పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/752

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిత్రలేపనసామగ్రి 692 సంగ్రహ ఆంధ్ర


తైలవర్ణచిత్రములు దారుఫలకములమీదను, కాన్వాసు మీదను, కార్డుబోర్డు అట్టలమీదను, కుడ్యములమీదను, ప్రాచీనకాలములో తయారుఅగుచుండెను. కాని ఈ కాల మున లోహపు రేకుల పై న, గాజుపలకలపైన, 'ఆస్బెస్టాస్ ' అనబడు సిమెంటు రేకులపైన గూడ తైలవర్ణ చిత్రములు రచింపబడుచున్నవి. చిత్రము చిరకాలము నిలిచియుండు టకై భూమిక (ground) మీద ముందుగా తెల్లని రంగు పూయబడును. పంది వెండ్రుకలతోగాని, బిరుసుగానుండు ఇతరము లైన వెండ్రుకలతోగాని తయారు కాబడిన కుంచెలు తైలవర్ణ చిత్రములు గీయుటకు ఉపయోగింప బడుచున్నవి. ఈ కాలములో పెక్కురు కళాకారులు వివిధరకములైన నాజూకు కత్తులతో (Palette knives) రంగులను పూయుచున్నారు. ప్రాచీనకళాకారులు తమ కిష్టమైన రంగులను తామే స్వయముగా నూరుకొని వర్ణ చిత్రములను గీయుటకు పూర్వము తైలమును అందులో కలి పెడివారు. కాని ఈ కాలమున తైలవర్ణములు విపణి వీథియందు ట్యూబులలో సిద్ధముగా విక్రయిం పబడు చున్నవి. తైలవర్ణ చిత్రములు నీటి తాకిడికి చెడిపోకుండుట వలనను, కుంచెపని మూలముగా చిత్రములకు అంద చందములు చేకూరుట వలనను, ఈ విధానము ప్రజా మోదమును బడసినది. తైలవర్ణ చిత్రము సిద్ధమైన పిమ్మట, దాని మీద వార్నీసు పలుచగా పూయబడును. ఇందు వలన చిత్రములు వాతావరణ ప్రభావములకు లోబడక, నునుపుగా నుండి నిగనిగ మెరయుచుండును. కాని వార్నీసువలన, రంగులలో కలియు తైలపదార్థముల వలన, కాలము గడచిన కొలది తైలవర్ణ చిత్రములు నలుపెక్క నారంభించును.

టెంపీరా (Tempera) : ఈ పదము “ఎగ్ టెంపీరా” (Egg Tempera) అనుదానికే పరిమితమై యున్నది. 15 వ లేక 16 వ శతాబ్ది వరకు ఐరోపా ఖండమందంతట ఈ వర్ణచిత్ర విధానము సామాన్యముగ వాడుక యందుండెను. చిత్రము రచింపబడు భూమిక ప్లాస్టరు (gesso) తో సిద్ధముచేయబడును. నునుపుదనము ఏర్పడుటకై జిగురు పదార్థము పులుమబడు దళసరి గుడ్డ 'ప్లాస్టరు' అని పిలువబడును. జిగురుపదార్థము ఆరిపోయి, చిత్రమును రచించుటకు తగినస్థితి ఏర్పడును. పొడిరంగులలో గ్రుడ్డు సొన కలుపగా తయారైన వర్ణములు భూమిక పై వేయబడును. గ్రుడ్డు సొనలో నీటిని గూడ కలిపి పలుచన చేయబడును. రంగులు వేసిన వెంటనే చిత్రము ఆరిపోయి నీటి తాకిడిని తట్టుకొనగలిగి యుండును. కాలము గడచిన కొలది ఈ వర్ణచిత్రములు గట్టిపడును. కొండరు వర్ణ చిత్ర కారులు గ్రుడ్డు నందలి ద్రవపదార్థమంతటిని రంగులు కలుపుట కుపయోగింతురు. 'టెంపీరా' వర్ణములు ప్రపంచ మంతట ఆధునికులైన కళాకారులచే అభిమానింప బడు చున్నవి. ఈ వర్ణములు తై లముల కంటె ఎక్కువ నిర్మలముగ నుండి ఎక్కువకాలము మన్నును; తైలవర్ణము అందలి నునుపుదనము, నిగనిగ వీటి యందు కానరావు. ఇప్పు డీ వర్ణములు కుడ్యముల మీద, కాగితముల మీద, కాన్వాసు మీద, కార్డుబోర్డు అట్టలమీద, హార్డుబోర్డు మున్నగు భూమికల మీద చిత్రములు రచించుటకు ఉపయోగింపబడుచున్నవి.

నీటివర్ణములు: ఇదియొక సాంకేతిక వర్ణ విధానము. ఈ విధానమును బట్టి నీటిలో కరగు జిగురు పదార్థమును, గోందు పదార్థమును రంగులలో కలిపి చూర్ణము చేయు దురు. ఇది చాల పురాతనమైన వర్ణచిత్ర విధానము. ఈ కాలమున గూడ ఈ విధానము వ్యవహారముననున్నది. నీటి రంగుల విధానములో 1. శుద్ధనీటి వర్ణము (pure water colour). 2. తేనె, ఇతర జిగురు పదార్థములతో మిళిత మైన “ గ్వాష్” (guache) వర్ణము అను రెండు రకములు గలవు.

శుద్ధనీటి వర్ణములు తెల్లని కాగితములపై వేయు చిత్రముల కుపయోగపడును. రంగులు మనోహరముగ కన్పట్టి అందచందములు చిందుటకై ఒక సారి వేసిన రంగులపై అవసరమగునన్ని పర్యాయములు మరల రంగులు వేయబడును. 19 వ శతాబ్దము నుండి శుద్ధనీటి వర్ణ చిత్రములలో ప్రపంచ మంతటి యందును ఇంగ్లండు కళాకారులు విశేష ప్రతిభ నార్జించిరి. కాని ఈ నాటికిని ఇతర దేశ ములయందలి కొందరు కళా కారులు ఈ విధానమును అనుసరించుచున్నారు.

గ్వాష్ (Guache) : ఇది కూడ ఒకరకమైన నీటి వర్ణము, ఈ విధానమందలి రంగులలో చిక్కగానుండు తెల్లని పదార్థములు కలియుటచే ఇట్టి వర్ణచిత్రములు