకు వసంతవర్ణన కలదు. నైష్ఠిక సుందరునిగా శివుని నెలకొల్పినాడు. భౌతిక వికార ములకు లొంగక, తపోమహిమచే శుద్ధమైన శివపార్వతుల వివాహము వివరింపబడినది. 'నీ తపస్సులచే క్రీతుడవైన నీ దాసుడను' అని శివుడు పార్వతిని చేపట్ట నంగీకరించెను. వియోగినీ వృత్తములో నడచిన అనుష్టుప్ఛందమునగల ఋషులు రాయభారము, పార్వతి తపస్సు నిత్యము స్మరింపదగిన సన్నీ వేళములు. రతీవిలాపము, రఘువంశము : వాగర్థముల అనన్యత్వప్రతిపత్తికి పార్వతీ పరమేశ్వరులను నమస్కరించి వ్రాయనెంచిన రఘువంశ మహాకావ్యమున కావ్యకళను సమగ్రముగా అవగాహన చేసికొనిన ఋషితుల్యుడగు మహాకవి కన్పిం చును, అతిసులభమైన, నిత్యవ్యవహారమున నున్న పదము లలోని కవితావాహిని అభివ్యక్తమగుచు నీట గోచరిం చును. కావున, సంస్కృతమును అభ్యసించువారు మొట్ట మొదట ఈ మహాకావ్యమును పఠించుట గలదు. పాండిత్య మును కొంత సంపాదించిన తర్వాత, మరల ఈ కావ్య మును చదువుట తప్పనిసరి, అప్పుడే ఇందలి సొబగులు పూర్తిగా అర్థము కాగలవు. 722- సంగ్రహ ఆంధ్ర జన్మాంతముదాక శుద్ధమైనవారు, ఫలోదయమువరకు కర్మల నాచరించువారు, విధిపూర్వకముగా అగ్నిహోత్ర ములను కాపాడువారు, అకరాధులను దండించువారు, దానమునకై ఆర్జించువారు, సశ్యపాలనకు మితముగా భావించువారు, కీర్తికిగాను జయించువారు, శైశవమున విద్యాభ్యాసము గలవారు, యౌవనమున విషయైషులు, వార్థకమున మునివృత్తి నందినవారు, చివరకు యోగా గ్నిలో దేహమును త్యజించిన వారును అగు రఘువుల వంశమును చెప్పదలచితినని గ్రంథారంభమున Ľ వాక్యముల నిచ్చినాడు. దిలీపుడు నందినీ ధేనువునకు శుశ్రూష చేయుట, రఘువు యొక్క. దిగ్విజయము, ఇందుమతీ స్వయంవరము, అజ విలాపము మొదటి ఎనిమిది సర్గలలోను ప్రధాన ఘట్టములు. తర్వాతి కావ్యమున 13, 14 సర్గలలో రామాయణగాథ మనోహరముగా చిత్రించబడినది. అగ్ని వర్ణని చేరితముతో కావ్యము సంపూర్ణముగా అంతమగు చున్నది. నాటకములు : ధారణి, ఇరావతు లను భార్యలు గల అగ్ని మిత్రుడు విదర్భ రాకుమారి యగు మాలవికను వివాహము చేసికొనుట మాలవికాగ్నిమిత్రము నందలి ఇతివృత్తము. అస్సరన యగు ఊర్వశిని తన విక్రమము ద్వారా ప్రేమించిన పురూరవసుని ప్రేమగాథ విక్రమోర్వ చేయమందలి విషయము. శకుండలను ఆశ్రమమున ప్రేమించి, తర్వాత ఆమెను విస్మరించి, అంగుళీయక దర్శనము ద్వారా పూర్వగాథను అవగతము చేసికొని దివ్యాశ్రమమున సతీపుత్రులము తిరిగి పొందిన దుష్యంతుని కథ అభిజ్ఞానశాకుంతలము. ఈ మూడు నాటకములలోను సమానసన్ని వేశములు, తుల్యమగు పాత్రపోషణ, సుందర మైన కవితావాహిని కన్పించుటచే వీటిని విడదీసి పరిశీ లించుట దు స్తరము. రఘువంశ, కుమారసంభవములకును ఈ నాటకము లకును కొంత దగ్గర సంబంధము కూడ కన్పించుచున్నది. ఇతివృత్తము : కాళిదాస గ్రథిత వస్తువు: వివేకులైన సత్పురుషులు అను అగ్నిచే పరిశీలింపబడిన కావ్యము అను సువర్ణమునకు మంచి వన్నె రాగలదని రఘువంశ మున (1-10) పలికి, సత్పురుషుడే మహాకావ్యమును ఆస్వాదించు