పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/746

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిత్రవస్తుప్రదర్శనశాలలు

శాల లున్నవి. వాటిలో బ్రిటిష్ మ్యూజియము, విక్టో రియాఆల్బర్ట్ మ్యూజియము అనునవి అత్యంత పురోగామి చిత్రవస్తు ప్రదర్శనశాలలు. బ్రిటిష్ మ్యూజియము విశేష ముగా పురాతత్వ శాస్త్రమునకు సంబంధించినది. అందు అనేక కళాని క్షేపములు, పోతబొమ్మలు, వ్రాత ప్రతి కృతులు, వైద్యుత ముద్రణ చిత్రములు ఉన్నవి. ఈ చిత్రములలో కొన్ని మూలప్రతుల నుండి గుర్తుపట్టరా నంత నేర్పుతో కల్పించబడినవి. బ్రిటిష్ మ్యూజియములో 75,000 ప్రతులు గల కళాగ్రంధ భాండాగార మున్నది. 2,50,000 ముద్రణములు కలవు. ఈ చిత్రవస్తు ప్రదర్శన శాలను నిర్వహించుటకు సమర్థవంతమైన సిబ్బంది కల్పిం పబడినది. చిత్రవస్తువుల కొనుగోలు కొరకు విరాళము లివ్వబడు చున్నవి.. స్థానిక ములు, ప్రాంతీయములు ఐన చిత్రవస్తు ప్రదర్శనశాలలకు క ళాఖండములు ఒక నిర్ణీత కాలవ్యవధిలో తాత్కాలికముగ అరువు ఇయ్యబడును. ఈ పద్ధతి శీఘ్రముగా పెరుగుచున్నది. ఎందుచేత ననగా వివిధమండలములు, దేశములు చేసిన సహాయమునకు ప్రతిఫల మొసగుటకు మార్గాంతరములేదు. విక్టోరియా ఆల్బర్టు మ్యూజియము కూడ మిక్కిలి సంపన్నమైనది. దాని మూలసిద్ధాంతము కళను పరిశ్రమకు అనుబంధింప జేయుటయై యున్నది. కళకు సంబంధించిన అందమైన పెక్కు సంగ్రహణములు దీనికి చేర్చబడినవి. బ్రిటిష్ మ్యూజియమంత బాగుగా ఇది సంవిభాగ సంపన్నము కాలేదు. కాని ఆంగ్లదేశపు ప్రభువుచే బదులుగా ఇవ్వ బడిన 'రా ఫేల్ ' వ్యంగ్య చిత్రములతో సహా చిత్ర పట ములు, నేతరకములు, పట్టు నేత వస్త్రములు, జలతారు అల్లిక పనులు, పింగాణి పాత్రలు, ఎనామిల్ సరకు, దంత వస్తువులు, రూపనిర్మాణ కళాత్మక ఖండములు, లోహమయములు, దారు వికారములు, ప్రాచ్య ఖండ ముల నుండి సేకరించబడినవి. ముఖ్య వస్తువుల సౌంద ర్యము, అలంకరణాకర్షణము ఇక్కడ ప్రదర్శితములగు ముఖ్యలక్షణములై యున్నవి. యూరపుఖండమందలి చిత్ర వస్తు ప్రదర్శనశాలలు క ళాఖండముల సంగ్రహణవిషయమున వీనికన్న సంపన్న తరములును ; గురుతర వై విధ్యము కలవియు నై యున్నవి. జర్మనీలో, మ్యూజియముల యొక్క విద్యా విషయక లక్షణములు మిక్కిలి ని పుణముగా ఆలోచించ బడినవి. ఇటలీ దేశము నందలి సార్వజనీన సేకరణములు ఇంగ్లండులో నున్న వానికంటే సంఖ్యలో పది రెట్లు అధి కముగా నున్నవి. ఇవి ముఖ్యముగా జాతీయ మైన ఆ స్తిగా పరిగణింపబడు చున్నవి. వియన్నా, ఆమ్స్టర్ డామ్, జూరిక్ మ్యూనిక్ లలోను, ఈజిప్టులోని గిజేహ్ వంటి చోటులందును అసామాన్య చిత్రవస్తు ప్రదర్శనశాల లున్నవి. ప్యారిస్ నగరములోని “మ్యూస్ కార్నావా లెట్" అను చారిత్రక చిత్రవస్తుప్రదర్శనశాల ప్రపంచ ములో అత్యంతము పరిపూర్ణమైన నాగరక చిత్రవస్తు ప్రదర్శనశాల. ఫ్రాన్సు కేంద్ర చిత్రవస్తుప్రదర్శనశాల “లూవ్రే” అనునది ఫ్రెంచి విప్లవ సమయమున స్థాపించ బడినది. దీనిలో మొదటి ఫ్రాంకోయీ, పదునాలుగవ చక్ర వ ర్తుల సంగ్రహణములున్నవి. ఇందు అధిక సంఖ్యగల సంగ్రహణములు చేర్చబడినవి. అందుచే సాధారణముగా ప్రేక్షకులతో ప్రదర్శనశాల క్రిక్కిరిసియుండును. ఇందు వెలుతురు ఏర్పాటు కూడ సంపూర్ణముగా లేదు. ఇటలీలో గల చిత్రవస్తుప్రదర్శన శాలలు అసంఖ్యాక ములు. మిక్కిలి బాగుగా అమర్చబడి నటువంటియు, సర్వోత్తమముగా వర్గీకరించబడినట్టియు సంగ్రహణములు నేపిల్స్ లోని మ్యూజియోనాజియో నేల్ అనుచోట కనబడును. నేపిల్సే యొక్క అవ్యహిత, సన్నిహిత ప్రాంతములనుండియే ముఖ్యముగా సేకరించ బడిన రోమక క ళాఖండములు వేల సంఖ్యలో ఇందు లూయీ కానగును. నెపోలియన్

ఆమ్స్టర్ డామ్ లోని 'రిక్స్ మ్యూజియము', దాని ఏర్పాటును బట్టి మిక్కిలి విశిష్టమైనది. దీనిలో వరుస వారీగా గదులున్నవి. వీటియందు విభిన్న కాలిక ములయి నడచే కళా సంప్రదాయములకు చెందిన నమూనాలు ఒక్క వీక్షణమున గోచరించును. బెర్లిన్, వియన్నా నగరములయందు అగణ్య వస్తుసంపదగల చిత్రప్రదర్శన శాలలున్నవి. చిత్రశాలా శిల్ప కళాఖండములతో పాటు పురాతన క్రైస్తవ కళాఖండ సముదాయముకూడ సంపూ ర్ణముగా కొనియాడతగియున్నది. బెర్లిన్ లోని పురాతన మైన చిత్రవస్తు ప్రదర్శనశాల ప్రాచీనమైన చెక్కడపు ప్రతిమలకును, ఇటాలియన్ కళ చక్కగా ప్రతిబింబిత