చెవి-ముక్కు-గొంతు 734 సంగ్రహ ఆంధ్ర
ప్రత్యేక ద్వారముల ద్వారా ముక్కులోనికి తెరచు కొనును.
చిత్రము - 213 పటము - a - 4 ముక్కు ముక్కును, దాని చుట్టునుగల ఎముకలను అడ్డముగా కోసిన యెడల కనబడు భాగము. 1. మాగ్జిలరీ సైనన్లు 2. ముందువైపు నైనన్లు 3. ముక్కు రంధ్రములు.
ముక్కుకొన తరుణాస్థితోను, ముక్కు వంతెన నాసి కాస్థుల ద్వారాను తయారుచేయ బడినది. కంటినుండి కన్నీటిని తీసికొని పోవు కాలువ ముక్కులోనికి తెరచు కొనును.
పుట్టుకతో వచ్చు అంగ వైకల్యములు ముక్కునకు సంబంధించిన అంగ వైకల్యములను శస్త్రచికిత్స ద్వారా సరిదిద్దవచ్చును.
గాయములు : గాయము కలుగుట వలన నాసి కాస్థులు విరుగుట సంభవించిన యెడల, ఆ యెముకలను అమర్చి కట్టుకట్టి తద్వారా వాటిని సరిదిద్దవచ్చును. ప్రమాద వశమున ముక్కు కోసుకొని పోవుట సంభవించిన యెడల, దానిని ప్లాస్టిక్ శస్త్రచికిత్స చేసి, సరి చేయ వచ్చును. ముక్కులోనికి పోయిన బలపములు, గింజలు మొదలగు వాటిని తీసి వేయ వచ్చును.
ముక్కరములను వేరుపరచు గోడ (సెప్టం) స్థానము తప్పుట : ఈ గోడ మధ్యలో నుండుటకు మారుగా, ఒక ప్రక్కకు వంగి ముక్కులో ఒక భాగమునకు అడ్డంకిగా నుండును. ఇందువలన ఉబ్బసవ్యాధి లక్షణముల వంటివి గోచరించు చుండును. ఇందుకు తగిన శస్త్రచికిత్స చేసి దీనిని సరిదిద్దవచ్చును.
సైనుసైటిస్ : ముక్కులోనికి తెరచుకొను సైనస్ లు వాచిపోవుట, విష పైత్య (ఇన్ ఫ్లుయంజా) జ్వరము మొదలగు సంపర్క దోషములు వచ్చినపుడు సంభవించును. సైనస్ లో నొప్పులు, తలనొప్పి, జ్వరము వచ్చినట్లు, రోగి చెప్పును. సాధారణముగా కాపడము వలనను, ఆంటీ బయటిక్ ఔషధముల వలనను, ఎఫిడ్రిస్ నేసల్ చుక్కలు వేయుట వలనను, కొన్ని పర్యాయములు "షార్టువేవ్ థీరాపి" తీసికొనుట వలనను, సాధారణముగా తీవ్ర పరిస్థితిలో కూడ నయము కావచ్చును. వ్యాధి దీర్ఘ మైనచో, సై నస్ చీముతో నిండి, అందువలన దీర్ఘకాలిక మయిన అనారోగ్యమునకు కారణ మగును. సైనస్ రంధ్రమును పదే పదే కడుగుటయే ఇందులకు జరుప వలసిన చికిత్స. ఇందు వలన నయము కానిచో, ఇందుల కవసరమైన శస్త్రచికిత్స చేయవలెను.
ముకునకు తీవ్రమైన సంపర్క దోషములు సంభవించుట : రొంప, విషపై త్యజ్వరము, పొంగు మొదలగు వ్యాధులు వచ్చినప్పుడు ముక్కు తీవ్ర సంపర్క దోషమునకు గురియై యెక్కువగా కారుచుండును. ఒకేవైపున కారుట, అన్య పదార్థ మేమియు లేకపోవుట జరిగినయెడల, అది “ నాసికో ఘటసర్ఫిరోగము" అని భావించవచ్చును.
ఎట్రోఫిన్ రైనటీస్ : ఈ పరిస్థితిలో, అనగా లోపలిపొర క్షయపడి, పక్కులు కట్టును; దుర్గంధముండును. దీనికి సంతృప్తికర మైన చికిత్సయే లేదు. ముక్కులో కాడ్ లివర్ ఆయిల్ చుక్కలు వేయుదురు.
గడ్డలు : ముక్కులో గడ్డలు వచ్చుట సాధారణ విష యము. అవి గాలి రాకుండా అడ్డును. సైనోసై టిస్ వ్యాధిలో వీటి వలన సాధారణముగా క్లిష్ట పరిస్థితులు వచ్చును. వీటిని తీసి వేయుదురు. ముక్కు రంధ్రము ఆవలకొనను, కొండనాలుక లేక మృదువైన అంగిలికి పైనను సాధారణముగా గడ్డలు లేచి, క్రమముగా పెరిగి