పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/42

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - ౨ ఆర్ష వ్యవసాయ పద్ధతి : శ్రీ విద్యారణ్య యతీంద్రులవారు కృష్ణయజుర్వేద ప్రథమ కాండ సంహితా భాష్యములో “ఋషి మార్షేయం” (కృ. య. సం. 14. 432) ఋషి శబ్దమునకు "ఋషిః వేదార్థజ్ఞః" అని వ్రాసియుండిరి. కావున ఋషీ శబ్దమునకు వేదార్థమును తెలిసినవారు అని యర్థము. వారి సంబంధ మయినది ఆర్షము. అట్టి వ్యవసాయపద్ధతి అర్థవ్యవసాయ పద్ధతి. అనగా ఆర్షవ్యవసాయపద్ధతి అను పదమునకు శ్రుతి, స్మృతుల ననుసరించిన వ్యవసాయపద్ధతి అని ఫలితము. ఆర్ష వ్యవసాయ పద్ధతులను ముఖ్యముగ వివరించుచు ప్రసంగాను ప్రసంగముగ(కృషి వివరము, ఎరువులు) పంటలు ధాన్యపుకోత, మున్నగువాటికి సంబంధించిన ప్రకృతోప యోగకరములును, అపూర్వములును, అగు అనేక విషయ ములు శ్రుతి, స్మృతి, శిష్టాచార ప్రమాణ ప్రదర్శనపూర్వక ముగా వివరింపబడును. Ed ఈ కృష్యాదులలో కేవలము దృష్టములగు (మన దృష్టికి గోచరములగు కార్యములేగాక అలౌకికములగు (శ్రుత్యాదులవలననే తెలిసికొనదగిన) విశేషములు కూడ వీటిలో నున్నవి. పూర్వకాలములో బ్రాహ్మణునకు జీవనార్థము వృత్తులనుచెప్పు సందర్భములో మనుస్మృతిలో గల "ఋతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేనవా" అనుదాని యందలి ఋతశ బ్దమునకు "ఋత ముంఛ శీలం జ్ఞేయం" అను నిర్వచనానుసారము కోసిన చేలలో వెన్ను లను, గింజలను ఏరుకొని వాటిచే జీవించుట అని అర్ధము. "అయాచితం స్యాదమృతం" అను వాక్యానుసారము అమృత శబ్దమునకు ఇతరులను యాచింపకుండ తనకు సంప్రాప్తమయిన దానిచే జీవనము చేయుట అని యర్థము. “మృతంతు యాచితం జ్ఞేయం" అను నీ నిర్వచనాను సారము మృతశబ్దమునకు యాచనావృత్తిచే జీవించుట అని యర్థము. ప్రమృత శబ్దమునకు" ప్రమృతం కర్షణంస్కృతం" అను నిర్వచనానుసారము వ్యవసాయవృత్తిచే జీవించుట యర్ధమని నిరూపింపబడినది. ప్రకృతములో ప్రభువులు గూడ ఈ కృషివృత్తియెడలనే ప్రాధాన్యమును చూపుటచే దీని ప్రాచీనవి. శేషములను తెలిసికొనవలసిన ప్రసక్తి యు, ఆధునిక, ప్రాచీనపద్ధతుల యొక్క అంతరమును గమనింప వలసిన ప్రసక్తియు గలిగినవి. ఆర్ష వ్యవసాయపద్ధతీ ప్రకృతకాలములో వ్యవసాయశాస్త్రజ్ఞులు దున్నుటకు లో హమయమయిన అపూర్వయంత్రములను (ట్రాక్టర్లను) తయారుచేసి వాటికి భూమిని మున్నుటకు "ఇనుపకోలలను (కఱ్ఱుకోలలు) 8, 9, 10 వరకు అమర్చిరి. అట్టి యంత్రము లచే ఒకసారి దున్నినచో ప్రకృతములో కర్షకులు ఉప యోగించుచున్న కట్టుకోల గల చారుమయ మగు నాగలిచే 10 సార్లు దున్నిన పని శీఘ్రముగా జరుగుట, యంత్రములతో దున్నుటచే ఎడ్లకు శ్రమ లేకుండుట, లోతుగ దున్నుట మున్నగు సౌకర్యములు ఉండునని వీరి యాశయము. ఇక అర్ఘ వ్యవసాయ సంప్రదాయమును గమనింతము, పూర్వకాలములో నాగలికి ఇప్పటివలె ఒక కాడి, దానికి రెండు ఎడ్లను కట్టుటగాక ఒకే నాగలికి 3, 6, 12 కాండ్లను కట్టి, కాడి 18కి 2 ఎడ్ల చొ.న 6, 12, 24 ఎడ్లను కట్టి దున్నెడి సంప్రదాయము ఒకటి కన్పట్టుచున్నది. మహాగ్నిచయన మ నెడి యజ్ఞ క్రతువులో భూమిని దున్ని ఓషధులను చల్ల వలెను. అచ్చట దున్నెడి నాగలికి యుగములను (కాండ్లను) గట్టుటకు రెండు మంత్రములును, వాటికి వినియోగ సూత్రమును కలవు. 1. మం॥ "సీరా యుంజంతి కవయో యుగావితన్వతే పృథక్ | ధీరా దేవేషు సుమ్నయా.” 2. “యునక్త సీరావియు గాతనోత కృతే యోసేవ ప తేహ బీజం | గిరాచ శ్రుష్టిస్సభరా అసన్నో న్నేదీయ ఇత్సృ ణ్యాప క్వమాయత్." (కృ. య. సం. 4.2.5) సూ. “చ్వాథ్యాగ్ం సీరం యువక్తి షడ్గవం, ద్వాదశ గవం చతుర్విగ్ం శతి గవంవా" (ఆ. క్రౌ. సూ.) పై రెండు మంత్రములను ఉచ్చరించి దున్న బోవు నాగలికి 6 లేక 12 లేక 24 ఎడ్లను కట్టుటకు అనుకూలమగు నటుల లి లేక 6 లేక 12 కాండ్లను అమర్చవలెను అని పై సూత్రమునకు తాత్పర్యము..... పై మంత్రములకు అర్థము. 1. మం. అ. దేవతలకు హవిస్సంపాదన ద్వారమున సుఖమును చేకూర్చవలెనని ఇచ్ఛయించెడి అనలనులగు ఓ కర్షకులారా ! నాగలికి 3, 6, 12 కక్ష్యావిశేషము లందు. ఎడ్లను కట్టుటకు కాండ్లను వేరువేరుగా విస్తరింప జేయుడి. Us 5