ఛాయాగ్రహణ శాస్త్రము
సంగ్రహ ఆంధ్ర
యిడ్ పూయబడి యుండుటచే ప్రతిక్రియ (reaction) మెల్లగా జరుగును. కావున సన్నిహిత ముద్రణమున (contact printing) కు పనికివచ్చును. బ్రోమైడ్ ఎమల్షను గల కాగితము ఎన్లార్జిమెంటు (Enlargement) లకు ఉపయోగించును. ఛాయాగ్రహణమునకు ఉపయోగపడు కాగితములలో బ్రోమైడ్ కాగితము ఉత్తమము. క్లోరోబ్రోమైడ్ కాగితము మధ్యమము. గాస్‌లైట్ కాగితము అధమము.
వికాస విధానము (Processing) : వికాసము కాంతి ప్రేరిత మయిన రజత హేలైడ్‌ను నల్లని లోహరజతముగా మార్చును. క్షార (alkaline) ద్రావకములగు వికాసములు గాలిలో నుండి ఆమ్లజనిని (oxygen) గ్రహించి తారువంటి అనుత్తేజిత (inactive) పదార్థములను అవక్షేపించును (precipitate). కాని సోడియం సల్ఫేటు వంటి పదార్థములతో జతకూడినప్పుడు విఛూషణము (absorption) తగ్గిపోవును. ఈ క్షార పదార్థములు కాంతిప్రేరితములు కాని రజత యౌగికములను (Silver compounds) కూడ రజతముగా మార్చి వికాస ధూమిక (Development fog) తయారు చేయును. దీనివలన బింబము యొక్క స్పష్టత తగ్గును. పొటాసియం బ్రొమైడ్‌ను వికాసములో చేర్చిన, వికాస ధూమిక తయారగుటకు 'నిర్బంధకము' (restrianer) గా పనిచేయును.
అత్యుత్తమ క్రియాశక్తిగల నెగటివులకు హైడ్రోక్వినైను (Hydroquinine), కాస్టిక్ సోడా (costic soda) లను, మధ్యతరగతికి ఎలన్ (Elon), పి- మెతిలా మినోఫీనల్ సల్ఫేటు (p-Methylaminophenol Sulphate), హైడ్రో-క్వినైను (Hydroquinone) లను, మరీ తక్కువ క్రియాశక్తి (low activity) గల వాటికి (అనగా ఎన్‌లార్జిమెంటుకు పనికివచ్చునవి, సినీ ఫిల్ములు) ఎలన్ (Elon) హైడ్రో-క్వినైను (Hydroquinine), అనార్ద్రమగు సోడియం సల్ఫేట్, బొరాక్సు గల ద్రావకమును, వికాసముగా నుపయోగింతురు. తక్కువ క్షారము గల వికాసము నుపయోగించిన, నెగటివులలో మచ్చలు ఉండక తేడాలను (unevenness) తగ్గించును.
ఫిల్మును వికాసములో నుంచిన ప్రేరణ సమయము (induction period)లో బింబము (image) తయారయి క్రమముగా ఒక స్థాయికి వికసించును. ఉష్ణోగ్రతతో (temperature) ఈ వికాసగతి (rate) వృద్ధి చెందును. కాని సాధారణముగా 18° – 20°C (65° - 70F) ఉష్ణము దీనికి మంచిది. వికాసము, కదలుచున్న అదే కాలములో బింబముయొక్క భేదదర్శనము (contrast) బాగుగా నుండును.
స్థిరీకరణ ప్రక్రియ (fixing) లో కాంతి తగులని రజిత హేలైడులు సోడియం సల్ఫయిడు (హైపో) లో కరుగును. హైపోలో ఆమ్లములు ఏమియు లేకపోయినచో ఈ కరిగిన లోహరజతము అవక్షేపము (precipitate) చెందును. స్థిరకారకములలో పదను (tanning) చేసి జలటినును గట్టిపరచు పదార్థము లుండుటవలన నీటిలో జెలటిను ఉబ్బుట, తగ్గుట, ద్రవీభవనాంశము (melting point) వృద్ధిచెందుటయు జరుగును. దీనివలన త్వరగా ఆరి రాపిడి వలన ప్రేరిత పదార్థము తుడుచుకొని పోదు.
స్థిరీకరించిన పిదప బింబములు చాల తేలికగా గాని, బండగా గాని (light on heavy) వచ్చినచో కొంతమార్పు చేయవలసి యుండును. వృద్దికారకము' (intensifiers) అదనముగా కాంతి విచూషణ పదార్థము (light absorbing material) ను పరుచుట కాని, కాంతిని విచూషించు శక్తిని నెగటివుకు వృద్ధిపరచుట గాని చేయును. పాదరస వృద్ధికారకము లోహరజమును రజిత బ్రోమైడ్‌గా మార్చి, తానే అద్రావ పాదరస వృద్ధికారకము (Insoluble Mercurous Bromide) గా తయారగును. రజత వృద్ధికారకము (silver intensifier)లో స్థిరీకరించిన పిదప నెగటివును రజత వృద్ధికారకములో ముంచినచో, రజత లోహపు పూతదానిపై నేర్పడును. దాని వలన భేద దర్శన మధిక మగును.
ఛాయాచిత్రణ సంగ్రహీకరణములు (photographic reducers) సాధారణముగా ఆమ్లకారకములై (oxidising agents), రజతద్రావము (silver solvent) లు కలిగియుండును. దీనివలన బింబములో అదనపు లోహరజతము కలిగి యుండును.
వాస్తవ చిత్రములకు (positives) కావలసిన రంగు (tone) కలుగుటకు స్థిరకారకమగు సోడియం ధయో
782