పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/770

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిలకమర్తి లక్ష్మీనరసింహము

బాల్యమునుండియు ఆర్థికముగ ఎన్నియో కష్టముల నెదుర్కొనవలసిన వారయిరి. అయితే, లక్ష్మీనరసింహము మిక్కిలి సమర్థులగుటచే, రాజమహేంద్రవరము చేరినది మొదలు మిక్కిలి పరిమితమైన తన సంపాదనతోడనే తాను తనకుటుంబమును పోషించుకొనుటయే కాక, తన బంధువర్గములవారి కుటుంబములను ఆదుకొనుచు, వీర వాసరమున నున్న తండ్రిగారి కుటుంబమునకు కూడ సాయపడుచు ఎన్నెన్నో మహా కార్యముల నొనర్చిరి.

రాజమహేంద్రవరమున ఉన్నత విద్యార్జన కై వచ్చిన ఒక సామాన్య కుటుంబ బాలుడుగా జీవిత ప్రారంభ మొనర్చిన లక్ష్మీ నరసింహము తరుణ వయస్సువచ్చుసరి కే ప్రజా రంజకమగు పవిత్ర వర్త నము కలవారై, గొప్ప ప్రతిష్ఠకలజీవితము గడపి, ప్రసిద్ధివహించి, మహేంద్రవర చరిత్రలో ఒక ఉన్నత పురుషులుగా పరిగణింపబడిరి. వారి రాజ నైతిక శీలము, వారి నిరాడంబర స్వభావమే దీనికి కారణము. సరళ వర్తనము, సంఘ సేవా భిరతి, ప్రజానుకూల హృ దయ ప్రకృతి, సర్వంకష ప్రజ్ఞ యుకూడ కారణము. సంగ్రహ ఆంధ్ర ప్రారంభమైనదని చెప్పవచ్చును. 1887 వ సంవత్సరమున జరిగిన విక్టోరియా రాణి జూబిలీ పరిపాలనోత్సవమున కై ప్రప్రథమమున వీరు పద్యములు రచించిరి. కాని జంకుచే ఆ ఆ పద్యములను వారపుడు సభలో చదువలేదు. తరువాత తరువాత వీరు పాల్గొనిన ప్రతి ఉత్సవము నందును. ప్రతి సభా సమావేశము నందును పద్యములను వ్రాసి చదువు టయు, ఆశువుగా చెప్పుటయు వారి జీవితములో నొక యాచార మైపోయినది. కాని చిత్రము - 205 కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహము

కవిగా, మహావక్తగా, పండితుడుగా, పత్రికాధిపతిగా, సంఘ సంస్కా రాభిమానిగా, ఆత్మాభిమానము కల సంఘ సేవకుడుగా, దేశభ క్తుడుగా చిలకమర్తి లక్ష్మీనరసింహము జీవితమున పేరుపొందియుండిరి.

కవిగా లక్ష్మీనరసింహము ముఖ్యముగా ఆంధ్ర సార స్వతమున కొనర్చిన సేవ మిక్కిలి ప్రశంసాపాత్రము. వీరి ఇరువదవ సంవత్సరము నుండియు, వీరి సారస్వతజీవితము 708 ఆ పద్యములను భద్రపర చుట యందు శ్రద్ధవహిం చకపోవుటచే అవి చాల వరకు ఖిలమై పోయినవి. ఇవి కాక పృథ్వీరాజీ యము, కాదంబరి (అను వాదము), రామచరిత్ర (వాల్మీకి రామాయణము నందలి ముఖ్య కథా ఘట్టమును మాత్రము వివరించు కములకు అనువాదము) అను పద్య కావ్యములను వీరు రచిం చిరి. కాని ఇందలి ప్రథమ గ్రంథములు రెండు రచనా మధ్యముననే సంపూర్ణము కాక పోయినవి. ఇట్లీ కావ్య ఆగి రచన చాలవరకు అసమ గ్రముగా నిలిచిపోవుట వలనను, వీరి నవలలు, నాటకములు ప్రసిద్ధిలో నికి వచ్చుట వలనను సారస్వతేయులలో వీరికి నవలా, నాటక కర్తగనే ఎక్కువ ప్రఖ్యాతి కల్గెను.

వంగవోలు నుండి రాజమహేంద్రవరమునకు వచ్చి నాటక ములను ప్రదర్శించుచు, నాటక కళయందు మిక్కిలి ఆదరాసక్తులు కల ఇమ్మానేని హనుమంత రావు .. నాయుడి కోరిక పై లక్ష్మీనరసింహము ప్రప్రథమముగా 1899 వ సం. న కీచకవధను వచన నాటకముగా రచిం