పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/756

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిన్నయసూరి పరవస్తు సంగ్రహ ఆంధ్ర

కారుల యొక్క సాధన సామగ్రిలో రంగులు కలుపు పళ్లెరము కూడ ముఖ్యమగువాటిలో నొకటి. సాధారణ ముగా ఈ పళ్లెరము ఒక్క చేతితో పట్టుకొనుటకు అను కూలముగా నుండును. దృఢమైన కొయ్యతో గాని, పోర్సి లెయిన్ గాని లేక ఎనామిలు లోహముతో గాని ఈ పళ్లెరము నిర్మించబడును. ఇట్టి పళ్లెరములను సాధారణముగా వర్ణచిత్రకారులే ఉపయోగింతురు. నీటిరంగులను కలుపుటకు ఏటవాలు గిన్నెలు, సాసర్లు, ప్లేట్లు (slant cups, saucers, and plates) ఉపయో గింపబడును.. ఇవి పోర్సిలెయినుతో గాని లేక గాజుతో గాని తయారగును. చైనావారు, జపాను వారు 'చీనా సిరా' ను రుద్దుటకు ఏటవాలైన రాతి ఫలకములను ఉపయోగించి యుండిరి. ఇవిగాక పెక్కు రకముల ప్లేటులు కూడ ఉపయోగమున నుండెడివి.

రంగులు కలుపు కత్తి (Palette Knife) : ఎటు వంచిన అటు వంగు కత్తి, రంగులు కలుపుటకు ఉపయో గించబడును. ఇప్పుడు అనేక విధములైన కత్తులు సంద ర్భానుసారముగ కాన్వాసుమీద గాని లేక కాగితము మీద గాని వర్ణ లేపనమునకు ఉపయోగించబడుచున్నవి.

కలము, సిరా : వ్రాయుట కుపయోగించు పాళీవలె, ఈ సాధనమును రంగులు వేయుటకు ప్రాచీన కాలము నుండి వర్ణచిత్రకారు లుపయోగించుచుండిరి. ముందుగా చిత్రముల నమూనాలను తయారు చేసి, అనంతరము కలము లీనాడు సిరాతో వాటిని తీర్చిదిద్ది తుదిరూప మిచ్చుటకు రక రకములైన మొనలుగల పాళీలతో ఉపయోగింపబడు చున్నవి.

ఉల్లిపొర కాగితము (Tracing Paper) : ముందుగా తయారైన నమూనాలను కాగితము పై గాని, కాన్వా సుపై గాని ఎక్కించుటకు ఉల్లిపొర కాగితము అవసర మగును. ఆ కాగితము లీనాడు చుట్టల రూపములోను, విస్తృతములైన కాగితముల రూపములోను తయారగు చున్నవి.

చిత్తరువులను అమర్చు చట్రము (Easel) : ఇది బిగు వుగా నిర్మింపబడు నొక మూడు కాళ్ల చట్రము. వర్ణ చిత్రమును వ్రాయునపుడు, అది ఈ చట్రమునం దమర్చ బడి నిట్రముగ నిలబెట్టి యుంచబడును. ఈ సాధనము ఐరోపా ఖండములో సాధారణముగా

వాడుకయం దున్నది. ప్రాద్దేశములలో కళాకారులు ఎల్లప్పుడును కూర్చుండియే చిత్రములు రచింతురు. చిత్తరువు గీయు కాగితమును సమమైన కొయ్యచట్రములో పరచి, దానిని నేలపై పరుండ బెట్టి గాని, లేక మేజాబల్లకు ఏటవాలుగా నిలబెట్టి గాని ప్రాద్దేశముల కళాకారులు తమ వ్యాసంగ మును కొనసాగింతురు. కాని ఈ కాలమున వర్ణచిత్ర ములు వి విస్తృతమైన పరిమాణములో రచించబడుటవలన, పైన ఉదహరించిన ఏట వాలు చట్రములే (easels)అవసర మగుచున్నవి.

డ్రాయింగు బోర్డు (Drawing Board) : డ్రాయింగు బోర్డు దేవదారు కొయ్యతో చిత్రము యొక్క పరిమా ణము ననుసరించి వివిధములైన సై జులలో తయారుచేయ బడును. చిత్రమును రచించునపుడు కాగితమును గాని, గుడ్డను గాని బల్ల పైన సాగదీసి నలువైపుల సూదులు గ్రుచ్చెదరు. ప్రాచీనకాలమునుండి సాధారణమైన చిత్ర ములను, వర్ణచిత్రములను రచించుటకు ఏదో యొక రక మైన డ్రాయింగు బోర్డులు ఉపయోగమున నున్నవి.

స్ట్రెచర్ (Stretcher) : ఇది యొక కొయ్యచట్రము. దీనికి కాన్వాసు అల్లబడెడిది. చిత్రమును గీయునప్పుడు ఈ కాన్వాసు ముక్క చట్రములో అమర్చబడి, నలు ప్రక్కల తాపటము చేయబడెడిది. కాని 18వ శతాబ్దము నుండి చిత్రముపై రంగులు వేయుటకు పూర్వము విడిగా నుండు కాన్వాసు ముక్కను చట్రముపై నాల్గు ప్రక్కల సాగదీసి మేకులు కొట్టు దుండెను. విధానము ఆచరణమునం

చిత్ర నిర్మాతల కుపయోగపడు పరికరముల సంఖ్య పలువిధములుగా పెరుగుటచేతను, నూతనమైన సాంకేతిక విధానములు అభివృద్ధి చెందుట చేతను, కళాకారునియొక్క స్టుడియో సాధన సామగ్రి ఆధునిక యుగములో అంతకంతకు అధిక మగుచున్నది. పైన వివరించిన పరికరములు అట్టి సాధన సామగ్రిలో ముఖ్యములైనవి.

జ. మి.


చిన్నయసూరి పరవస్తు :

ఆధునికాంధ్ర గ్రాంథిక భాషా ప్రపంచమునకు మూలస్తంభ మనదగినవాడు పరవస్తు చిన్నయసూరి. పరవస్తు