పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/750

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిత్రలేపనసామగ్రి
వర్ణములతో లేపనము చేయబడుచు వచ్చెను. చైనా, మెసొపొటేమియా, గ్రీసు, మెక్సికో, భారతదేశములందు క్రీ.పూ. కనీసము వెయ్యి సంవత్సరములనాటి వర్ణాలంకా రితములగు మృణ్మయ పాత్రలు ఈనాటికిని కానబడును. చిత్రలేపనమునకు పూర్వమే వర్ణలేపన పదార్థములు గోచరించినను, వర్ణలేపన పదార్థములను గూర్చి 'హిమ యుగము' (Ice Age) నుండి మానవు డెరిగి యున్నట్లు తెలియుచున్నది. హిమయుగము క్రీ. పూ. సుమారు 10,000 సంవత్సరములతో అంతమైనది. ఆ యుగములో కేవలము శిలలే చిత్రలేఖనమునకు భూమికలు (grounds) గా నుపయోగింపబడెడివి. పసుపు, ఎరుపు మున్నగు జేగురు రంగులతోడను, లోహమయమైన పదార్థముల తోడను రంగులు తయారు చేయబడెను. గ్రుడ్డునందలి తెల్లని సొన వివిధ వర్ణములను మిళితము చేయుటకు సాధన ముగా ఉపయోగపడెను. అనంతరము క్రీ. పూ. 2000– క్రీ. శ. 1200 సం. మధ్యకాలములో క్రీటు, గ్రీసు, ఎట్రుస్కన్, ఈజిప్టు, ఇండియా దేశములలో కుడ్యచిత్ర ములు అవతరించెను. ఇది కాక, ప్రాచీన వర్ణచిత్రములు దారువులపైన, వస్త్రములపైన, చర్మములపైన, కాగిత ములపైన రచింపబడుచు వచ్చెను. ఆ దినములలో రక రకములైన జిగురుపదార్థములతో మిళితమైన నీటిరంగు లను (Water Colours), 'ఎగ్ టెంపీరా' ను (egg tempera) ఉపయోగించి చిత్రములను తయారు చేయు చుండిరి. ఈజిప్టు కళాకారులకు తేనెటీగలు పెట్టు మైన మునం దభిమాన మెక్కువగుటచే, దానిని రంగులు కలుపుటకు సాధనముగా ఉపయోగించిరి. 15 వ శతాబ్ది నాటి డచ్చి, ఫ్లెమిష్ వర్ణచిత్రకారులు తైలవర్ణముల ప్రయోజనమును కనుగొనిన తరువాత, మొట్టమొదట ఐరోపా ఖండము నందును, 18 వ శతాబ్దిలో ఇతర దేశముల యందును తైలవర్ణ చిత్రముల యొక్క ప్రాధాన్యము అధికము కాజొచ్చెను. 18 వ శతా బ్దిలో ప్రపంచమందలి పెక్కు దేశములతో యూరపు నకు బంధములు వృద్ధికా నారంభించెను. కృత్రిమముగా చేయబడిన లోహపు రేకులపైన, దృఢ మైన గాజు పలకల పైన, ఆస్బెస్టాస్ (Asbestos) ఫలక ముల పై న వర్ణచిత్రములు రచింపబడెడివి.
పెక్కు విధము లైన రసాయన పదార్థములచే తయారు కాబడిన రంగు బిళ్ళలు, రంగు ట్యూబులు ఆనాడు కూడ లభ్యము లయ్యెను. ఆధునిక యుగమున రంగుసుద్దలు (Coloured crayons or pastels). రంగు పెన్సిళ్ళు వర్ణచిత్రముల యందుపయోగమున నున్నవి. రంగులను కలుపుటకు పెట్రోలు, ప్లాస్టిక్ రసాయన ద్రవములవంటి పెక్కు పదార్థములు ఈనాడు ఉపయోగింపబడుచున్నవి. శాస్త్ర విజ్ఞానము అభివృద్ధి యగుటచే వివిధములైన వర్ణ లేపన పదార్ధములు కనుగొనబడుటయే గాక, గుణాత్మక ముగ గూడ అవి అభివృద్ధి నొందెను.
వర్ణచిత్ర రచనమునకు సంబంధించిన పలు తెరగుల సాంకేతిక విధానములను గూర్చియు, చిత్రఫలకము (grounds) లను గూర్చియు, రంగులను 'గూర్చియు, ఇతర సాధన సామగ్రిని గూర్చియు ఈ దిగువ వివరింపడు.

సాంకేతిక విధానముల
:1.కుడ్య చిత్రములు(fresco); 2. ఎగ్ టెంపీరా (egg tempera); 3. గ్వాష్(Gouache); 4. నీటిరంగులు(Water colours);సుద్ద, బొగ్గు (Pastel and charcoal) అను వివిధములైన సాంకేతిక విధానములు వర్ణ చిత్రములందు వ్యవహారములో నున్నవి.
కుడ్య చిత్రములు(Fresco)
:గోడలపై'ఫ్రెస్కోసెక్కో' (Fresco Secco), 'ఫ్రెస్కో బ్యూన్ ' (FrescoBuan), టెంపీరా అను రచనా శైలులను అనుసరించిగీయు వర్ణచిత్రము అన్నియు 'కుడ్య చిత్రములు' (Fresco or Mural) అనబడుచున్నవి. ఇది అతిప్రాచీన మైన వర్ణచిత్ర విధానము. నల్ల రాయితో గాని లేక ఇసుక రాయితో గాని నిర్మింపబడిన గోడపై, ఈ దిగువ పదార్థములు మిళితమైన చెక్క సున్నముతో గాని, లేకమన్నుతో గాని గిలాబా చేయవలెను. (1) ఇసుకతో గాని, అచేతనమైన (inert) రాతిపొడితో గాని లేకవెండ్రుకలు, గడ్డి, నార మున్నగు పదార్థములతో గానిసున్నమును మిళితము చేయుట. (2) పైన పేర్చొనిన జడపదార్థముతో మిళితమైన మట్టిగిలాబా (clay plaster)జడపదార్థములను కలుపుటచే గిలాబాయందు బిగుమానమేర్పడి అది సంకోచము (shrink) చెందదు. 3. జిప్సమ్