పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/58

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము . ఆసనము లభ్యసించునపుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములకు ప్రాముఖ్య మున్నదని గమనించవలెను. ఈ సందర్భములో భిన్న భిన్న ఆచారములు ఋషులచే సూచింపబడినవి. శాస్త్రసమ్మతముగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగవలెను. భిన్నమయినచో అపాయము కలుగును. ఎట్టి అపాయ ములకును లోనుకాకుండు పద్దతి శ్రీ భగవత్పాదులు జగద్గురువులు అది శంకరాచార్యులవారు వివరించిరి. అది కేవల కుంభకమని ప్రసిద్ది. ఎట్లనగా ప్రతివ్యక్తియు తన శక్తి కొలది శ్వాసమును పీల్చి దానిని ఊపిరితిత్తులలో శక్తికి మించకుండ ఆపి నెమ్మదిగా విడువవలెను. ఈ పద్ధతి నవలంబింబినవారు మనోదార్థ్యము, ఉత్సాహనంపద, అక్మవికాసము పొంది ఎట్టి కష్టములకు లోనుగాక ధైర్య సాహసములు కలిగియుందుకు. మనుష్యశరీరము ఆత్మకు నివాసస్థానము. కావున ఆ శరీరమును లోపల, బయట, స్వచ్ఛముగను, కళంక రహితముగను ఉంచుకొని పిలుపు వచ్చినపుడు శరీరమును చాలించుట మానవుని విధి. ఈ కర్తవ్యమును శిరసా ఈ వహించి జనులు నడచుకొనినచో వారికి పరాత్పరుడు అమరత్వమును ప్రసాదించును. ఇందులకు ఆసనము లెంతయు ఉపయోగకరములు, ఆసనములభ్యసించుటకు ఉషఃకాలము మలమూత్ర విసర్జనానంతరము మిక్కిలి ముఖ్యమైనది. ఆసనములు, కరచరణములను బలిష్ఠములనుగా చేయును. ఉదరములోని పేగులను శాస్త్రసమ్మతముగా స్పందింప జేయును. వక్షఃస్థలమునకు మిక్కిలి బలము చేకూర్చును. ఊపిరితిత్తులలోని అన్ని భాగములను విజృంభింపజేయును. కంఠమునకు దార్థ్యము చేకూర్చును. చేకూర్చును. మీదుమిక్కిలి' షట్చక్రములమీద ప్రత్యేక ప్రభావము చూపును. పూర్వము మన మహాఋషులు ఈ ఆసనముల నభ్యసించి, చిరాయు వులై వర్ధిల్లి, గురుపరంపరగా ఆసనాభ్యాస విధానమును మనకు ప్రసాదించిరి. మనము భక్తిశ్రద్ధలతో ఈ యాసన ములను అనుష్ఠించినయెడల మహాఋషులకు ప్రాప్తించిన ఉత్తమగతి మనకును లభ్యమగును. కావున సమర్థుడైన గురువువలన ఆసనాభ్యాసమునందలి అన్ని మెలకువలను ఆకళింపుచేసికొని అభ్యసించుట శ్రేయోదాయకము. మీదుమిక్కిలి చిత్రముల సహాయమున అత్యంత - ఉపయోగకరము లైన 10 ఆసనములు వివరింపబడుచున్నవి. 21 ఆసనములు 1. మత్స్యేంద్రాసనము : ఎడమ మడమచే గుహ్యమును మూసి, కుడి చీలమండ ఎడమ మోకాలునకు అవతలగా మత్స్యేంద్రాసనము భూమిని అనియుండగా 'వామహ స్తమును కుడి మోకాలు మీదుగా తీసికొనివెళ్ళి కుడికాలి బొటనవ్రేలు పట్టుకొని దక్షిణ హస్తమును ఎడమ పార్శ్వములో నుంచి, భ్రూ మధ్యమున దృష్టిని నిలుపవలయును. కరచరణముల వ్యతిరేకముగా చేసిన రెండవ భాగము పూర్తియగును. ఈ ఆసనము మూలాధార, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రములమీద ప్రభావముకలదై ఉన్నది. ఇది వెన్నెముకను స్నిగ్ధము చేయగలదు. కరచరణములను, ఉదరమును సక్రమ పద్ధతిలో నుంచును.

2. సిద్ధాసనము ఎడమ మడమచే గుహ్యమును మూసి కుడి మడమను రహస్యేంద్రియము పై నుంచి రెండు హస్తములను జ్ఞానముద్రచే రెండు మోకాళ్ళపైనుంచి వెన్నెముకను నిటారుగా నుంచవలయును. నాసికాగ్ర మున దృష్టి నిలువవలయును. మూలాధార, స్వాధిష్ఠాన చక్రములపై ఈ ఆసనము ప్రభావము చూపును.