చైతన్య మహాప్రభువు 738 సంగ్రహ ఆంధ్ర
వాసుదేవ సార్వభౌమ భట్టాచార్యులు అనువార లిద్దరు చై తన్య స్వామి క నుయాయు లయినట్లు తెలియుచున్నది. ఈ విధముగా అచ్చట ఈ నూతన సంప్రదాయమునకు సుస్థిర స్థానము లభించెను. తరువాత చైతన్యుడు దక్షిణ భారతము నందును, పశ్చిమభారత మునందును చాలవరకు సంచారము చేసెను (1509-1511). ఈ సంచారమునందు త్రోవపొడుగునను తన నూతన పవిత్ర సం దేశమును ప్రబోధించుచు పోయెను. ఈ సంచారమునుండి తిరిగి వచ్చిన తరువాత, కొద్ది నాళ్ళకే అట్లే ఉత్తరభారతము నందును సంచారము చేయుచు బృందావనము వరకును వెడలెను. ఈ ప్రయాణ సందర్భమున ఒక సారి వారణాసియందు ప్రకాశానందు డను పండితునితో త త్త్వవిచారమున చైతన్యుడు వాదోపవాదములు సలిపెను. ప్రకాశానంద స్వామి శ్రీ శంకరాచార్యుల వారి అద్వైత వేదాంత వాదియగు పరివ్రాజకుడు. శంకరులవారు వేదాంత సూత్రములపై వ్రాసిన భాష్య మును చైతన్యుడు ఖండించి, శంకరులు వేదాంత సూత్రముల స్పష్టార్థమును క్లిష్ట పరచిరని చెప్పెను. శంకరాచార్యులవారు బాదరాయణుని సరళభావములను తెలు పక, తన భావములనే బలవంతముగ వాటియందు జొనిపినా రనియు, వేదాంత సూత్రకారుడు పరిణామ వాదమును అంగీకరించి యుండగా, శంకరులు దానిని తిరస్కరించి తన వివర్త (మాయా) వాదమును తెచ్చి పెట్టినా రనియు, చైతన్యుడు విమర్శించెను. చైతన్యుని అభిప్రాయము ప్రకారము పరిణామవాదమే సత్యమైనది, సమంజన మయినది. ఆ కాలములో బృందావనములోని పవిత్ర స్థలము లన్నియు నిర్జనములై యుండెను. వాటిని జనులు మరచి పోయియే యుండిరి. చై తన్యస్వామి ఉపదేశానుసారము బెంగాలులోని వైష్ణవో త్తములు బృందావన క్షేత్రమును సుస్థితికి తెచ్చిరి. ఆ పుణ్యస్థలము ఒక ప్రముఖ ధర్మక్షేత్ర ముగా మారినదని చెప్పినచో అది వైష్ణవ మతచరిత్రలో ఘనమైన సంఘటనముగా ఎంచవలసి యున్నది. బెంగాలు ముస్లిం ప్రభువునొద్ద ఉన్నతాధికారులగు నిద్దరు హిందు వులు ఆ ఘనకార్యమును నిర్వహించిరి. చైతన్యప్రభువు బృందావనమునకు ప్రయాణము చేయు సందర్భమున ఆ యిద్దరకు చైతన్యస్వామి దర్శనము లభించెను. వీరిద్దరు చైతన్యస్వామికి పరమభక్తు లయిపోయిరి. వీ రూప గోస్వామి, సనాతన గోస్వామి అను నామముల ప్రసిద్ధి చెందిరి. వీరు బృందావనములోనే నివసింప సాగిరి. 15 నుండి 1533 లో పరమపదము చెందువరకు చైతన్యప్రభువు జగన్నాథపురి క్షేత్రములోనే నివసించి యుండెను. అచ్చట నున్నంత కాలము చైతన్య మహా ప్రభువు తన నూతన ధర్మోపదేశములను వివరించు వ్యాఖ్యాన ప్రసంగములను చేయుచుండెను. ఈ ప్రసంగముల మధ్య ఒక్కొక్కప్పుడు చైతన్య మహాప్రభువు నిర్వికల్ప సమాధి నిష్ఠుడై, దివ్యానుభూతులను పొందు చుండెను. అతని జీవిత మందలి తుది 12 సంవత్సరము లలో భక్త్యావేశము అత్యంతముగ పెరుగ, ఆయన ఎల్లకాలము మతోద్రేక మునకు పరవశుడై యుండుచుండెను. ఈ పారవశ్యమును వైష్ణవ వాఙ్మయములో "దివ్యా నందము” లేక “ప్రేమానందము” అనియెదరు. భగవంతుడు మానుష వేషము తాల్చి మనుష్యులలో శ్రీకృష్ణ రూపమున అవతరించినాడు. అనన్య భక్తితో ఆ కృష్ణుని ధ్యానించుటయే, సేవించుట యే మోక్షసిద్ధికి హేతు వగును. కాని రాధాకృష్ణ సంబంధ మయిన మధుర భక్తి యెడ చైతన్యస్వామి భక్తి ప్రపత్తులు ప్రగాఢములై వరలెను. ఈ మధురభక్తి భావమును ఈ ఇంక నే మతప్రవక్తయు ఇంత గాఢముగ ప్రవచనము చేసియుండ లేదు. ఈ ప్రేమకు శారీరక సంబంధము లేదు. చైతన్యప్రభువు దానిని ప్రగాఢాధ్యాత్మిక తత్త్వముపై నిలి పెను. తన సంప్రదాయము శృంగారవిహార పథములో పడి భ్రష్టము కాకుండ చైతన్యప్రభువు తగు జాగరూకత తీసికొనెను. “ఈ సమాజములో స్త్రీలు చేరకూడదు ; తన సంప్రదాయ భ క్తులు స్త్రీలతో ఎట్టి సంగతి కలిగి యుండకూడదు" అని మహాప్రభువు శాసించెను. చైతన్య మహాప్రభువు ఉపదేశములనుండి ఘన మైన వేదాంత తత్త్వవాఙ్మయము వర్థమానమై యున్నను, ఆతడు విద్యా విజ్ఞాన సంప దావశ్యకతను గణించలేదు. తాను చెప్పి, చేసి, హృదయపూర్వక మయిన ఉత్సాహ భక్తి ప్రపత్తులను తన జీవితమునందే కనబరచి, హరి-కృష్ణ