పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/60

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము ౨ ఆసియా

తల ఎత్తుచు కాళ్ళను నిగుడించవలయును. సర్వాంగము లకు వ్యాయామము కలుగును. మలబద్దకము తొలగును. సుణిపూర చక్రముపై ప్రభావము ప్రసరించును.

10. శీర్షాసనము : రెండుచేతుల వేళ్ళను జతపరచి సమమైన భూమి పైనున్న చాపపైనుంచి మూర్ధ్ని చక్రము భాషపై ఆనగా, జతపరచిన చేతులు బ్రహ్మరంధ్రమునకు అండగానుండ, మోచేతులు భూమినాన, కాళ్ళను నిటా రుగా నెత్తవలెను. శరీరపు బరువు మూర్ధి చక్రము పై నాధారపడి యుండును. శిరస్సులోని నాళములలో రక్తము ధారాళముగా ప్రవహింపగా మెదడు నిగ్గుతేరి తెలివి తేటలు, గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి పెంపొందును. మనస్సునకు పాటవము కలుగును. జ్ఞానేంద్రియములు తేజోవంతము అగును, హ్రస్వదృష్టి, చత్వారము మొద అయిన కంటి జబ్బులు ఏర్పడవు. నేత్రములు సురక్షితము లగును. సర్వరోగములు తొలగును. షట్చక్రములపై ప్రభావము పడును, అభ్యాసకులు, సద్గురువుల ఆదేశానుసారముగా తమ శక్తివంచన లేక ఆసనముల నభ్యసించుట యుక్తము.

  • శరీరమాద్యం ఖలుధర్మసాధనం”

య. సిం.

ఆసియా :

ప్రపంచములోని ఖండము లన్నింటిలోను ఆసియా ఖండము చాల పెద్దది. ఇది భూభాగపు మొత్తములో మూడు వంతులు ఆక్రమించి యున్నది. దీని విస్తీర్ణము 1,87,98,000 చ. మైళ్ళు. జనాభా సుమారు 130 కోట్లు, ఈ ఖండపు తూర్పు - పడమరల కొలత 5,400 మైళ్ళు. ఉత్తర - దక్షిణముల కొలత 5,800 మైళ్ళు.

ఆసియాఖండము తూర్పుపడమరలుగా సుమారు 25° తూర్పు రేఖాంక మునుండి 170° తూర్పు రేఖాంశమువరకును, ఉత్తరరవీణములుగా సుమారు 1° ఉత్తర అక్షాంశము నుండి 75° ఉత్తర అక్షాంక మువరకును వ్యాపించి యున్నది. తూర్పు ఇండియా దీవులతో (ఇండోనీషియా) సహా 10° ద. అక్షాంశమువరకును వ్యాపించియున్నది. తూర్పు ఇండియా దీవులు మొదలగు పరిసరప్రాంతపు దీవులను మినహా యించినచో ఈ ఖండము ఉత్తరార్ధగోళములోనే ఉన్న చని చెప్పవలసి యుండును. నిరంతరము మంచుచే కప్ప బడిన ఆర్కిటిక్ తీరమునుండి అన్ని కాలములలోను ఇంచుమించు ఒకే ఉష్ణోగ్రత కలిగిన భూమధ్యరేఖవరకు వ్యాపించి ఉన్నది. అందువలననే వివిధములయిన శీతోష్ణ స్థితులు ఈ ఖండమునందు గలవు. ఇది అధిక వైశాల్యము కలదగుటచే ఖండాంతరమందలి పెక్కు దేశములు సముద్ర మునకు 1,500 మైళ్ళకంటె ఎక్కువ దూరములో నున్నవి.

ఆసియా ఖండములో ఈ క్రింద పేర్కొన్న 20 దేశ ములు చేరియున్నవి. దేశము 1. సై బీరియా మంచూరియా 2. 8. మంగోలియా 4. కొరియా (ఉ) (*) 5. జపాను 6. చైనా 1 రాజధాని ఇర్కెటస్కు మ్యూక్లైన్* ఉర్గా పొగ్యాంగు - సియోలు టోకియో