పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/794

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెవి-ముక్కు-గొంతుక 732 సంగ్రహ ఆంధ్ర

చేరవేయును. మెదడులోని కేంద్రములు చెడిపోయిన యెడల, చెవి మామూలుగానే యున్నను, శబ్దములు వినబడినను, అందుండి మనమేమియు గ్రహింపలేము.

బయటిచెవి : చెవిలో గులిమి యుండుట ఇందలి సర్వ సాధారణస్థితి. గ్లిసరిన్ చుక్కలు వేసియు, పిచికారీ కొట్టియు చెవిని మృదువు పరచ వచ్చును. పిల్లలు చిన్న చిన్న వస్తువులను చెవులలో పెట్టుకొందురు. వాటిని తీసి వేయ వచ్చును. ఈ మార్గము వాచినచో దానిని "ఎక్స్ టర్నల్ ఓటైటిస్" అందురు. చెవి కదిపి నప్పుడు నొప్పి యుండును. కాపడము పెట్టుట మూలమునను; ఆంటీ బయటిక్ ఔషధముల మూలమునను ఈ పరిస్థితి గల వారికి స్వస్థత చేకూర్చ వచ్చును.

మధ్యచెవిపోటు : మధ్య చెవి యెక్కువగా వాచిన యెడల 'ఉల్లిపొర' ఎర్రగా నగును. ఆవాపు గొంతు నుండి కంఠ, కర్ణ నాళముల ద్వారా వ్యాపించును. విప రీతమైన నొప్పి యుండును. పెద్ద మోతాదులో ఆంటీ బయటిక్సు ఇచ్చిన యెడల అది సాధారణముగా తగ్గును.

ఒక్కొక్కప్పుడు గూబ పగిలి చెవినుండి చీము కారు చుండును. అటువంటి సమయమున గూబలో ఒక ఖ చేయవలెను. రంధ్రము చేసి దానిని క్లోరోమైసిటిన్ పొడితో మూడు వారములు శుభ్రపరచి అదిమానునట్లు

మధ్యచెవికి సంబంధించిన దీర్ఘ రోగము : వ్యాధి ప్రకో పించిన దశలో శ్రద్ధ వహించక పోవుట వలన చెవినుండి దీర్ఘకాలముగా రసికారుట సంభవించును. ఇందలి తీవ్ర క్లిష్టపరిస్థితులు : 3

మస్టోయిడైటిస్ : అనగా (1) 'మస్టాయిడ్ ' ఎముకలో వచ్చు నొప్పి. (2) సప్తమనాడికి పక్షవాతము (3) సంపర్క దోషము పై కి వ్యాపించి మెదడులో వ్రణమును కలిగించ పైకి వచ్చును. వినికిడి శక్తి కుంటుపడును. దాదాపు ఈ కేసు లన్నిటిలోకూడ శస్త్ర చికిత్స అవసర మగును.

లోపలిచెవి లోపలి చెవికి వ్యాధులు అరుదుగా సంభ వించును. కాని మధ్య చెవి నుండి లోపలి చెవికి సంపర్క దోషము వ్యాపించ వచ్చును. దీనినే 'లాబ్రిం ధైసిట్' అందురు. ఇందులకు శస్త్ర చికిత్స అవసర మగును.

1. చెవుడు: శబ్దము రెండు విధములుగ లోపలి చెవి లోనికి చేరును. వాయు ప్రసారము అనగా ధ్వని చెవి

రంధ్రముగుండాపోయి ఉల్లిపొరకు తగిలి దానిని అంటి "పెట్టుకొనును. అప్పుడు ఆ శబ్ద తరంగములు ఎముకలచే నిర్మితములైన ఆసికిల్స్ ద్వారా లోపలి చెవి లోనికి ప్రసారమగును. ఆ వాయు ప్రసారమును చెవిలో గులిమి కాని, మధ్య చెవి వ్యాధికాని, కంఠ కర్ణనాళములుగాని అడ్డగింప వచ్చును. ఈ పరిస్థితికి గల హేతువును చికిత్స చేయుట మూలమున తొలగించ వచ్చును.

2. నాడీ సంబంధమైన చెవుడు లేక నాడీ ప్రసారము: చెవి వెనుక నున్న మసాయిడ్ ఎముక మీద గడియారమును పెట్టిన యెడల ధ్వని నరముల ద్వారా లోపలికి పోవును. నాడీ సంబంధమైన చెవుడు వచ్చి నప్పుడు శబ్ద ప్రసారము తగ్గిపోవును. మామూలు పరిస్థితిలో నున్న వ్యక్తి వినినంత బిగ్గరగా అతడు విన జాలక పోవును. నాడీ సంబంధ మైన చెవుడు వచ్చినప్పుడు, ఒక్క పరిస్థితిలో తప్ప, ఏమియు చేయుట సాధ్యము కాదు, సవాయి వ్యాధి వలన అది వచ్చి నపుడు మాత్రము చికిత్స చేయుట సాధ్యమగును. లేనిచో వినుటకు వీలు కల్గించు సాధనమును అమర్చుకొనుట యే ఇందులకు చేయవలసిన నివారణోపాయము.

ఆటోస్కీరోసిస్ : అంకవన్నె ఎముక యొక్క 'స్టెపీస్' అను ఎముక లోపలి చెవికి గట్టిగా అనుబంధింప బడును. అనుబంధము ఎముక గా మారుటయే ఈ వ్యాధిలో చెవుడు వచ్చుటకు గల కారణము. కారణము. ఇట్టి కేసులలో సున్నితమైన శస్త్ర చికిత్స చేసి తద్వారా చెవిటి తనమును మొందించవచ్చును. అంత

టిన్నిటస్ : చెవిలో 'గుయ్' అను శబ్దము విన బడుట యని దీనికి అర్థము. 'లాబ్రింతై వెర్టిగోలో ' వలె అది ఒక్కొక్క తూరి ముమ్మరముగా వచ్చి స్వల్ప కాలము .తరువాత తగ్గిపోవును. లేక తీవ్రమగు నెత్తురు పోటు (బ్లడ్ ప్రెషరు) నందు వలె ఏకధాటిగా కొనసాగ వచ్చును. కుహరి కావయవములు పనిచేయుటలో కలిగిన కల్లోలమే ఇందులకు గల కారణము. మధ్య చెవి వ్యాధిలో క్లిష్ట పరిస్థితి రూపమున గూడ ఇది సంభవించ వచ్చును. క్వినైన్, శై లితములు (నేలిసి నేట్సు) వంటివి శరీరములో ఈ భాగముపై పనిచేసి, ఈ పరిస్థితికి కారణము లగును. బ్రొమైడ్ వంటి ఉపశమ నౌషధములను ఇచ్చి 'టిన్నిటిస్ ' వ్యాధిని నివారించ వచ్చును.