విజ్ఞానకోశము - 3
ఛత్రపతి శివాజీ మహారాజు
గ్రంథములను నవ్య వ్యావహారిక భాషలో పునర్లిఖించుట, ప్రాచీన సాహిత్య ప్రక్రియలను నవీన సిద్ధాంత ప్రచారమునకు వినియోగించుట మున్నగునవి ప్రకృతోదాహరణములు.
చైనా ప్రజా రాజ్య మహాధ్యక్షుడగు మావో- సే-టుంగ్ గొప్ప సారస్వతాభిమాని. ఇతడు స్వయముగా కవిగా, రచయితగా వరలెను. నవచైనా సాహిత్యమునకు ఇతడు నిర్దేశించిన ప్రణాళిక వేదముగ పరిగణింపబడు చున్నది. చైనా ప్రజలయొక్క సర్వతో ముఖాభ్యుదయము ఆతనియొక్కయు, ఆతని ప్రభుత్వముయొక్కయు లక్ష్యము. విద్య, విజ్ఞానము, సాహిత్యానందము సర్వ ప్రజలకును అందుబాటులో నుండునట్లును, చైనా యందు సామ్యవాదము సుస్థిరముగ నెలకొను నట్లును చేయుట ఆతని ధ్యేయము. ఆతడు 1941 వ సంవత్సరమున 'యేనన్' నగరమున అఖిల చైనా రచయితల నుద్దేశించి గావించిన ప్రసంగము నవచైనా సాహిత్యమునకు ప్రామాణికత్వము వహించినది : కార్మికులు, కర్షకులు, సైనికులు - చైనాప్రజ లనగా వీరే. వీరి కుపయోగించెడి సాహిత్యమే సాహిత్యము. సామ్యవాద సిద్ధాంతములపై ఆధారపడి ఉత్తమ సామాజిక వ్యవస్థను నిర్మించుటకు రచయితలు తోడ్పడవలెను. ప్రజలకు ప్రగతిమార్గమును నిర్దేశించి, స్వధర్మ నిర్వహణమున ప్రవృత్తులగునట్లు చేయుటయే గ్రంథకర్తల లక్ష్యముగ నుండవలెను. హేతువాదబద్ధమై, సత్యసమ్మతమైన ఆతని ఈ యుపదేశమును నవచైనా రచయిత లందరును ఆమోదించిరి. 1949వ సంవత్సరములో చైనా ప్రజాతంత్ర రాజ్యము స్థాపింప బడినది. నాటినుండి, చైనా కమ్యూనిస్టు నాయకుడైన మావో-సే-టుంగ్ నిర్దేశించిన మార్గముననే సాహిత్య నిర్మాణము జరగుచున్నది. ఈనాటి ప్రఖ్యాత రచయితలలో పేర్కొనదగినవారు క్వొమో-జో, చెన్-పాయ్-చెన్, చాంగ్ - క్వాంగ్ జూ, హ్యూయెహ్-పిన్, టుంగ్-పింగ్, శ్యాన్ హుంగ్, చావ్ యూ, లీ చిన్-షా, లాన్‌షే, పాషిన్ టింగ్ లింగ్ (కథానికా రచయిత్రి) మున్నగువారు పలువురు కలరు.
చైనా గ్రంథములు ఇతర భాషలలోనికి, ఇతర భాషా గ్రంథములు చైనా భాషలోనికి బహుళసంఖ్యలో పరివర్తనము చేయబడుచున్నవి. భాషా సారస్వతములను ప్రజాసామాన్యమునకు అందుబాటు లోనికి తెచ్చుట, ప్రజలలో వైజ్ఞానిక, సారస్వతాభిరుచిని పెంపొందించుట - నవచైనా సాధించిన ఘన విజయములలో పేర్కొన దగినవి.
పా. మా.
ఛత్రపతి శివాజీ మహారాజు :
పండ్రెండవ శతాబ్ది తుదిభాగమున భరత ఖండము నందు మహమ్మదీయ ప్రభువుల యధికారము నెలకొనిన నాటినుండియు, హైందవ ధర్మానుయాయులకు చెడ్డరోజులు ప్రారంభించెను. మహమ్మదీయులు పాలకులుగా నుండి హిందూ ధర్మమును, సంస్కృతిని రూపుమాపుటకై సర్వవిధముల యత్నించి కొంతవరకు కృతార్థత చెందిరి. ఈ ఘోర విపత్తునుండి హైందవులను కాపాడుటకై యత్నించినవారిలో ముఖ్యులు రాజపుత్రులు, మహారాష్ట్రులు అని చెప్పవలసి యున్నది. కాని వీరన్యోన్య సహకారముతో మెలగని కారణమున వీరి ఆశయములు సంపూర్ణముగ ఈడేరలేదు. హైందవ ధర్మ పునరుజ్జీవనమునకై మహారాష్ట్రమున గొప్ప కృషిసల్పిన మహా పురుషుడు సమర్థ రామదాసస్వామి. ఈయన యందు ఆధ్యాత్మిక తత్త్వమును, ధర్మోద్ధరణాభిలాషయు మూర్తీభవించెను.
ఈ స్వామి కేవలము ముముక్షువు కాడు. సాంఘికముగ, రాజకీయముగ నానాటికి పతన మగుచున్న హిందూ సమాజమును అభ్యున్నతికి తేవలయునను పవిత్రాశయము కలిగినవాడు. ధీరోధాత్తుడైన శివాజీకి ఆయన కర్తవ్యోపదేశము చేసి కర్మయోగిగ శివాజీని తీర్చిదిద్ద గలిగెను. శివాజీ మహారాజు జీవితము ధర్మ ప్రపూర్ణము, వీరరస విలసితము. మహారాష్ట్ర జాతిలో జాతీయభావములను పెంపొందించి, వారిలో నిక్షిప్తములై యున్న మహాశక్తులను విజృంభింపజేసి, రాజ్య నిర్మాణశక్తిని ప్రసాదించి, దేశోద్దరణము గావించినవాడు ఛత్రపతి శివాజీ మహారాజు.
మహారాష్ట్రుల యుదంతము శివాజీకి పూర్వమంతగా తెలియదు. మహారాష్ట్ర ప్రాంతమును, రాష్ట్రకూటులు, చాళుక్యులు, యాదవులు పరిపాలించిరి. పదునాల్గవ శతాబ్దమున దేవగిరి యాదవరాజులు అలావుద్దీన్ చక్ర
771