విజ్ఞానకోశము = 8 చిత్రము - 218 చైనాదేశము (చ) లావాటి కింగ్ కన్ ఫ్యూషియస్ సమకాలికుడైన లౌజే (Lao tse) టోయీ మతమును (Toism) స్థాపించినాడు . ఈ మతస్థులకు లౌ జే రచించిన (పవిత్రమార్గము) అను గ్రంథమే వేదము. ఇందలి సిద్ధాంతములు చాలవరకు హేతువాద బద్దము అయి నవి. లౌ జేకూడ శీలమునకు ప్రాధాన్యము నిచ్చెను. కాని సంప్రదాయ సిద్ధములైన మూఢాచారముల పట్ల విశ్వాసమే సమస్త అనర్థములకు కారణమని అతడు చాటెను. అందుచేతనే కన్ఫ్యూషియస్ సంప్రదాయవాదులకును, లౌజే విప్లవవాదులకును మార్గదర్శకులై 8. టోయీ మతముకంటె, చైనాలో కన్ఫ్యూషి యస్ సిద్ధాంతములే ప్రజాదరణమును పొందినవి. చిత్రము - 219 పటము - 3 చైనా ప్రాచీన శిల్పము, డగోబా ప్రాచీన ధర్మసూత్రములను క్రోడీకరించి మానవతా వాదము పునాదిగా, విశిష్టమైన సాంఘిక రాజకీయ తత్త్వమును, కన్ ఫ్ఫ్యూషియస్ ప్రతిపాదించినాడు. ప్రశాంతమైన కుటుంబమునకు ఆధారమైన సహనము, సామరస్యము, సౌమనస్యము, విశ్వాసము, భక్తిప్రప త్తులు మొదలైన గుణములే ప్రజలందరిలోను, ప్రజల కును ప్రభుత్వమునకును మధ్య ఏర్పడి నప్పుడే మానవుడు సుఖముగా జీవింపగలడు. ప్రపంచము శాంతిధామము కాదు అనునదే కన్ఫ్యూషియస్ తత్త్వములోని సారాంశము. కన్ఫ్యూషియస్ రచనలను నిన్న మొన్నటి వరకును చైనాలో కంఠస్థము చేయుచుండెడి వారు. చైనా విద్వత్తుకు అదియే గీటురాయియై యుండెను. 747 పటము - 4 కన్ ఫ్యూషియస్ అందుకు మెన్సియస్ (క్రీ. పూ. 372-289), హ్సుజు (క్రీ.పూ. 320 - 285), అను దార్శనికులు కారణము. వీరు కన్ ఫ్యూషియస్ సిద్ధాంత ములకు వ్యాఖ్యానములు రచించి ప్రజలలో ప్రచార మొనర్చిరి. “మానవుడు సహజముగా నీతిపరుడు. అవినీతికి దుష్టశక్తుల ప్రభావమే కారణము. ప్రేమ, ధర్మము, నశించినప్పుడు మానవులను మృగములు భక్షించుటేగాక, మానవు లొకరి నొకరు భక్షింతురు” అని మెన్సియస్ బోధించెను. హ్సుజు సిద్ధాంతములకును భారతదేశములోని చార్వాక దర్శనమునకును పోలిక లున్నవి. బౌద్ధము :
- ఈ మతములకు తోడుగా, ఇండియానుండి