విజ్ఞానకోశము = 3
14-2-1912 లో సన్ యట్ సేన్ తన పదవిని త్యజించెను. క్రొత్త రాజ్యాంగము ప్రకారము యువాన్ అధ్యక్షుడుగా (10-8-1912) చైనా గణతంత్ర మేర్పడినది. యువాన్ ప్రభుత్వమును రాజ్యాంగ బద్ధము గావించుటకై, టంగ్ మెంగ్ హుయి స్థానమున కూమిన్లాంగ్ పక్షమును (ఆగస్టు 1912) సన్ యట్ సేన్ స్థాపించెను. కాని విజయ వంతమగుచున్న ప్రజా విప్లవమును విశ్వాస యోగ్యుడు కాని యువాన్ హస్తగత మొనర్చుట సన్ యట్ సేన్ చేసిన గొప్ప పొరపాటు.
యువాన్ సైనిక ప్రభుత్వము 1912-1916: యువాన్ షికాయికి ప్రజాస్వామ్యములో విశ్వాసములేదు. సైనిక నియంతృత్వము ద్వారా రాచరికమును పునరుద్ధరించు టయే ఆతని యాశయము. అమెరికా రాజ్యాంగ వేత్త యైన “ఫ్రాంక్ గుడ్ నౌ" అనునతని సలహాపై పాశ్చాత్య సామ్రాజ్య వాదులనుండి 25 మిలియన్లు ఋణము గ్రహించి యువాన్ తన కార్యక్రమమునకు ఉపక్రమిం చెను. కూమిన్ టాంగ్ ను బహిష్కరించి, కియాంగ్సీ పూకిన్, హూనాన్, జెకువా మున్నగు రాష్ట్రము లలో జరిగిన తిరుగుబాటులను దారుణముగ అణచివేసెను. సన్యట్ సేన్ కూడ జపాన్కు పారిపోయి తల దాచు కొనెను. ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధము ఆరంభ మైనది. చైనాలోని కల్లోలములను అవకాశముగా గ్రహించి జపాను, చైనాను ఇరువదియొక్క కోరికలను కోరెను (Twenty one Demands). వీటిని అంగీక రించినచో చైనా ఇంచుమించు జపానుకు సామంత రాజ్యము కాగలదు. యువాన్ ప్రభుత్వము ఈ కో ర్కె లను అంగీకరించెను. జపాను యొక్కయు, పాశ్చాత్య రాజ్యముల యొక్కయు సహాయముతో ప్రజా వ్యతి రేక తను లక్ష్య పెట్టక 1916 లో యువాన్ తనను చక్రవర్తిగా ప్రకటించుకొనెను. కాని అతడు అనతి కాలములో నే మరణించెను. అతని మరణానంతరము తిరిగి రాచరికము రద్దయినది.
సైనిక ప్రభువులు : యువాన్ మరణానంతరము లియు వాన్ హుంగ్ అధ్యక్షుడుగాను, ట్వాంచి జుయి ప్రధాని గను ఎన్నుకొనబడిరి. కాని సైనిక వర్గములు బలపడి అంతర్యుద్ధములతో దేశమును సంక్షుభిత పరచిరి. ట్వాంచి 95 753 జుయి చైనాదేశము (చ) (ఆన్హిపై వర్గనాయకుడు) జపాను నుండి 200 మిలియను ఎన్నుల ఋణమును గ్రహించి, చిహిలీ, ఫెంగ్ టీన్ సైనిక వర్గములు నడచుటకు ప్రయత్నించెను. ఇంతలో కీయాంగ్సీ గవర్న రయిన చాంగ్ హసన్ అను నతడు పెకింగ్ ను వశపరచుకొని, హసువాల్టుంగ్ అను మంచూ రాకుమారుని సింహాసన మెక్కించెను. కాని, ట్వాంచిజుయి వారిని వెడలగొట్టి, లియువాన్ హుంగ్ ను పునరుద్ధరించెను. ట్వాంచిజుయి వర్గము బలపడక పూర్వమే వారిని తొలగించి, వూ పైపు నేనాని అధికారమును హ స్త గత మొనర్చుకొని చోకన్ సేనానిని, ఆ తరువాత లియున్ హంగ్ ను అధ్యక్షులను గావించెను. దక్షిణ రాష్ట్రములను గూడ ఆక్రమించుట వూపైపు సేనాని సంకల్పము.
కాన్టన్ ప్రజాస్వామ్యము : యువాన్ సైనిక నియం తృత్వము పట్లను, జపాను దురాక్రమణముల పట్లను నిర సనగా దక్షిణరాష్ట్ర ప్రజలు తిరుగుబాటు ప్రారంభించిరి. 1916 లో సన్ యట్ సేన్ వీరికి నాయకత్వము వహించి, కాన్ టన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వమును స్థాపించెను. కాని ఆతని సర్వ సై న్యాధ్యకుడైన చన్ చుంగ్ మింగ్ (చన్ హక్కా) వూవైపు సేనానితో ' కుట్రపన్నుటచే, సన్యట్ సేన్ కాన్స్టన్ విడిచి షాంఘైకి పారి పోవలసి వచ్చెను. కొండజాతి బందిపోటు దొంగ యగు చన్ హక్కాను విశ్వసించుట సన్ చేసిన మరియొక పొరపాటు. వర్సెయిల్సు శాంతి సమావేశము: కాంటన్ ప్రభుత్వ పక్షమున టి. వి. సూంగ్ వర్సెయిల్సు శాంతిమహాసభకు హాజరైనాడు. చైనా అభివృద్ధికి అంతర్జాతీయ సహా యము నర్థించుచు, ఒక పథకమును ఆ సమా వేశమునకు సన్ సూచించెను (International Development of China). సన్ సూచనలను తిరస్కరించుటయే గాక, శాంతి సమావేశము జర్మనీకి చెందిన పాస్టింగ్ రాష్ట్ర మును జపానువారి పర మొనర్చెను. ఈ సంధిపై సంతక మొనర్చుటకు చైనా నిరాకరించినది. మే, 1919 లో విశ్వ విద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గముల వారును కలిసి వర్సెయిల్సు సంధిని ప్రతిఘటిం చుచు, దేశ వ్యాప్తమగు ఉద్యమమును సాగించిరి. 1922 లో జరిగిన వాషింగ్ టన్ సమావేశమున పాశ్చాత్య రాజ్యములవారు చైనా స్వాతంత్ర్యమును, ఐక్యమును