పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/815

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 మున్నగు అనాగరిక జాతుల వారు చైనా పై దండెత్తిరి. వీరిలో మంగోలుల నివాస స్థానము అబ్బాయి కొండలు ; వారు వేట, పశుపాలనము వృత్తులుగా గల సంచార జీవ నులు, చాల క్రూర స్వభావులు. క్రీ. శ. 13వ శతాబ్దా రంభమున టెమూజన్ అను నాయకుడు మంగోలులను సమైక్య మొనర్చి, దండయాత్రలు ప్రారంభించెను. ఇతడే లోక విద్రావణుడైన చెంగిజ్ ఖాను. ఇతడు చైనా వై దండెత్తి హొయాంగ్ హో నదికి ఉత్తర భాగము నాక్ర మించెను. చెంగిజ్ ఖాను మనుమడైన కుబ్లయిఖాను, & (క్రీ. శ. 1259-1294) సుంగులను తొలగించి, చైనా నాక్రమించెను. ఖాన్ బాలీక్ అను నామాంతరము గల పీకింగ్ నగరము కుబ్లయిఖానునకు రాజధాని. సువిశాల మయిన మంగోలు సామ్రాజ్యమున కధిపతియైన కుబ్లయి ఖాను ఆస్థానము, పలు దేశములు రాయబారుల నాకర్షిం చెను. జినోవా (ఇటలీ) వర్తకుడు, సుప్రసిద్ధ ప్రపంచ యాత్రికుడును ఐన మార్కో పోలో అను నాతడు కుబ్లయి భాను ఆస్థానములో గౌరవము లందుకొ నేను. నా మంగోలులను తుదముట్టించి, ముయువాన్ చాంగ్ (హుంగ్ వు) మింగ్ వంశమును స్థాపించెను. ఈ వంశము వారు చై నా జాతీయులు : వీరు సుమారు 300 సంవత్స రములు పాలించి చైనా సంస్కృతిని పునరుద్ధరించి మెరు గులు దిద్దిరి. ఆంతరంగిక విప్లవముల వలనను, విదేశ దండయాత్రల వలనను మింగులు బలహీనులైరి. క్రీ.శ. 1644 లో మంచూ జాతులచే జయింప బడిరి. = చై నాలో మంచూ వంశము స్థాపింపబడెను. మధ్యయుగ సంస్కృతి : రాజకీయ కల్లోలములకు -గురియైనను, మధ్యయుగమున చైనా ఆర్థిక సాంస్కృతిక పురోగతిని సాధింపగలిగెను. జాతి ఆదాయమునకు ముఖ్య ఆధారమైన వ్యవసాయమునందు చక్రవర్తులు శ్రద్ధవహిం చిరి. రై తులకు భూములు పంచి పెట్టబడెను. టాంగ్ చక్రవర్తి లిషిమిన్ (క్రీ.శ. 627-649) "రైతుల నుండి ఎక్కువ పన్నులు వసూలుచేయు రాజు తన శరీరమాంస మును తానే భక్షించు మూర్ఖుడు" అట ! సుంగ్ ప్రధాని యైన వాంగ్ ఆన్ (క్రీ.శ. 1021-1081) ప్ర వేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజల శ్రేయోభివృద్ధికి దోహద మైనవి. ఇనుము, రాగి, వెండి, బంగారము మున్నగు 749 చైనాదేశము (చ) ఖనిజములు విరివిగా త్రవ్వబడెను. పరిశ్రమలు పెంపొం దెను; కై ఫెంగ్, లోయాంగ్, జుంకా మొదలైన నగరాలు పట్టుపరిశ్రమకును; కాంటన్, మింగ్ చౌ నగ రాలు విదేశ వాణిజ్యమునకును కేంద్రములైనవి. ఇంతటి గొప్ప ఐశ్వర్య సంపన్నమగుటచేతనే మార్కోపోలో చైనాను బంగారు దేశ మని అభినుతించినాడు. మంచూ చక్రవర్తియైన చీన్ లుంగ్ అను నాతడు సగర్వముగా ఆంగ్లేయుల కి విధముగా చాటగల్గెను. “మేము సమస్త ఐశ్వర్య సంపన్నులము; మా దృష్టిలో మీ వింత వస్తువు లకు విలువలేదు. కాబట్టి మీ దేశ వస్తువులతో మాకు పని లేదు.” బౌద్ధమతముతో బాటు చైనాలో మహమ్మదీయ క్రైస్తవ మతములు వ్యాప్తిచెందినవి. దేశ ఐశ్వర్యము, సారస్వత లలిత క ళాభివృద్ధిలో ప్రతిఫలించినది. సుప్రసిద్ధు లైన లిపో కవి (క్రీ. శ. 701-762), టుపు కవి అనువారు (క్రీ.శ.712-770) టాంగ్ చక్రవర్తుల పోషణము నందు కొనిరి. మింగ్ వంశస్థులు చైనా సంస్కృతికి మెరుగులు దిద్దిరి. చైనా భాషలో పెక్కు నిఘంటువులు, సచిత్ర విజ్ఞాన సర్వస్వములు ప్రచురింపబడెను. కొయ్యదిమ్మల పై సిరాపూసి అచ్చువేయు సాధనమును చైనీయు లీ యుగ మున నిర్మించిరి. కాగితము, అచ్చుయంత్రము సారస్వత వ్యాప్తికి చాల సహాయకారులైనవి. ప్రభుత్వ పరీక్షలు కూడ ప్రజలలో విద్యాభివృద్ధికి తోడ్పడెను. పీకింగ్ నగర మున కుబ్లయిఖాన్ ఒక విశ్వవిద్యాలయమును స్థాపించెను. ఆధునిక యుగము మంచూ రాజవంశము : (L§. 8. 1644–1911) మంచూ వంశస్థులు చైనా, టిబెట్, ఫార్మోజా, టర్కీస్థానుల నాక్రమించి, సువిశాల సామ్రా జ్యమును స్థాపించిరి. బర్మా, నేపాల్, అస్సాములు కూడ వీరి దండయాత్రలకు గురియైనవి. కొరియా, మంచూ చక్రవర్తులకు కప్పము చెల్లించెను. మంచూ చక్రవర్తులు చైనా సంస్కృతి నవలంబించి ఆదరించిరి. రాజ్యాంగ విధానమును కూడ యథాతథముగ ననుసరించిరి. కాని చైనా ప్రజలకు మంచూ చక్రవర్తులపట్ల గౌరవ విశ్వా సము లేర్పడలేదు. చైనా ప్రజలు వారిని విదేశీయులుగా, దు రాక్రమణదారులుగా నిరసించిరి. అందుచేత మంచూ చక్రవర్తులు దేశమున కీలక స్థానములందు సైన్యములు