పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/789

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - ఆ చెన్నపట్టణము

II వీరభద్రాలయములోని ఎఱ్ఱరాతి బండమీది శాసన భాగము.

“శ్రీ మద్రాజమార్తాండ రాజపరమేశ్వర శ్రీ వీర ప్రతాప సదాశివ రాయదేవ మహారాజులుంగారు వృధ్వీ రాజ్యం చేయుచుండంగాను శ్రీమన్మహామండ లేశ్వర రామరాజు తిరుమల జయ దేవ మహారాజులుంగారు కుమార తిమ్మనాయనింగారి నాయంకరానకు పాలించి యిచ్చిన నాగార్జునకొండ సీమలోని మాచెర్లకు ఉత్తర భాగాన చంద్ర భాగానదికి పడమర సం. కి 84 నాల్గుపుట్ల పందుం క్షేత్రము పాలిచ్చే లింగాపుర మనెడి అగ్రహారము కట్టించి ఈ సోమగ్రహణ పుణ్యకాలమందులు గంగాగర్భ మందుల ధారాపూర్వకంగాను సమర్పిస్తిమి గనుక ఆ లింగాపురాన నలుదరి పొలాలు హేమకూప తటాక నిధి ని షేపజలపాషాణ ఆగామి సిద్ధసాధ్యాలు అనెడి అష్టభోగ తేజు స్వామ్యాలు సమర్పిస్తిమి.”

III చంద్రవంక రోడ్డు వంతెనకు వాయవ్యదిశను ఉన్న పాడుపడిన గుడి వెంబడి శాసనము.

"కాకతీయ ప్రతాపరుద్రదేవ మహారాజులు సుఖ ముగా వినోదంబున పృథివీరాజ్యం చేయుచుండంగాను శక 1236 అగు ఆనంద ... మాచమనాయనింగారి... దేవర నాయనింగారు మహాదేవి చెఱువు సుఖాన పాలించుచు తమకు పుణ్యముకుగాను ధారాపూర్వకముగా సమర్పిస్తిమి."

(ఇతడు రెండవ ప్రతాపరుద్రుడు)

IV. పట్లవీడు శాసనము :

పట్లవీడు గ్రామమునకు 4 ఫర్లాంగుల దూరములోగల రాతిమీది శాసనముద్వారా శ. 1440 (క్రీ. శ. 1518) శ్రీకృష్ణ దేవరాయలు ఆ ప్రాంతమును గెలుచుకొన్న 2 ఏండ్లకు రామడకను మాచెర్ల చెన్న కేశవస్వామి కిచ్చి నట్లు తెలియుచున్నది.

కృష్ణదేవరాయల భూదాన ధర్మశాసన పత్రం.

“క్రిష్ణరాయ మహారాయ నాయంకరు నాగార్జున కొండసీమ రామడ గ్రామాను వారిరాగ పుణ్యకాల మున క్రిష్ణవేణి తిరుణోత్సవ వర్త ఏక్వనాథ సన్నిధియలు దానము పూర్వకముగా కృష్ణరాయ మహారాయనికి పుణ్యంగాను ధారపోసి సమర్పిస్తిమి. ఆ గ్రామమందలి చతురమూలలుం దాననిత్యాప జలవాహిని అందు మాచెర్ల చెన్న కేశవ దేవర అమృతపడి సయితం అంగ రంగ వయిభవము మల్లప్పనాయంకరు తిమ్మనాయంకరు అనుభవిం చేది, తిమ్మప నాయంకరు సమర్పించినది స్వదత్తాద్విగుణం పుణ్యం... "

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షం బులు కృష్ణవర సంగడు 1440 (క్రీ. శ. 1518) బహు ధాన్యనామ సం. వైశాఖ శు 15 మహారాజు శ్రీ రాజాధి రాజ మహావీర శ్రీ వీరప్రతాప కృష్ణరాయలు...”

నేడు మాచెర్ల సబ్ తాలూకా కేంద్రముగా ఉన్నది. డిప్యూటీ తహశ్శీలుదారు ఆఫీసు, ఫారెస్టు రేంజి ఆఫీసు, తంతి తపాలా కార్యాలయములు, ఉన్నతపాఠశాల, ఆస్పత్రి, పి. డబ్ల్యూ.డి. ఆఫీసు, పంచాయతీ ఆఫీసు మొద లైనవి మాచెర్లయందు నేడు ఏర్పడినవి.

మాచెర్ల పట్టణ జనసంఖ్య 5868. ఇందు పురుషులు 2780, స్త్రీలు 3088 (1951). ఆచార్య నాగార్జునుని పేర నిర్మాణమగుచున్న బహుళార్థసాధక నదీలోయ ప్రాజెక్టు (నాగార్జునసాగర్ ) మూలమున మాచెర్ల పట్టణము ప్రాముఖ్యమునకు వచ్చినది. నాపరాయి గృహనిర్మాణ పరిశ్రమలు వృద్ధి అయినవి. నగరములో రామకృష్ణ సిమ్మెంటు ఫ్యాక్టరీ వెలసినది. పట్టణానికి మంచినీటి సప్లయి, రోడ్డురవాణా వసతులు అభివృద్ధి దశలో నున్నవి. నాగార్జునకొండ, నాగార్జున సాగరులకు మాచెర్ల ముఖ ద్వారముగా నున్నది. దీనితో చెన్న కేశవాలయ విశిష్టత గూడ నానాట ఇనుమడించుచున్నది.

మా. వీ.


చెన్నపట్టణము :

చెన్నపట్టణము దక్షిణ భారతమునందు గల ప్రముఖ పట్టణము. ఇది 13.4 ఉత్తర అక్షాంశముల మీదను, 80.12 తూర్పు రేఖాంశముల మీదను నెలకొని యున్నది. దీనికి చెన్నపురి, చెన్నపురము, చెన్న నగర మనియు నామాంతరములు తెలుగు వాఙ్మయమునందు కనబడు చున్నవి. ఇదియొక ఆంధ్రనగరము. ఆంధ్ర ప్రముఖుడగు చెన్నప్ప పేర నిర్మిత మైనది. ఆంధ్ర నృపతియగు అయ్యప్ప దీనిని నిర్మించినాడు. ప్రారంభమున ఆంధ్రప్రజలచే నివా సితమై తెలుగుదొరలచే, తెలుగు వణికుంగవులచే ప్రవర్థ మానమై నెగడిన దీ చెన్నపట్టణము.