విజ్ఞానకోశము = 8 చైనాదేశము
యత్నించుచు తాంగ్ కళాకారుల యొక్క వాస్తవికతా రూపమును విస్మరించి, సంప్రదాయపు విలువలపైన మాత్రమే ఆధారపడుచు, దృగ్గోచర ప్రదేశ చిత్రములను మోనోక్రోం వాషుల తోనే వారు నిర్వహించిరి. అట్టి ప్రదేశ చిత్రములతో బాటు ఒక అడవిబాతుల ఆకాశపథ విహారమునకు సంబంధించిన విడ్డూరపు భ్రమాన్విత దృశ్యమో, లేక ఒక గండళై లాంచలమున నున్న పక్షి మున్నగు నవియో కళాకారుల అభిరుచి పాత్రములైన విషయములై యుం డెను.
యూయన్కు చెందిన మంగోలియన్ రాజవంశపు (క్రీ. శ. 1280-1888) పోషణ క్రింద ఔత్తరాహ - దాక్షిణాత్య చిత్రకళా సంప్రదాయముల మధ్య సరిసమా నత్వము రక్షితమయ్యెను. సంగ్ యుగపు ప్రదేశ చిత్ర సంప్రదాయములలో ఇంద్రియముల యొక్కగాని, బుద్ధి యొక్క గాని శక్తివలన గ్రహించెడు అత్యల్ప వ్యత్యా సమునందు ప్రేమ, ఆకార రేఖలులేని చిత్రణములు - లిపి కళతోను, కవితా కళతోను సన్నిహిత సంబంధము పరిపోషింపబడెను.
మంగోలు జాతివారిని పరాజితులు నొనర్చిన మింగ్ సమ్రాట్టులు (క్రీ. శ. 1888-1644) ప్రాచీన సంప్రదాయ తత్త్వమును పునః ప్రతిష్ఠించిరి. అందు వారు సంప్రదాయమును దృఢీకరించిరి. తన్మూలమున కళ యందు క ళాత్మక దృష్టి ఏర్పడెను. ఆ దృష్టి చింగ్ (రాజుల) యుగమున (క్రీ. శ. 1644-1912) ప్రబలమయ్యెను. కళాకారులు తమ ప్రాచీనుల చిత్రకళా లక్ష్మిని జూచి అత్యంత ముగ ముగ్ధులై తమ రచనల యందు ప్రాచీన చిత్రలేఖన సంప్రదాయములనే దృఢముగ ననువదించిరి. ఈ ప్రవృత్తి శేషించిన కళలకు కూడ సాధారణమయినది. దృగ్గోచర ప్రకృతి దృశ్యములలో ఏక వర్ణమునే వాడవలయునను నిర్బంధ నియమమును ఉల్లంఘించుటచే అసంఖ్యాక ములయిన వర్ణముల మిత్రీకరణమునకును, క్షుద్ర చిత్రకళా సన్ని వేశముల కొరకై యత్నించుటకును, అలంకరణము నకు అతి మాత్రమయిన ప్రాధాన్య మొసగుటకును అవకాశము కలిగినది. దృగ్గోచర ప్రకృతిదృశ్య చిత్రణము నర, మృగ, పక్షి విగ్రహ సంతానముతో క్రిక్కిరిసియుండు నట్లు చేయబడెను. ఐనను అనేకము లయిన అత్యుత్తమ కళాఖండములలో సయితము, తాంగ్-సంగ్-యుగ చిత్రకళ యందలి గాంభీర్యము, అభినివేశము మరల సిద్ధించి నవి కావు.
చైనా దేశమున రాజరికము (Monarchy) 1912 వ సంవత్సరము నందు అంత మొందుటతో, ప్రజాస్వామిక ము (Republic) స్థాపిత మయ్యెను. ఇపుడు చైనాకు పశ్చిమ దేశములతో ఎక్కువ సంబంధము ఏర్పడినది. అప్పటి నుండి చైనా చిత్రకళయందు రెండు తెన్నులు (trends)- పాశ్చాత్య పద్ధతి, జాతీయ పద్ధతి అనునవి రూపొం దెను. జూపియన్ (Jupeon), చైపై షీ (Chai pai sheih) అనువారు అత్యంత విఖ్యాత, సమకాలిక చిత్రక ళా కోవి దులలో పేర్కొనదగిన వారు. చైనా యందు ప్రజాప్రభుత్వము ఏర్పడిన తరువాత చిత్రకళా వస్తువుల వరణమునందు సాంఘిక వా వాస్తవిక తను మాత్రమే చిత్రించుటకు చైనా ప్రభుత్వము వారి ప్రోద్బలము ఎక్కువగుటచే, చైనా దేశపు చిత్రకళయందు మినుకు మినుకు మనుచున్న ఆనంద గుణమును చైనీయులు కోల్పోయినారు.
జ. మి.
చైనాదేశము (చ) :
పేరు - ఉనికి : చైనాదేశమును ప్రాచీన కాలమున “చుంగ్ హ్వామిన్ కువో” అని పిలిచెడివారు ; అనగా “మధ్య పుష్పరాజ్యము" అని అర్థము. దీని సంక్షిప్త రూపమే “చుంగ్ కువో”. చైనా అను పేరు చిన్ రాజ వంశము వలన వచ్చినది. చైనా దేశము 15°48" ఉత్తర అక్షాంశము నుండి 58°35" ఉత్తర అక్షాంశము వరకును, 73°31" తూర్పు మధ్యాహ్న రేఖనుండి 135°2" తూర్పు మధ్యాహ్న రేఖ వరకును విస్తరించి యున్నది. ఉత్తరమున సోవియట్ రష్యా; పశ్చిమమున మంగోలియా; ఈశాన్యమున కొరియా; తూర్పున పసిఫిక్ మహాసముద్రము; దక్షిణమున బర్మా, ఇండో - చైనాలు చైనాకు ఎల్లలు. వీని మధ్య, హోయాంగ్ హో(పచ్చనది), యాంగ్సి, సికియాంగ్ (పశ్చిమనది) నదుల పరీవాహ ప్రదేశమే చైనా నడిగడ్డ. ఈ ప్రాంతము 18 రాష్ట్రములుగ విభజింపబడి యున్నది. ఇవిగాక మంచూరియా, అంతర మంగోలియా, సింకి