పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/41

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆర్ష వాస్తుశాస్త్రము ముల కాలము పరమాయువు పరిమితిగా చెప్పబడినది. ధనము కంటె ఋణము తక్కువగా నుండవలయును. నామనక్షత్రముచే ఏర్పడిన రాశినిబట్టి అర్వణమును నిర్ణయించుకొనవలయునని ఆర్షగ్రంథములలో చెప్పబడినది. ఒకనికి ఒక గ్రామములో నుండుటవలన అశుభములు కల్గు చున్నచో వాడేదిక్కుగా, లేక విదిక్కుగా, పోయి నివాస మేర్పరచుకొన్నచో శుభములు గల్గునో, నిర్ణయించుకొను విధానములుకూడ తెలుపబడినవి. స్థల ప్రయుక్తములైన అశుభములకు శాంతికల్పములు కూడ చెప్పబడినవి. ఇంటి చుట్టునుగల స్థలములో ఏయే వృక్షములు ఏయే దిక్కున నుండవలయునో, ఉండకూడదో, మున్నగు వివరములును తెలుపబడినవి. రావి, కడిమి, మున్నగుచెట్లు ఇంటివద్ద నిషేధింపబడినవి. పనసచెట్టు ఎక్కడనైనను ఉండవచ్చును. కూడనిచెట్లు దక్షిణమున నున్నచో అంతదోషముండదు. గృహములోని ముఖ్యభాగములు ప్రమాణములు కూడ నిర్దేశింపబడినవి. గర్భముయొక్క పొడవు, వెడల్పు మున్నగునవి ఈ క్రింది మానములో తెలుపబడినవి: యవ, అంగుళము, (8 యవగింజలను అడ్డముగా నుంచగా నేర్ప డినది), వితస్త్రీ (12 అంగుళములు), హస్తము (24 అంగుళ ములు), ఈకొలతలు ఉలిలో వలనా? గోడలమధ్య నుండియా? గోడలబయట నుండియా? అను నేటి వాస్తుశాస్త్రజ్ఞుల సందేహములు ఆర్షగ్రంథములలో ఈ క్రిందిరీతిగా తీర్చబడి నవి. రాతిగోడలైనచో ఉల్లోపలను, ఇటుక గోడలైనచో గోడలమధ్యనుండియు, మట్టిగోడలైనచో గోడలవేలు పల కును కొలతలను చూచుకొనవలయును. " వాస్తుపురుషుని యొక్క ఆయా అవయవములలో గల దేవతలను, దిక్పాలకులను బట్టి, ఆయా దిక్కులలో నిర్మింప దగిన గృహాదుల స్వరూపస్వభావములు నిర్ణయించబడినవి. వాస్తుపురుషుని ప్రదేశమును 81 భాగములుగా చేసికొని, ఈ నిర్ణయములను కావించుకల్ప మొకటి కలదు. దానికి 'ఏకాశీతిపద వాస్తు విన్యాసము' అని పేరు. చుట్టును ఉన్న ప్రదేశములో ఏమియు నిర్మింపరాదు. గ్రామమున కైనను గృహమునకైనను ఇట్లు నియమములు సమా నములే, ప్రాకారము గృహగ్రామాదుల కీరితిగా విహిత మైనది. మధ్యప్రదేశము హృదయము; అది బ్రహ్మకు వాసస్థాన మనియు అచ్చట ఏమియు నిర్మింపరాదనియు, 4 సంగ్రహ ఆంధ్ర ఇల్లయినచో నది మండువాగా నుండుననియు, గ్రామమయి నచో బహిరంగ ప్రదేశముగా నుండుననియు చెప్పబడినది. ఆస్థలమును ఎప్పుడును మలినపరుపరాదు. దానికి చుట్టును ఉండు 32 పదాలలో నిర్మాణములను గోపిలచుకోన వచ్చును. గృహమునకై నచో, పాఠశాలా కయ్యాగృహాదు లును,గ్రామమునకై నచో బ్రాహ్మణాదివర్ణముల గృహము లును, ఏయే దిక్కులలో ఏయే రీతిగా నుండవలయునో వర్ణింపబడి యున్నది. అట్లే దేవాలయాదులును నియమ ములు చెప్పబడినవి. దేవాలయ శిల్పవాస్తు విచారము కామికాచ్యాగమ గ్రంథములలో ఉన్నది. విజ్ఞయలనూ లింగములకు మాత్రము నియమములు ఎక్కువగా నున్నవి దుర్గములు, ఉద్యానవనములు, పట్టణ భేటఖర్నాట ములు మున్నగువాటి కన్నింటికిని వాస్తు నియమములు కలవు. ఏకశాలా, ద్విశాలా, త్రిశాలాచి థేములచేను, ద్వారసంఖ్యచేతను గృహములు అనేవి విధములుగా: Fo బడినవి. ధ్రువము, ధాన్యము, జయంగము, శ్రీనివరము మున్నగు నామములు ఆయా గృహవిశేషములకు వాచ బడినవి. ఇంటికి ఏదిక్కున ఏది యుండవలయుని కూడ చెప్పబడినది. తూర్పున స్నానగృహము, పశ్చిమమును భోజనశాల, ఉత్తరమున ధనగృహము, దక్షిణమున శయ్యాగృహము, దక్షిణనైరృతి మధ్యభాగమున పురీష గృహము, వాయవ్యదిక్కున పశుగృహము, ఈశాన్య మున దేవగృహము ఈరీతిగా వ్యవస్థచేయబడింది. నూతన గృహనిర్మాణమును కావించు సందర్భమున వాస్తుప్రశమనమును గావించుట శ్రీమద్రామాయణ ములోకూడ గలదు. అరణ్యవాసములో లక్ష్మణుడు కర్ణ శాలను నిర్మించి వాస్తుప్రశమనము గావించినట్లు చెప్పబడి నది. (అయో. 55 వ. సర్గ 28 వ. శ్లో. 32 ) వేదమంత్రములలో "వాస్తోష్పతే శగ్మయా" "వాస్తా ష్పతే ప్రతరణోన ఏధి” “అమీనహా వస్తోప్పతే విశ్వా రూపాణ్యావిశన్" మున్నగు స్థలములలో వాస్తుపూజా స్ఫోరకచిహ్నములు కలవు. యజ్ఞశాలాది నిర్మాణవిష యకములైన విధు లనేకములు వేదములలోను శ్రోత సూత్రములలోను కలవు. 2. 3.