చైనాదేశము (చ) యుండెను. బాక్సర్ విప్లవ సందర్భములో రష్యా సైన్య ములు మంచూరియా నాక్రమించెను. అందుకు జపాను అభ్యంతరముచెప్పెను. కాని రష్యా లెక్క చేయ లేదు. ఆసి యాలో, రష్యా సామ్రాజ్య విస్తరణము జపాను కే కాక, ఆంగ్లేయులకు గూడ కంటకముగా నుండెను. అందు చేత 1902 లో ఇంగ్లండు, జపాను దేశములు సంధి చేసికొని మైత్రి వహించెను. ఇది అవకాశముగా, జపాను రష్యా పై యుద్ధమునకు దిగెను. ఈ యుద్ధమున రష్యా ఓడిపోయి పోర్ట్సుమత్ సంధి (1905) చేసికొని, కొరియాను, లయో టంగ్ ద్వీపకల్పమును, సాఖలీను ద్వీపములో అధిక భాగమును జపానున కొసగుటయేగాక, మంచూరియా నుండి వైదొలగుట కంగీకరించెను. రష్యాపై జపాను విజయము, పరాధీను అయిన ఆసియా ప్రజలలో ఆత్మ విశ్వాసమును కలిగించినది. చైనా సంస్కరణోద్యమము: జపాను విజయ ము మంచూ ప్రభువుల కండ్లు తెరచెను. రాజమాతయు, క్వాంగ్ షు చక్రవర్తియు, సంస్కరణల ద్వారా చైనాను పునరుజ్జీవింప సమకట్టిరి. సైన్యము నందును, పరిపాలన లోను, పెక్కుమార్పులు తేబడెను. బానిసత్వము రద్దు చేయబడెను. పరీక్షలు నిలిపివేయ బడెను. ప్రభుత్వపు పాఠశాలలు అసంఖ్యాకముగ నెలకొల్పబడెను. వానిలో పాశ్చాత్య విద్యా విధానము అమలు జరిగెను. రాష్ట్రము లలో శాసనసభ లేర్పాటు చేయబడెను (1908). పాశ్చాత్య రాజకీయ, ఆర్థిక విధానములను పరిశీలించుట కొక సంఘ మును పంపి, వారి సూచనలను అమలు జరుపుదు మని మంచూ ప్రభువులు ప్రకటించిరి. 1908 లో రాజమాతయు, చక్రవర్తియు మరణిం చిరి. పసిబాలుడైన 'పూయి' సింహాసన మెక్కెను. ఆతని సవతి తల్లి 'లంగ్ యూ' అనునామె సంరక్షకురా లైనది. చైనాను దోచుకొనుచున్న విదేశ సామ్రాజ్య వాదుల కిది మంచి అవకాశమైనది. సంస్కరణోద్య మము వెనుకంజ వేసెను. పూర్వ పరిస్థితులు పునరుద్ధరింప బడెను. ప్రజల కిది పెద్ద అశాభంగమును కల్పించెను. అందుచే మంచూ రాజవంశము అంతరించి, ప్రజా స్వామ్య మేర్పడినగాని చై నాకు మోక్షము లేదను భావము ప్రజలలో తీవ్రరూపము వహించినది. 752 సంగ్రహ ఆంధ్ర జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమము; సన్యట్ సేన్: నాటి కే దక్షిణ రాష్ట్రములలో సన్-యట్ సేన్ జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమమును రూపొందించు చుండెను. సన్-యట్ - సేన్ (1866-1925) క్వాంగ్ టంగ్ రాష్ట్ర ములో నొక సామాన్య క్రైస్తవ కుటుంబములో జన్మించి, కాంటన్ లో వైద్యవృత్తిలో ప్రవేశించెను. టైపింగ్, బాక్సరు విప్లవములు ఇతనిలో దేశభక్తిని పురికొల్పినవి. మంచూ వంశమును కూలద్రోసి, ప్రజాస్వామ్యము ద్వారా చైనా నుద్ధరింపవలె నని సన్-యట్ సేన్ సంకల్పించెను. జాతీయత, ప్రజాస్వామ్యము, ఆర్థిక సమానత్వము (శాన్, మిన్, చుయి) ఆతని ఆశయములు. తన ఆశయములను సాధించుటకై ఆతడు 'హిసిన్ చంగ్ హై' అను సంఘ మును స్థాపించెను. అదియే తరువాత టుంగ్ మెంగ్ హుయిగా మారినది. 1904-1909 సం.ల మధ్య సన్- యట్ - సేన్ కియాంగ్సీ, క్వాంగ్ ంగ్ రాష్ట్రములలో తిరుగుబాటులు పురికొల్పి విఫలు డయ్యెను. అతడు జపాను, అమెరికా, ఇంగ్లండు దేశములలో టించి, ఆ తరువాత పర్య చైనాకు ఆ ప్రజల సానుభూతి, సహకారము లను బడయుటకై ప్రయత్నించెను. విప్లవ ప్రారంభము, రాచరికము రద్దు_1912: క్రమముగ జాతీయ విప్లవ జ్వాలలు దేశము నలుమూలలకు వ్యాపించి నవి. 1911 అక్టోబరులో హాంకో నగరవాసులు తిరుగు బాటు చేసిరి. అది పూచాంగ్ రాష్ట్రమునకు విస్తరించి నది. ప్రజల నణచుటకై ప్రభుత్వము పంపిన లీ యున్ హంగ్ సేనాని తిరుగుబాటుదారులతో చేరెను. ఒక దాని తరువాత నొకటిగా పదు నేడు రాష్ట్రములు స్వాతంత్య్ర మును ప్రక టించుకో నేను. ఈ రాష్ట్రములకు 1912 జనవరి 1వ తారీఖున సన్ యట్ సేన్ అధ్యక్షుడయ్యెను. విప్లవ ప్రభుత్వమునకు నాన్ ్వంగ్ రాజధాని యయ్యెను. పరిస్థితి విషమించిన దని గ్రహించి, మంచూ చక్రవర్తి విప్లవకారులతో సంప్రతింపులు జరుపుటకై యువాన్ షి కాయిని నియమించెను. కాని స్వార్థపరుడైన యువాన్ మంచూ రాచరికము రద్దగుటకంటె గత్యంతరము లేదని సలహా ఇచ్చుటచే, ఫిబ్రవరి 1912 లో మంచూ చక్రవర్తి సింహాసనమును పరిత్యజించెను. యువాన్ అధ్యక్షత క్రింద చై నాలో సమైక్య ప్రజాస్వామ్య మేర్పడగలదని ఆశించి,
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/818
ఈ పుటను అచ్చుదిద్దలేదు