పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/792

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెన్నపట్టణము


తెలుగువారగు ముత్యాల వర్తకులపేర నిర్మింపబడిన పేటకు ముత్యాల పేట యనియు, పగడాల వర్తకులుండిన వీధికి పగడాల వర్తక వీధి (Coral Merchants Steet) అనియు పేర్లు వచ్చినవి. ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి యైన పెదనాయకుడు నివసించియున్న ప్రదేశము పెద్ది నాయని పేట యని పిలువబడుచు వచ్చెను. 'బ్రాడ్వే' అనువీధి ఒక కాలువగానున్న కాలమున తూర్పు పడ మరల యందుండిన ముత్యాలపేట, పెదనాయకుని పేట నడుమ, మార్గ మేర్పరచుటకై ఈ కాలువయందు మన్ను పోసి మరమ్మతు చేయబడినందున దానికి 'మన్నడి' యను పేరు కల్గినదందురు. రాయపురము రాయల పేర ఏర్పడి యుండవచ్చును.

వాషర్ మన్ పేట : మొట్టమొదట ఇంగ్లీషు వారితో బాటు, చాకలివారు రంగులు వేసెడివారు బందరునుండి చెన్నపట్టణమునకు వచ్చియుండిరి. వారు నూలును తడిపి ఉతికి, ఎండ వేసి, రంగులతో అద్దకముచేయుట కుపయో గించిన ప్రాంతము చాకలిపేటయని చాకలి పేటయని (వాషర్ మన్ పేట) పిలువబడుచు వచ్చెను. అచ్చట నివసించిన చాకలివా రందరు తెలుగువారు. బందరువారు కలంకారి అద్దక మునకు ప్రసిద్ధులుగదా !

జనసంఖ్య : 1689 లో చెన్న పట్టణమునందు 7,000 మంది జనులుమాత్ర ముండిరి. వీరందరు తెలుగువా రే. కొలదిమంది ఇంగ్లీషువారుండిరి. 1640 లో కోట పరి సరము లందు వసతిగృహము లేర్పరుపబడి యుండెను. ఈ ఈ గృహనిర్మాణముల కనేకులగు పనివారు అవసర మయిరి. ఇందువలన జనసంఖ్య క్రమముగా పెరిగెను. 1646 నాటికి దాదాపు 17,000 వరకు హెచ్చెను. అప్పటి కిని అందరు తెలుగువారే కాని తమిళు లున్నట్లు కని పించదు. దానితో జనాభా 1681 నాటికి రెండులక్షలును, 1685 నాటికి మూడు లక్షలును, 1691 నాటికి నాలు లక్షలు కాజొచ్చెను. 1774 నాటికి చెన్న పట్టణములో పట్టణ పరిసరములందుగాని ఎక్కడా తమిళులు లేకుండిరి. గాని, 1891 నాటికి జనాభా 5 లక్షలు. వీరు తెలుగు వారే యని విశ్వసింపవలెను.

17, 18 శతాబ్దులలో తెలుగువారు విశేషమైన పలుకు బడి కలిగియుండిరి. 1687 లో చెన్న పట్టణమందు ప్రప్రథ 730 సంగ్రహ ఆంధ్ర మముగా మ్యునిసిపాలిటీ ఏర్పడినపుడు, వెంకటాద్రి, ముద్దు వీరన్న, రంగనాథము అను మువ్వురాంధ్రులు అందు సభ్యులుగా నుండిరి. 1890 లో న్యాయస్థాన మేర్పడి నప్పుడు గూడ న్యాయాధిపతిగా ఆంధ్రుడే నియమింప బడెను. అతని పేరు రంగనాథము. ఆకాలపు ఇంగ్లీషువారి 'సీలు' (అధికారముద్ర) ఇంగ్లీషు, తెలుగు భాషలయం దుండెడిది. తెలుగుభాష రాజభాషగా నుండెను.

18 వ శతాబ్దాంతమునకు బందరు పట్టణమందుం డిన ఈస్టిండియా కంపెనీ ప్రాంతీయ కార్యాలయము ఎత్తి. వేయబడినది. అప్పటినుండియు చెన్నపట్టణమునకు, తెలుగు దేశమునకు రాకపోకలు తగ్గినవి. దీనికితోడు, చెన్నపట్ట ణమునుండి దక్షిణదేశమునకు, 19వ శతాబ్దిలో సౌత్ యిండియన్ రైలుమార్గము నిర్మింప బడుటచే దక్షిణ ప్రాంతమునకు చెన్నపట్టణమునకు సంబంధ బాంధవ్య ములు హెచ్చెను. దక్షిణాదిని ఉన్న తమిళులకు చెన్న పట్టణ ద్వారములు తెరచినట్లయినది. క్రమముగా చెన్న పట్టణముననున్న తెలుగు వారికిని, తెలుగు దేశముననున్న తెలుగు వారికిని నడుమ సంబంధములు దూరమయ్యెను. ఆకాలమున చెన్నపట్టణమునుండి తెలుగు దేశమునకు, తెలుగు దేశమునుండి చెన్నపట్టణమునకు రాక పోక లు చేయవలసి యున్నచో, సముద్రముపై ప్రయాణము చేయ వలసి యుండెను. స్థానికముగా అరవల ప్రాబల్యము హెచ్చసాగెను. చెన్నపట్టణమునకు ఆది పురుషులు ఆంధ్రులు. చెన్న పట్ట ణము ఆంధ్ర దేశములోనిది, చెన్నపట్టణము ఆంధ్ర నాయ కుల ఏలుబడిలోనిది. చెన్నపట్టణమున ఆంగ్లేయులు కాస్టార మిచ్చినవారు ఆంధ్రులు. చంద్రగిరిరాజుల పక్షమున రాజ్యము చేయుచుండిన దామెర్ల వెంకటప్పనాయకుని (వెంకటాద్రి నాయకుని) యనుగ్రహమున ఇంగ్లీ షువారి ప్రధానాధికారియగు సర్ ఫ్రాన్సిస్ డే యనువాడు 1630లో చెన్నపట్టణములో వ్యాపారార్థము గిడ్డంగులు కట్టుకొనుటకు ఆజ్ఞను పొందెను. సముద్రతీరము వెంట 5 మైళ్ళ పొడవున, కొన్ని మైళ్ళ వెడల్పుగల ఒక చీలికను, సామంతుడగు పూనమల్లి నాయక రాజు సర్ ఫ్రాన్సిస్ డేకు మంజూరి చేసి సనదు ఇచ్చెను. ఆ ప్రదేశమునకు ఈస్టిండియా కంపెనీ