పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/826

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చైనాదేశము (భూ)

సంగ్రహ ఆంధ్ర

ల్యము 36,43,000 చదరపు మైళ్ళ నుండి 38,77,000 చదరపు మైళ్ళ వరకును గలదని అంచనాలు వేయబడినవి.

చైనా మిక్కిలి పురాతనమైన దేశము. వేదాంతము నందును, వాఙ్మయము నందును, కళలయందును చైనా దేశము సాధించిన ఘనకృత్యములు బహు కాలికముగా చరిత్ర పుటల కెక్కినవి. అయినను, చైనాదేశము ఆధునిక కాలమున పాశ్చాత్య సంస్కృతికి ప్రసిద్ధ లక్షణములయిన సాంకేతిక విద్యలందును, శాస్త్ర విజ్ఞానమునందును విశేషముగా అభివృద్ధిగాంచి యుండలేదు.

నేటి చైనా ప్రజాస్వామికము (Republic) లో, చైనా ప్రధాన భూభాగమనియు, (china proper), బాహ్యమండలములనియు (outer territories) రెండు ప్రధాన విభాగములు కలవు. సింకియాంగ్ (Sinkiang), చింఘైర్ (Cninghair), మంచూరియా (Manchuria), మంగోలియా తూర్పుభాగము, టిబెట్టు అనునవి బాహ్య భూభాగములునై యున్నవి. వాయవ్య దిశాంతరమున నున్న సికియాంగ్ అను ప్రాంతము ప్రధానముగా ఒక ఎత్తైన ఎడారిపీఠభూమి. దీనిని, ఉత్తరముననున్న టైన్-షాన్ (Tin-shan), పామీర్ (Pamir) పర్వతముల యొక్క లోయ, ఉత్తరటిబెట్టునకు చెందిన ఆల్ఫిన్‌టాగ్ (Alphintag) అనుప్రాంతములు గుఱ్ఱపులాడా ఆకారమున ఆవరించి యున్నవి. భూగోళరీత్యా చింఘైర్ (chinghair) సింకియాంగ్ (sinkiang) అను నీ రెండును గొప్పదైన టిబెట్టు పీఠభూమిలోని భాగములే.

చిత్రము - 220

పటము - 1

చైనా మహాకుడ్యము

ఈ టిబెట్ పీఠభూమి యూరపుఖండములోని మిక్కిలి ఎత్తైన పర్వతము కంటె ఎత్తయినది. చైనా ప్రధాన భూభాగమునకు ఉత్తరముగాను, అనగా చైనా మహాకుడ్యము (Great Wall) కు ఉత్తరముగాను, గోబీ ఎడారికి దక్షిణముగాను, తూర్పు మంగోలియా ఉన్నది. దీనినే పొడవైన పచ్చిక భూమి (Land of long Grass) అందురు. ఇది దేశ దిమ్మరులైన మంగోలియను గొల్ల కాపరులకు ఆవాసభూమి. ఇది విశేషముగా పచ్చిక బయలు – స్టెప్పీలవంటిది (Praili Steppe). ఐనను చైనా రైతు తన పారతోను, నాగలితోను ప్రవేశించి ఈ పచ్చిక బయలును నిబ్బరముగా సాగుబడిలోనికి తెచ్చుచున్నాడు. వాయవ్యమునగల కాంసు (Kansu), ఉత్తరమునగల షెన్సీ (Shansi), మరియు షాన్సీ అను మండలములు (Provinces) ప్రధానముగా ఎత్తయినవి. అనగా ఇది యొక విచ్ఛిన్నమయిన పీఠభూమి. ఇది విశాలమును, లోతును కల వండలిమట్టి కప్పుచే ఆవృతమయి యున్నది. ఎడారి గాలులచే ఉత్తరమునకు తేబడిన సున్నితమయిన, పసుపుపచ్చని వండలిమేట ఇది. వండలిమట్టి పొరను

758