పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/797

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 8 735 చెవి-ముక్కు-గొంతు


గాలిని అడ్డగించును. ఇందులకు శస్త్రచికిత్స చేయవలెను. ముక్కు ఆవలికొనకు సమీపమున గల సప్తపద యొక్క భాగమునందు పుట్టకురుపు లేచుట అరుదైన విషయము కాదు. అది కప్పి వేయబడిన స్థానములో నుండుటచే, తొలిదశలో నే ఆ విషయమును గ్రహించుట సాధ్యము కాక పోవచ్చును. ఇది నాడీ సంబంధ మైన చిహ్నములు గోచరించుటకు కారణమగును.

అడినాయిడ్సు : మృదువైన అంగిలికి పైన సాధారణ ముగా ఒక చిన్న శోషరస ధాతు వుండును. ఒకప్పు డది పెరిగిపోవును. నోటిద్వారా వ్రేలు పెట్టి చూచినచో అది తగులును. అందు వలన ముక్కుతో గాలి పీల్చుకొనుటకు ఆటంకము కల్గును. అప్పుడు ఆ శిశువు నోటితో గాలి పీల్చుకొనును. ముక్కు కారుట, నిద్రలో గురక, పాఠ శాలలో మందస్థితిలో నుండుట జరుగును. అడినా యిడ్సును తొలగించి, ఈ పరిస్థితిని సులభముగా సరిదిద్ద వచ్చును.

మృదువైన అంతరళ పక్షవాతము ఘటసర్పి రోగము వచ్చిన తరువాత, అంతర్గళ పక్షవాతము వచ్చుట సాధారణమైన విషయము. తరువాత సాధారణముగా 3, 4 వారములలో ఈ పక్షవాత రోగము కనబడును. శిశువు తన నోరు తెరచుకొని 'ఆ' అనినప్పుడు మృదువైన అంగిలి పైకిపోదు. శిశువు ముక్కుతో మాట్లాడును. శిశువు ఏదైన వస్తువును, ముఖ్యముగా ద్రవ పదార్థమును మ్రింగిన యెడల అది ముక్కుల ద్వారా వచ్చును. అది తరచుగా కొద్దివారములలో నయమగును. బయటికి

సవాయి : పుట్టుకతోనే సవాయి వ్యాధి వచ్చిన యెడల ముక్కు యొక్క వంతెన కుదించుకొని పోవును. ఒక్కొ క్కప్పుడు బిడ్డ యొక్క గట్టి అంగిలి సవాయి వ్యాధికి గురి యగును. అందులకు చికిత్స జరగని యెడల గట్టి అంగి లిలో ఒక రంధ్రము ఏర్పడి నోటి రంధ్రము ముక్కుతో కలసి పోవును. అందు వలన మాట్లాడుటకు అవరోధము కల్గును.

ముక్కులోని శరీరాశ్రిత క్రిములు : దుర్గంధము, ముక్కు కారుట యున్న యెడల ఈగలు లోనికి పోయి గ్రుడ్లను పెట్టవచ్చును. ఆ గ్రుడ్లు పొదగబడి ప్రాకుట మొదలు పెట్టును. ఇందులకు అవలంబింప వలసిన పద్ధతులలో క్లోరోఫారము ఇచ్చుట ఒకటి. అందువలన అవి చచ్చి బయట పడును. లేక ఏదేని నూనె పదార్థమును తరచుగా రెండు ముక్కుల లోనికి పంపుదురు. ఆ పురుగులు ఉక్కిరి బిక్కిరియై బయటికి వచ్చునట్లు చేయుటయే ఇందలి ఉద్దే శ్యము. రోగి తన ముఖముపై గాజు గుడ్డను వేసికొని పరుండ వలెను. అ అట్లు చేసినచో ఈగలు లోనికి పోయి గ్రుడ్లు పెట్టుటకు అవకాశముండదు..

గొంతుక

ముక్కును, నోటిని వాటి క్రిందనున్న మార్గము లతో కలుపు సాధారణ మార్గము గొంతుక. నోరు తెరచి నాలుక మూసికొన్నచో శ్వేతధాతువు యొక్క ఒక చిన్న ముద్ద మనకు ఇరువై పుల కాన వచ్చును. దానినే ఉపజిహ్విక (టాన్సిల్) అందురు. టలు

1. తీవ్రమైన ఉపజిహ్వికవాపు (టాన్సిలిటిస్) : క్రోకల్ ' సంపర్కదోషము వలన ఉపజిహ్వికులు ఎర్రనై, వాచి, నొప్పి కలుగును. మ్రింగినపుడు నొప్పిపుట్టును. చిలుకాస్థి యొక్క (మాండిబిల్) కోణమువద్దగల మాంస చిత్రము - 214 పటము - 5 గొంతు 3 2 1. నాలుక 2. ఉపజిహ్విక (టాన్సిల్) 3. కొండనాలుక