పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/804

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చైనా చిత్రకళ 740 సంగ్రహ ఆంధ్ర

జీవుడు ఆశ్రితుడు. ఈ యిరువురికిని గల సంబంధము ఏకత్వమును, భేదత్వమును. ఇదియే చైతన్య వేదాంత సంప్రదాయముయొక్క సిద్ధాంతము..

తుమ్మెదయు, మధువు వేర్వేరు. అయినను తుమ్మెద మధువుకొరకు పైని ఎగురుచు, ఆ మధువును గ్రోలి నప్పుడు తుమ్మెద యొక్క పూర్ణగర్భముననే మధు వుండెను. అనగా దానితో ఏకత్వము చెందెను. అటులే జీవుడు పరమాత్మతో మొదట వేరుగా నున్నను నిశ్చల ముగా నిరంతరము పరమాత్మనే వెదకుచుండును. జీవుడు ప్రేమఫలితముగా పరమాత్మమయు డయినప్పుడు తన వ్యక్తిత్వపు టునికినిగూర్చి విస్మృతు డగును. అంత భగ వంతునితో లీనమగును. దీనినే నిర్వికల్ప సమాధిస్థితి యందురు. అప్పుడు ప్రతి జీవాత్మయు భగవంతునితో సారూప్యము చెందును. అయినను వీరిరువురును నిక్క ముగ భిన్నులే.

కృష్ణుడు మాయాశక్తి యొక్క అధిపతి ; జీవుడు ఆ శక్తియెక్క దాసుడు. జీవుడు శృంఖములను త్రెంచి పారవై చినపుడు తన ప్రకృతిని, తనకును భగవంతున కునుగల సత్యసంబంధమును ప్రస్ఫుటముగా చూడగలడు. భక్తి - ప్రేమమార్గమున నే శ్రీకృష్ణ పరమాత్ముని సేవించి, మోక్షమును పొందవలయును.

చైతన్యస్వామి ధైర్యశాలియైన సంఘ సంస్కరణ పరాయణుడు. అతడు కులభేదములను పాటించలేదు హిందూమతములోని కర్మకాండను ఆతడు ఖండించి నాడు. బ్రాహ్మణులును, చండాలురును, ముస్లిములును, ఆతని సంప్రదాయమునందు చేరి యుండిరి. "ప్రేమిం చుట, ధర్మము చేయుట” అనునవే చైతన్య సంప్రదా యమునకు విశిష్టాదర్శములు. చైతన్యస్వామి వర్గము వారు ఉదారాశయులై యుండుటచే ఆ మతము ప్రాకృత జనముయొక్క విశాలాదరణమునకు పాత్రమయ్యెను.

శ్రీచైతన్యదేవులు పవిత్రమూర్తి. లోకకల్యాణార్థ మే ఈ మహాపురుషు డవతరించెనని పెక్కుమంది విశ్వాసము. భక్తులపాలిటి పెన్నిధిగా నితడు ప్రసిద్ధి చెందెను.

ఈ మహానుభావుని చరిత్రము అద్భుత సంఘటనములకు ఇరువయినట్టిది. ఈతని దర్శన, స్పర్శనాదుల వలనను. ప్రబోధము వలనను, దుష్టులు శిష్టులయిరి; చోరులు

సద్వర్తనులైరి; దురహంకారులు వినీతులై 8; రోగులు నిరోగులైరి. ఇట్లు అందరను చైతన్యమహాప్రభువు తన ప్రభావమున భగవద్భక్తి యొక్క పావనమార్గములో పడవేసెను. సులభ తరణోపాయమునకు దారి చూపిన వాడు శ్రీ శ్రీకృష్ణ చైతన్యదేవుడు.

నవద్వీపనగరములో నిత్యానందుడును, శాంతిపురము నందు అద్వైతాచార్యులును, గురుపీఠముల నధిష్ఠించి, ఆధ్యాత్మిక విషయబోధకులైరి. ఈ మతానుయాయుల కొరకు ` బెంగాలులోను మధుర లోను, బృందావనము లోను పెక్కు దేవాలయములు వెలసినవి. నవద్వీప ములో చైతన్యస్వామి కంకితమైన మందిరము కలదు. ఉత్తర సిల్హటులో ఢాకా దక్షిణము చెంత చైతన్యస్వామి మందిర మొకటి కలదు. అది గొప్ప యాత్రాస్థలము. అచటికి వేలకొలది భక్తులు వచ్చుచుందురు. రాజషాహి జిల్లాలోని భేతూరునందు చైతన్యస్వామి కంకితముగా ' ఒక దేవాలయము కలదు. అక్టోబరు నెలలో ఇచ్చట గొప్పగా మత సమ్మేళనపు జాతర జరుగును. ఈ యుత్స వమునకు 25,000 మంది జనులు వచ్చుచుందురు.

చైతన్యస్వామి సాంప్రదాయికులు నుదుట తెల్లని తిరుమణి గీతలను రెండింటిని నిలువుగా దిద్దెదరు. ఈ రెండు గీతలను కనుబొమలమధ్య కలిపి, అచ్చటినుండి నాసికాగ్రమువరకు ఒక గీతను పొడిగించెదరు. మూడు పేటలుగల తులసిపూసల హారము వీరు ధరించెదరు. తులసి పూసల హారమును జపమాలగా ఉపయోగించెదరు. వీరు గురువులను ప్రభువు లందురు. శ్రీ శ్రీకృష్ణచై తన్య స్వామిని మహాప్రభు వందురు.

ఆ. వీ.

చైనా చిత్రకళ :

మానుషములును, విశ్వజనీనములును అగు శాసన ముల మధ్యగల సమ్మోహనమయిన మైత్రి యందలి విశ్వాసము పై చైనీయుల మతము ముఖ్యముగా ఆధార పడియున్నది. మనము పూర్వులకు ఒనర్చు పూజ ఈ విశ్వజనీన మైత్రికి దోహద మొనర్చును. ఎందుచేతనన, మృతుల ఆత్మలు మాధ్యస్థమును వహించును. ఈ మతము యొక్క నైతిక ధర్మశాస్త్రమే పౌర ధర్మశాస్త్రము కూడ నై యున్నది. అది క్రీ. పూ. ఆరవ శతాబ్దిలో కన్