ఛాయా విద్యుత్తు
సంగ్రహ ఆంధ్ర
మంతట కాంచు చున్నాము. చలన చిత్ర పరిశ్రమలు, వార్తా పత్రికలు, వ్యాపార సంస్థలు ఛాయా చిత్ర కళను వినోద, విజ్ఞాన ప్రదానములకే గాక, ఆర్థిక లాభాదులకు గూడ నేడు ఉపయోగించుకొను చున్నవి. సినీ కెమేరా ద్వారా నేటి మానవుడు అచర జగత్తుతో పాటు జంగమ జగత్తును సహితము చిత్ర రూపమున తీసి వాని గమన విశేషముల ప్రదర్శింప గల్గి యున్నాడు. ఫొటో మైక్రాగ్రఫీ వలన సూక్ష్మాతి సూక్ష్మపదార్థములను సైతము ఛాయా చిత్రమున దర్శింప జేయుటకు వీలగు చున్నది. పరిణామాధిక్యము గల ఉద్గ్రంథములను నెగటివుల రూపములలో అల్ప పరిమాణ రూపములుగా రూపొందజేసి వహన యోగ్యములుగను, అనల్పకాల జీవన యోగ్యములుగను చేసి మైక్రో ఫొటోగ్రఫీ గ్రంథాలయ పఠితల కెంతయో సౌకర్యము కలుగజేయు చున్నది. ఇట్లు గ్రంథములను ఫిల్ముల రూపముగా తయారు చేయుటకు ఎక్కువ విభాజకశక్తి (resolving power) గల ఎమల్షను కావలెను.
అంతరిక్ష ఛాయా చిత్రగ్రహణము నేటి విజ్ఞాన పరిశోధనల కెంతయో యుపకరించుచున్నది. దీనికి పనికివచ్చు కెమేరాలో రెండు కటకము లుండును. వస్తుకాచము (objective glass) వెనుక, పుటక కటక ముంచుటవలన బింబము వికసించును. దీనివలన శత్రు స్థావరములను విమానములనుండి ఫొటోలు తీయుటకును, పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలకును, వన్యమృగములు మున్నగు వానిని ఫొటో తీయుటకును వీలుపడును. పరమాణు విదళనము (Nuclear fission) చెందునపుడు వచ్చు శకలములు ఎమల్షన్ గుండా పోయినవాని వేగమును బట్టి, బరువును బట్టి ఎమల్షను మీద జాడ లేర్పడును. వీనివలన విజ్ఞానశాస్త్రమున కెంతయో ఉపయోగము కలదు. అంతరిక్షములోనికి బెలూన్ల ద్వారమునను, రాకెట్ల ద్వారమునను ఫొటో ప్లేట్లను పంపి విశ్వకిరణముల (Cosmic Rays) లో జరుగు ప్రక్రియలను తెలిసికొన వీలగును. ఖగోళమును ప్రతిరోజును ఫొటోలు తీయుట వలన విశ్వము యొక్క పుట్టుపూర్వోత్తరముల గురించి వివరములు సేకరింప వీలగును.
ఎక్సురే ఫొటోల మూలముగా శరీరములోని భాగములను, వాని స్థితిగతులను చూడవచ్చును. ఈనాటి వైద్య శాస్త్రమున కిది ముఖ్యాంగమని చెప్పవచ్చును. ఇట్లే పరశ్శోణ (infra-red) చిత్రముల మూలమున మబ్బు, మంచు, పొగ మున్నగువాని గుండ దూరపు వస్తువుల చిత్రములను స్పష్టముగా తీయవచ్చును.
ఒక్క మాటలో చెప్పవలెనన్న, ఛాయా చిత్ర గ్రహణ కళ చరాచర విశ్వ భౌతిక స్వరూప సందర్శనావకాశమును కల్పించు విలక్షణమైన విమల దర్పణము.
అ. స. మూ.
ఛాయా విద్యుత్తు (Photo - Electricity) :
20 వ శతాబ్దారంభములో ఘటిల్లిన పెక్కు ఆవిష్కరణములు భౌతిక శాస్త్రవేత్తల ఆలోచనా విధానములో విప్లవమును గొని వచ్చినవి. ఈ ఆవిష్కరణములలో 'ఛాయా విద్యుత్పరిణామము'(Photo-electric effect) నకు ప్రముఖ మైనట్టి, సుస్థిర మైనట్టి స్థానము కలదు. క్రీ. శ. 1900 వ సం. వరకు దృశ్య కాంతితో (visible light) సహా వివిధ రూపముల కాంతి ప్రసరణము, వైహాయస (ether) మను ఊహా కల్పితయానము (hypothetical medium) నందు తరంగముల రూపములో ఉత్పన్న మగుననియు, ప్రసార మగుననియు, స్వీకరణము జరగుననియు భావింపబడెను. ఇంటర్ ఫియరెన్సు (inter-ference=జోక్యము,) నమనము (diffraction), ధృవీకరణము (polarization) అను అంశములపై జరుగు ప్రయోగములను కాంతి తరంగ స్వభావము (wave nature of light) పైననే ఆధారపడి అర్థముచేసికొనుటకు సాధ్యమగును. మాక్స్‌వెల్ (Maxwell) అను నాతడు ఈ తరంగములకు విద్యు దయస్కాంత లక్షణము లుండునని క్రీ. శ. 1864 సం.లో సిద్ధాంతరీత్యా నిరూపించి యున్నాడు. హెర్జ్ (Hertz) అను మరియొక శాస్త్రజ్ఞుడు పైన ఉదహరించిన సుప్రసిద్ధ సిద్ధాంతము యొక్క అనుమేయములను (deductions) పరిశోధనాలయములో 'ఆసి లేటరీ విద్యుత్ స్రావముల' (oscillatory electrical discharges) సహాయముతో విద్యుదయస్కాంత తరంగములను కల్పించుట మూలముగా రుజువు పరచెను. ఇట్లు సాధించబడిన అభివృద్దు లన్నిటి మూలమున, తరంగ సిద్ధాంతము (wave theory) నందు
784