పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/847

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఛాయాగ్రహణ శాస్త్రము

సంగ్రహ ఆంధ్ర

మును కడిగి ఆరపెట్టవలెను. ఆ పరిస్థితిలో కాంతి ప్రేరిత పదార్థముమీద కాంతి పడిన ప్రదేశములు నల్లగాను, వస్తువులో కాంతి ప్రసరింపని ప్రదేశములు తెల్లగాను కాన్పించుటచే దీనిని 'నెగటివు' (Negative) అందురు.

నెగటివును మరొక కాంతిప్రేరిత పదార్థము పూయ బడిన పలకపై గాని కాగితముపైగాని ఉంచి కాంతి ప్రసరింప చేసినచో నెగటివ్‌లో గల నల్లని అపారదర్శక (Opaque) ప్రదేశముల గుండా కాంతి ప్రసరింపక, పారదర్శక (Transparent) ప్రదేశములగుండా కాంతి ప్రసరించును. ఆపై వికాసము (Developing), స్థిరీకరణము (Fixing) జరుపవలెను. అప్పుడు కాంతి ప్రసరించిన ప్రదేశములు తెల్లగాను, కాంతి ప్రసరింపని ప్రదేశములు నల్లగాను కనిపించి, వాస్తవ చిత్రము సిద్ధమగును. దానిపై గోచరించు నల్లదనము యొక్క సాంద్రతా సాంద్రతలు నెగటివులో ఆయాప్రదేశముల గుండ ప్రసరించిన కాంతి మీదనే ఆధారపడి యుండును.

చరిత్ర : క్రీ. శ. 1727 లో జె. హెచ్. సూల్జ్ (J. H. Schultze) సుద్దను (chalk), రజతనత్రితమును (Silver nitrate) కలిపిన మిశ్రమము మీద అపారదర్శక పదార్థముల నుండి కాంతిని ప్రసరింపజేయగా మిశ్రమము మీద బింబములు కలుగునని మొదటిసారిగా కనుగొనెను. క్రీ. శ. 1777 లో సి. డబ్ల్యు. స్కీల్ (C. W. Scheele) రజతమిశ్రమముల (silver compounds) మీద వివిధ వర్ణములగు కాంతుల వలన ఏర్పడు ప్రభావమును పరిశోధించెను. 1802 లో టి. వెడ్జివుడ్ అను నాతడు రజత నత్రితములో ముంచిన కాగితముల మీద బింబములు కలిగించు శక్తి కాంతికి గలదని నిరూపించెను. తరువాత హెచ్. డారి (H. Darry) రజతనత్రికము కంటె రజత హరితము (silver chloride) శ్రేష్ఠమైనదని కనుగొనెను. 1814 లో జె. ఎన్. నీపీ (J. N. Niepie) మట్టి తైలము (Bitumen) రసాయనిక సంయోగానంతరము రజత లోహములవలె కరుగకపోవుట మూలమున కాంతి ప్రేరిత పదార్థములకు దీనిని పీఠము (Base) గా ఉపయోగింప వచ్చునని గ్రహించెను. 1839 లో ఎన్. జె. ఎం. డా గెరి (L. J. M. Daguerre) మెరుగుపెట్టిన వెండి పలక మీద రజత అయొడయిడు (silver iodide) పొరను అయొడిన్ ఆవిరులకు తెరిచి (expose) కెమెరాలోనుంచి కాంతి ప్రసరింప జేసెను. దానిని పాదరసపు ఆవిరులకు తెరిచి యుంచినచో బింబము వికసించునని నిరూపించెను. దీనిని డాగుర్సు (Dagurrs) రకపు ఛాయాగ్రహణ మందురు.

1841 లో డబ్ల్యు. ఎచ్. ఫాక్సు టాల్బటో (ఇంగ్లండు) రజతహరితము (silver chloride) పూసిన కాగితముల ఉపయోగములనుగూర్చి పరిశోధించి, కాలోటైపు(calotype) పద్ధతి ప్రవేశ పెట్టెను. దీనిలో నాతడు స్థిరీకరణము ప్రవేశ పెట్టెను, 1839 లో సర్ జె. హెర్షెల్ (Sir J. Herschel) మొదటిసారిగా ఛాయా చిత్రమును తీసి విజయమును సాధించెను. షెవలియర్ (Chevalier) ఒకేకటకముతో అతిసామాన్య మైన కెమెరాను 1840 లో పెడ్జెవల్ (Petzval), పోర్ ట్రైట్ లెన్సును (portrait lens), 1890 లో బిందుకటకము (Anastigmatic lenses) లను రడోల్ఫు, అబ్బె అనువారలు తయారు చేసిరి. 1882 లో ఎడ్వర్డ్సు (Edwards) సమతల సంగమ కవాటము (Focal plane shutter) ను, 1887 లో బాన్సచ్ (Bansch) కటకమధ తారామండల పటలము (iris diaphragm) ను ప్రవేశ పెట్టిరి. 1843 లో గాజు పలకమీద నెగటివులు తయారు చేయుట, 1845 లో హెర్షెల్ (Herschel), సి నీపి డి సెయింట్, (C. Niepce de St.), విక్టరు (Victor) అనువారలు రజత లవణములను ఆల్బుమెన్ మిశ్రితముగా గాజు పలకమీద పూయుట కనుగొనిరి. 1871 లో ఆర్ . ఎల్, మాడాక్సు (R. L. Maddox) రజత బ్రోమైడ్ జెలటిన్‌ను కాంతి ప్రేరితముగా ఉపయోగించెను. 1874లో మొదటి అనార్ద్రములగు నెగటివులు తయారు చేయబడెను. 1904 నాటికి వర్ణ ఛాయా చిత్రములు కనుగొన బడినవి. 1889 లో ఈస్టుమాన్ (Eastman) రజత బ్రోమైడ్ పూసిన ఫిల్మును తయారుచేసెను. ఇట్లే ఈ కళ క్రమవికాసమును చెంది, నేడు మనము గాంచు పరిణత స్థితి నందు కొనినది.

కెమేరాలు : సాధారణపు పెట్టె కెమేరాలలో ఒక చివర ఫిల్ము, మరియొక చివర F/10 కటకము ఉండును. కవాటము 1/25 సెకండు కాలము తెరచుకొని యుండగలదు. మడత కేమేరాలలో కటకము తిత్తుల చివర ఉండును. దీని

780