పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/751

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 చిత్రలేపనసామగ్రి

(gypsum), పోజోలానిక్ (pozzolanic) అను పదార్థ ములతో గిలాబా చేయుట. తడిసున్నములో రంగును కలిపి చేయు గిలాబా 'ఫ్రెస్కో బ్యూన్ ' (fresco buan) అను సాంకేతిక నామమున పిలువబడుచున్నది. ఈ విధ ముగా చేయబడు కుడ్యాలంకారము అన్నిటికంటె శాశ్వ ఈ సాంకేతిక పద్ధతి ప్రకారము తముగా నుండగలదు. ఒక్క దినములో పనిచేయ గల విస్తీర్ణము ఆఖరుసారిగా గిలాబా చేయబడి తుదిరూప మొసగబడును. దానిపై రేఖాచిత్రము (cartoon) రచింపబడి, తడి ఆరక పూర్వమే చిత్రముపై మామూలు నీటిలో గాని, సున్నపు నీటిలో గాని కలిపిన రంగులు అద్దబడును. రంగులు వేయునపుడు గిలాబా తేమగా నుండుటచే చిత్రమునందు రాసాయనిక పరివ ర్తనము (chemical reaction) కలుగును. అందు వలన రంగులన్నియు గోడయందు చక్కగా లీనమై ఎన్నటికిని మాసిపోజాలవు. లోహసంబంధ మైన మన్నుతో తయారైన రంగులనే ఈ సాంకేతిక విధానమునందు ఉపయోగింపవలెను. శ. 14–16 శతాబ్దముల నడుమ నిర్మింపబడిన ఇటలీ కుడ్యచిత్రములును, క్రీ.శ. 16-19 శతాబ్దములనాటి రాజస్థాన్ కుడ్యచిత్రములలో అధిక భాగమును ( ఇవి జయపూరు విధానమని పిలువబడును). 'ఫ్రెస్కో బ్యూన్' (Fresco Buan) అను సాంకేతిక విధానమునకు చెందియున్నవి.

ఫ్రెస్కో సెక్కో (Fresco Secco): ఈవిధానముకూడ కుడ్య చిత్రరచనావిధానమును పోలియుండును. కాని ఈ విధానమునందు గిలాబా (సున్నము లేక మన్ను లేక జిప్సమ్)గాలికి ఆర పెట్టబడును. రంగు వేయుటకు పూర్వము తొలినాటి రాత్రియంతయు గిలాబాను పూర్తి గా సున్నపు నీటితో గాని, లేక ముగ్గురాతి (baryta) నీటితో గాని తడిపెదరు. మరుసటి ఉదయము కూడ మరొక పర్యాయము అట్లే చేయవలసియుండును. ముందుగా సిద్ధమై యున్న నమూనా చిత్రమును గోడపైన ఎక్కించు విధానము, రంగులు కలుపు పద్ధతి. కుడ్య చిత్రము నకు వివిధ వర్ణములు దిద్ది తుదిరూపము తయారుచేయు విధానము - ఇది యంతయు కుడ్య చిత్ర విధానమువలెనే యుండును. కొంచెము సున్నపురాతి నీటితో గాని, ముగ్గు రాతి నీటితో గాని రంగులు కలుపవలయును. ఇట్టి విధానము నవలంబించినచో చిత్రములను తయారుచేయుట సులభమగును. కాని ప్రామాణికులైన కొందరు చిత్రకారులు ఈ విధానము కూడ 'ఫ్రెస్కో బ్యూన్' అను తరగతికి చెందిన విధానమే అని భావించుచున్నారు. ఎండిన గిలాబా పై సున్నపు నీటియందు కలిపిన వేర్వేరు రంగులతో రచింపబడు వర్ణచిత్రములు సిసలైన 'ఫ్రెస్కో సెక్కో' తరగతికి చెందినవని వీరి నమ్మకము. కుడ్య చిత్ర విధా నము లన్నిటియందును సహజముగా ఇది అత్యంత సులభ మైనది. ఈ విధానములో గ్రుడ్డు సొన గాని, లేక గోందు గాని, రంగులను కలుపుటకు ఉపయోగింపబడును. అంతే కాక, సాధ్యమైనన్ని ఎక్కువ సంఖ్య గల రంగులలో వేటినైనను ఈ సాం కేతిక విధానమునం దుపయోగించ వచ్చును. అజంతా, ఎల్లోరా కుడ్యచిత్రములు, మధ్యా సియా, ఈజిప్టు మొదలగు ప్రాంతములందలి సమ కాలీన కుడ్యచిత్రములు ఈ విధానము ననుసరించి రూపొందించ బడినవే. చిత్రములను గీయు భూమిక ను (ground) తయారుచేయుట యందును, రంగులను కలుపు ద్రవపదా ర్థములయందును కొన్ని భేదము లుండవచ్చును. కళా కారుని అభీష్టమును బట్టియు, ఆయా పదార్థముల లభ్య లభ్యములను బట్టియు ఈ భేదములు మారుచుండును.

తైలవర్ణచిత్రములు : ఐరోపాలో 16వ శతాబ్దినుండియు తై లవర్ణ ములు కళాకారులచే మిగుల అభిమానింపబడు చుండెను. అట్లే 19 వ శతాబ్దమునుండి తైలవర్ణ చిత్ర విధానము ప్రపంచమున అన్ని దేశములందును ప్రాచు ర్యము వహించెను. తైలవర్ణములను జిగురుపాక ములో తయారుచేయుటకు, రంగులలో సరిపడునంత పరిమాణ ములో అవిసెనూనె, గసగసాలనూనె కలుపబడి మెత్తగా నూరబడును. తై లవర్ణచిత్రములు శీఘ్రముగా ఆరిపోవు టకు అవిసెనూనెలో కొన్ని పదార్థములు కలుపబడును. ఇండ్లకు రంగులు వేయుటకును. ఇతర అలంకరణము లొన గూర్చుటకును అవసర మైన రంగుల సమ్మేళనము ప్రాచీన కర్మకారులకు (craftsmen) బాగుగా తెలియును. కాని జాన్ వాన్ ఐక్ (Jan Van Eyck) మున్నగు డచ్చి కళా కారులచే వర్ణసమ్మేళన విధానము క్రమముగా అభివృద్ధి చేయబడినది.