పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/753

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 చిత్రలేపససామగ్రి

శుద్ధనీటి వర్ణచిత్రములవలె కాక, ప్రకాశనిరోధక (opaque) లక్షణములు కలిగి మబ్బు మబ్బుగానుండును. మధ్యయుగములో ప్రపంచ మంతటి యందును తయారు కాబడిన అల్పాకార వర్ణచిత్రములలో (miniature paintings) అధిక భాగము “గ్వాష్" అను సాంకేతిక విధానమునకు చెందినవే. అట్లే, ఇండియా. చైనా, జపాను, ఈజిప్టు దేశములలోని కుడ్య చిత్రములును ఈ కోవను అనుసరించినవి. ఈ విధానమునకు చెందిన చిత్రరచనము చురుకుగా జరుగదు. నీటి తాకిడివలన ఈ చిత్రము క్రమముగా చెరగిపోవుటయే ఈ విధానము నందలి లోపము.

సుద్ద రంగులు (Pastel Colours) : వివిధ వర్ణము లలో సుద్ద పదార్థము కణికలుగా తయారుచేయబడు చున్నవి. గరుకుగా నుండు లేచాయరంగు కాగితము పై సుద్ధ రంగులతో చిత్రములు రచించబడును. సుద్దరంగుతో వేయు చిత్రములను కళాకారులలో ఎక్కువమంది అభి మానించుట లేదు. వర్ణముల యొక్క నైర్మల్యము, అంద చందములు ఈ విధానమువలన కళంక మగునని వారి అభిప్రాయము. ఈ వర్ణచిత్ర విధానము 16వ శతాబ్ది నుండి అనుష్ఠింపబడుచున్నది. డేగల్స్, మానెట్, రెనా యిర్ ప్రభృతులు ఈ సుద్ద రంగులను సవ్యముగా నుప యోగించిరి. కాని పాఠశాలలలో ఈ విధానము జన రంజక ముగ లేదు.

భూమికలు (Grounds): వర్ణచిత్రములు రచించు ఫలకములను భూమిక లందురు. కాగితము, కాన్వాసు (నూలుగుడ్డ, సిల్కు, లేక నారవస్త్రము), దారుఫలకము, గోడ, కార్డు బోర్డు అట్ట, లోహపు రేకు, దంతము, గాజు పలక, హార్డు బోర్డు మున్నగు వాటిని సాధారణముగా వర్ణచిత్రములు రచించుటకు, భూమికలుగా నుపయో గింతురు. చిత్రము యొక్క వర్ణ సమ్మేళనము మున్నగు లక్షణములనుబట్టి, ప్రారంభములో ఈ భూమిక ల యొక్క ఉపరితలములపై రంగు పూతపూయబడును. సాధారణ ముగా కాన్వాసుమీదను, దారుఫలకములమీదను చిత్రము రచించుటకు పూర్వము తెల్లని తైలవర్ణముమ, 'గ్వాష్ ' లేక ‘టెంపీరా’ వర్ణచిత్ర విధానమందు 'గెస్సో' అను ప్లాస్టరు వర్ణమును పూయుదురు. వర్ణములు తయారుచేయుటకు పెక్కు విధానములు కలవు. కళాకారుల అభీష్టమును అనుసరించియు, చిత్రరచనా స్వభావ లక్షణ ములను బట్టియు పలురకములైన ఇతర వర్ణములనుగూడ ఉపయోగించెదరు. తైలవర్ణ చిత్రములను కాన్వాసు, హార్డు బోర్డును, నీటివర్ణములతోను, గ్వాష్ లేక టెంపీరా వర్ణములతో వేయుచి త్రములకు కాగితములును భూమిక లుగా ఉపయోగింపబడుచున్నవి. వివిధములైన సాంకేతిక చిత్రరచనములకు వివిధ తరగతుల కాగితములు వాడుక యందు గలవు. చైనీయులు, జపానీయులు బియ్యముతో తయారైన కాగితములపై చిత్రములు వేయుచున్నారు. స్వల్ప పరిమాణములలో వర్ణచిత్రములు రచించుటకు ఇండియా, పర్షియా, ఈజిప్టు మున్నగు దేశములలో గడ్డి, నార, నూలు మొదలైన పదార్థములతో చేతిమీద తయా రైన కాగితములు ఉపయోగము నందున్నవి. ఈ రక మైన కాగితమునకు విశేషమైన మన్నిక కలదు. భారత దేశములో 13 వ శతాబ్దినుండి కాగితములపై రంగు చిత్రములు వేయబడు చున్నవి. ఈ వర్ణచిత్రములు వ్రాత ప్రతుల మీదనో, లేక 'వాస్లీస్' (waslies) అను నొకరక మైన కాగితముల మీదనో రచింపబడుచుండెను. ఈ కాగిత ములు ఒకదానిపై నొకటి బొత్తిగా అమర్చబడి వాటికి జిగురు పూయబడును. ఈ కాగితములను విస్తృతపరచి, వాటికి మెరుగు పెట్టిన పిమ్మట 'ఆగేట్' (agate) అను రంగురాయితో గాని, నునుపైన మరియొక రకమైన రాయితోగాని వర్ణములు దిద్దుదురు. తరువాత ఈ చిత్రము 'వాన్లీ' మీద ఎక్కించబడును. తెల్లని నీటిరంగు దానిమీద పూయబడి చిత్రములో అవసరమైన సవరణలు చేయబడును. అనంతరము ఇష్టము వచ్చిన రంగులు చిత్రమునందు ఇముడ్చబడును. నీటిరంగులతోను, గ్వాష్ అను పదార్థముతోను చిత్రించు సిల్కుభూమిక పై పటిక కలుపబడిన బంకపదార్థము పలుచగా పూతపూయబడును.

రంగుపదార్దములు (pigments): రంగుపదార్థములు సామాన్యముగా చూర్ణముల రూపములో నుండును. చిత్రరచనమున కుపయోగించుటకై ఈ చూర్ణములను తైలములోను, గ్రుడ్డుసొనలోను, గోందులోను కలిపె దరు. ఈ రంగు పదార్థములు, వాటి మూలాధారమును