పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/755

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 చిత్రలేపనసామగ్రి

బడిన కొయ్య కోపులయందు ఇముడ్చబడును. పెన్సిళ్లు అతి మెత్తగా వ్రాయు '6 బి' మొదలు అతి కఠినముగా వ్రాయు '6 హెచ్' వరకు పెక్కు రకములలో తయారు చేయబడును.

బొగ్గు : 'విల్లో' (willow) అను జాతి చెట్ల యొక్క రెమ్మలను, ద్రాక్ష రెమ్మలను కాల్చగా వచ్చు బొగ్గు, వర్ణ చిత్రములు రచించుటకు ముందుగా తయారగు నమూనా డ్రాయింగులు గీయుటకు ముఖ్యముగా నుపయోగింప బడుచున్నది. ఈ డ్రాయింగులను గోడల మీదను, కాన్వాసు మీదను, కాగితము మీదను వేయుదురు.

రంగు బలపములు (crayons): నల్లని బొగ్గుపదార్థము నుండి కురుచైన రంగుకణికలు తయారగును. ఎర్రని జేగురుమన్నుతో చేయబడిన కణికలు 'ర క్తవర్ణపు కణికలు ' (sanguines) అనబడుచున్నవి. ఈ పదార్థము ప్రాచీన కాలము నుండి వర్ణచిత్రములు రచించుటకు ఉపయోగ మున నున్నది. కణికల రూపముననే కాక, పెన్సిళ్ల రూపమున గూడ ఇవి లభ్యములగుచున్నవి. రంగు కణిక ల నే (coloured crayons) సుద్దకోపులని(pastels) వ్యవ హరింతురు. వివిధములైన రంగులను మిళితముచేసి ఒక కణికగా రూపమిచ్చుటకై వాటి యందు అవసరమైనంత జిగురు పదార్థమును ఉపయోగింతురు.

తుడుపుడు సాధనములు (Erasers) : పెన్సిలు గుర్తు లను, బొగ్గు గుర్తులను కాగితము మీదినుండి గాని, తోలు కాగితము (parchment) మీదినుండి గాని తుడిచివేయు టకు సామాన్యముగా మన మీనాడు రబ్బరు ముక్కలను ఉపయోగించుచున్నాము. ఒక శతాబ్ది క్రిందట ఇట్టి గుర్తులను మెత్తని రొట్టె (soft bread) ముక్కలతో తుడిచెడివారట. కాని 18 వ శతాబ్ది ఉత్తరార్ధములో చిత్రములను గీయుట యందు ఇట్టి పనికి రబ్బరు ఉప యోగింపబడుచు వచ్చెను.

కుంచెలు : వర్ణచిత్రములను గీయుట ప్రారంభమై నప్పటినుండి, రంగులు వేయుటకు పీచువంటి పదార్థము కుంచెగా నిర్మింపబడి ఉపయోగింపబడు చున్నది. ఈ కుంచెలు ముఖ్యముగా రెండు రకములలో దొరకు చున్నవి. తైలవర్ణ చిత్రములకు పంది వెండ్రుకలును, నీటిరంగు చిత్రములకు, టెంపీరా (tempera) వర్ణ చిత్రములకు 'నేబిల్' (Sable) అను నొక జంతువు యొక్క వెండ్రుకలును ఉపయోగింతురు. కాని కొందరు వర్ణ చిత్రకారులు, వారి వర్ణచిత్ర రచనా విధానము ననుసరించి ఈ రెండింటిలో దేనినైనను వాడెదరు. పూర్వము ఉడుత రోమములతోను, ఒక్కొక్కప్పుడు దూడ చెవి రోమములతోను లేక మేక రోమములతోను కుంచెలను తయారు చేసెడివారు. రష్యా దేశమందు లభ్య మగు 'ఎర్ర' వర్ణముగల సేబిల్ (Red Sable) జంతు రోమపు కుంచెలు ఉత్తమములైనవి. కుంచెలు రెండు విధములుగా నుండును. 1. గుండ్రనివి; నుండునవి. వీటి చివరి భాగములందలి వెండ్రుకల నిడివి ఉద్దిష్టములైన వర్ణ చిత్ర రచనా విధానముపై ఆధార పడి యుండును. వెండ్రుకలను విభాగములుగా చేసిన పిమ్మట కోరిన ఆకారములలో లోహపు గొట్టములయందు వాటికి తుదిరూపమివ్వబడును. కుచ్చులు కట్టబడిన వెండ్రుకలు చేతికి అమరునట్లుగా పిడిరూపములో నుండు లోహపు గొట్టమునందు రబ్బరుతోగాని, కృత్రిమ పదార్థ ముతోగాని తాపడము చేయబడును. దూరప్రాచ్య దేశములలో కుంచెకు వెదురు (bamboo) ముక్కను పిడిగా అమ ర్చేదరు. వర్ణ చిత్ర రచనమును బట్టి కుంచెలు రకరకములుగా మారుచుండును. కొన్ని వర్ణచిత్రములకు తోడేళ్ళయొక్క, దుప్పుల యొక్క రోమములతో చేయ బడి కుంచెలు ఉపయోగించబడును. చిత్రమునందు సూక్ష్మమైన వివరములను దిద్దుటకు దుప్పి రోమములతో చేయబడిన కుంచెలు ఉపయోగించబడును. కొలది రకముల కుంచెలు తప్ప తక్కినవన్నియు చివరిభాగమున మొనదేలి యుండును. ఈజిప్షియను కళాకారులు ఎర్రని పీచుతో చేయబడిన కుంచెలను ఉపయోగింతురు. భారత దేశములో తయారైన కుంచెలు ముందుగా పక్షి ఈకెలయందు చొప్పించబడి తరువాత వెదురు పుల్ల లయందు తాపటము చేయబడును.

ఈనాడు కుంచెలు పెక్కురకములలో తయారగు చున్నవి. అతి నిశిత మైన '00' అను సంఖ్యా చిహ్నము మొదలు గరిష్ఠ ప్రమాణముగల '12' వ సంఖ్యాచిహ్నము వరకు కుంచె లీనాడు లభ్యమగుచున్నవి.

రంగులు కలుపు పళ్లెరములు (Palettes): వర్ణ చిత్ర