పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/744

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిత్రవస్తుప్రదర్శనశాలలు


ఆంధ్రరాష్ట్రములో ఒక జిల్లాగా నుండెను. 1958 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము (విశాలాంధ్రము) నిర్మాణము కాగా, చిత్తూరుజిల్లా ఆంధ్రప్రదేశ్ 20 జిల్లాలలో నొక టిగా నున్నది*.

చిత్రవస్తుప్రదర్శనశాలలు :

చిత్రవస్తు ప్రదర్శనశాలలు (మ్యూజియములు) ప్రతి సాంస్కృతిక కేంద్రమునందును అత్యావశ్యక ములుగా గుర్తించబడినవి. ఒక దేశము మిక్కిలి పురోగమించిన కొలదియు, లేక ఒక నగరము సాంస్కృతిక ముగా అత్యభి వృద్ధిగాంచినకొలదియు దానియందలి చిత్రవస్తుప్రదర్శన శాలలసంఖ్యయు, వాని పై విధ్యమును పెరుగుచుండును. కాని చిత్రవస్తు ప్రదర్శనశాలల ఆరంభము మిక్కిలి విచి త్రముగా నున్నది. ఓషధులు, నక్కతోకలు, సర్పములు, నాగుబాముల పడగలు మున్నగువాని సేకరణతో చిత్ర ప్రదర్శనశాలలు ప్రారంభమైనవి. పెక్కుమంది డాంబిక వైద్యులు అట్టి వస్తువులను చూపి తమకు అద్భుతశ క్తులు కలవని ప్రకటించుచుండిరి. పదపడి ఇట్టి సంచయము అపురూపమైన, అరుదైన పదార్థముల ప్రదర్శనరూపము తాల్చినది. ప్రేక్షకుల బుద్ధిని భ్రమింపచేయుటకు ఏర్పడిన ఇట్టి ప్రాథమికములు, ప్రాకృతములు అగు వస్తుసంగ్ర హణముల నుండి శాస్త్రీయములును, క్రమపద్ధతి పై ఏర్పరుపబడినవియు నగు నేటి ఆధునిక చిత్రవస్తుశాలలు క్రమపరిణతి నొందినవి.

యూరపుఖండమందంతటను చిత్రవస్తుప్రదర్శనశాలల యొక్క సక్రమాభివృద్ధి పందొమ్మిదవ శతాబ్ది చతుర్థ పాదమునుండి పొడగట్టుచున్నది. కాని దీనికన్న ఇంకను పూర్వము కూడ చిత్రవస్తు ప్రదర్శనశాలల ఉద్దేశము ప్రాచీనుల మనస్సులో అణగియుండెను. క్రీ.పూ. 300 ఏండ్లనాడు అలెగ్జాండ్రియా నగరమున టాలమీ అను నాతని కొక చిత్రవస్తుప్రదర్శనశాల యుండెను. దానినుండి విద్వాంసులు మాత్రమే కొంతవరకు ప్రయో జనమును పడయగలిగిరి. ఏథెన్సు నగరమున చెక్కడపు విగ్రహముల సంగ్రహణము జనసామాన్యమునకు చూడ కాని వీలుగా నుండియుండెను. కాని అవి చిత్రవస్తు ప్రదర్శన శాలలుగా పరిగణింప బడలేదు. మధ్యకాలమున క్రైస్త వుల ప్రార్థనా మందిరములు, మఠములు వర్ణచిత్ర ప్రద ర్శన మందిరములుగా ఉపయోగింపబడినవి. సంస్థానాధి పతులును, జమీందారులును అరుదైన విలువగల వస్తువు లను కొనుటకును, సంపాదించుటకును, వాటిని ముగా భవనములం దుంచి సంరక్షించుటకును సమర్థు లగుచుండిరి. పదిల శాఖ

హిందూదేశములోని అజంతా, ఎల్లోరా గుహలును, సాంచీ, అమరావతీ స్తూపములును, దక్షిణో త్తరముల యందలి పెక్కు కోవెలలును, శిల్ప, వాస్తు కళాఖండ సంచయముయొక్క కలిమిచే చిత్రవస్తు ప్రదర్శన శాల లుగా తనరారుటయే గాక, చిత్రకళా 'ళా మందిరములుగా కూడ ప్రసిద్ధికెక్కినవి. మ్యూజియములు ప్రప్రథమమున వినోదాత్మకములుగా నుండినను, అవి వర్తమాన యుగ మున క్రమవికాసము చెంది విద్యావర్ధకములుగా నుండు నంతటి పరిణతి చెందినవి. విజ్ఞానము వివిధ ప్రత్యేక లుగా విస్తరించిన తరువాత లలితకళలు సువిభక్తములై వేర్వేరు క ళావిభాగములుగ రూపొందినవి. మ్యూజియ ములు ప్రత్యేక విషయములయందు విశిష్ట కృషి చేయ జాలుచున్నవి. సంపన్నులు చేసిన వివిధ వస్తుసంగ్రహణ ములు విస్తారమైన పైనను, వాటి ఆర్థికమయిన విలువ అపారమైన దైనను అవి మ్యూజియములుగా పరిగ ణింపబడవు. ఒక పద్ధతి, ఒక ఉద్దేశము గలది చిత్రవస్తు ప్రద ర్శనశాల యనిపించుకొనును. అవి దాని నిర్మాణములోని పడుగు పేకలు. లండన్ నగరములోని “సోయేన్ మ్యూజి యము" ను ఒక గూర్చి అధికారి ఇట్లు పలికెను. “చిత్ర వస్తుశాలా నిర్వహణమున ఆధునిక పద్ధతులచే నిషేధింప బడిన దోషము లన్నియు ఇందున్నవి. ప్రదర్శించిన వస్తు వుల విషయమున గాని, ప్రదర్శించు విషయమున గాని ఒక పద్ధతి గాని, శాస్త్రము గాని అనుసరిం పబడ లేదు. ఇందు గొప్ప గుణములుగల ప్రదర్శనీయ వస్తువులున్నను, గుణవిహీనమైన ఇతర వస్తువుల సాన్నిధ్యముచేత వాటి సొంపు తగ్గుచున్నది." ఈ పంక్తులు వ్యతిరేక విధానమున

  • The 1961 figures enumerated in the article are the "Provisional Figures" supplied to us by the courtesy of

the census Commissioner, Andhra Pradesh, Hyderahad. 1961-Editor. 684