చికిత్సాశాస్త్రము (వై)
సంగ్రహ ఆంధ్ర
మోతాదువలన ఎట్టి ఫలితమును ఉండదు. కాని శరీరము శీఘ్రగ్రాహక పరిస్థితిని పొందును. మరికొన్ని రోజుల తర్వాత రెండవ మోతాదును ఇంజక్షనుగా వాడిన వెనువెంటనే, ఆఘాతమువలన రోగి మృతినొందును. ఇదివరకు ఒక ఇంజక్షను ఇచ్చిన సంగతి తెలిసియున్న యెడల మొదట 1/4 సి. సి. లో చిన్న మోతాదులు ప్రయోగించి అందువలన ఫలితములు గమనించుట మంచిది. ఎట్టి దుష్ఫలితములు కలుగని యెడల ఇయ్యవలసిన మోతాదులో ఆ ద్రవమును ఇయ్యవచ్చును. రోగికి వ్యతిరేక ఫలితములు కలుగుచున్న యెడల ఆ సీరమును క్రమానుగతముగ కొద్ది మోతాదులలో ఇయ్యవలెను.
మందులను ఇచ్చు విధానము : నోటి ద్వారా లోపలికి మందులను ఇచ్చు పద్ధతి సర్వసాధారణమైన విధానము. రోగికి వాంతులు అగుచున్నప్పుడు, లేక స్పృహతప్పినపుడు, మందులను సూది ద్వారా ఇత్తురు. క్వినైన్ మ్రింగించుటవలన చలిజ్వరము పోవును. రోగికి వాంతులు అగుట కాని, స్పృహతప్పుటకాని సంభవించినచో లేక దానిని జీర్ణించుకొను పరిస్థితులలో రోగి లేని యెడల, దానిని సూదిద్వారా ఇయ్యవలెను.
సాధారణముగా ఈ ఇంజక్షనులను కండరాంతర్గత మార్గముద్వారా ఇచ్చెదరు. కాని కొన్నిటిని తప్పనిసరిగా సిరాంతర్గతమార్గము (ఇంట్రావీనస్ ) ద్వారా ఇయ్యవలసి యుండును. లేనియెడల అవి మిగుల బాధాకరము లగును. పాషాణ ఔషధములు (ఆర్సెనిక్ డ్రగ్సు) ఇందులకు ఉదాహరణములు. నీరుపోయిన రోగికి ద్రవము వలన సత్ఫలితములు కలుగుటకు సిరాంతర్గత పద్ధతిని ఇయ్యవలెను. ఇన్సులిన్ వంటి మందులు జీర్ణరసములవలన నశించును. అందువలన వాటిని ఇంజక్షనుల ద్వారానే ఇయ్యవలెను.
గ్లూకోసు, సోడియం క్లోరైడులవంటి కొన్ని మందులను ఇముడ్చుకొనగల శక్తి పురీషనాళము (రెక్టము)నకు కలదు. వాటిని పురీషనాళ మార్గముద్వారా ఇయ్యవచ్చును. కాని అటుల చేయబడుటలేదు. ఆ ఔషధములు ఇముడ్చుకొనబడగలవను నమ్మకము లేకపోవుటయే ఇందులకుగల కారణము. ఆ నష్టమును భర్తీచేయు నిమిత్తము ఆ ఔషధములను పెద్దమోతాదులో ఇయ్యవలసి యుండును. వాటిని రోగికి ఇచ్చుట, అతడు వాటిని ఇముడ్చుకొనుట కూడ మిగుల కష్టసాధ్యములే. రోగికి స్మృతి తప్పించుటకై వాడబడు క్లోరోఫారం, హిమద్రవము (ఈధర్ ) త్వరగా హరించి పోవునట్టివి. వాటిని పీల్పించవలెను. వైట్రస్ ఆక్సయిడునుకూడ ఇట్లే ఉపయోగింతురు. ఒక్కొక్కప్పుడు ఒకమందు శరీరములోని అన్నిమూలలకు చేరి అచ్చటి సూక్ష్మజీవులపై పని చేయుట సాధ్యము కాక పోవచ్చును. అప్పుడు ఆ మందును శరీరములోని అదే స్థానములోనుంచి, అచ్చటి సూక్ష్మజీవులపై చర్య కనబరచునట్లు చేయవలసి యుండును. రొమ్ము యొక్క తేజోమండల రంధ్రములోనికి పెన్సిలిన్ ఉంచుట, క్షయరోగులకు చిల్లిచేసి స్ట్రెప్టోమైసిన్ ఇంజక్షన్ ఇచ్చుట, శస్త్రచికిత్స నిమిత్తము స్పృహతప్పించుటకొరకు వెన్నెముకలోనికి చిల్లిచేసి ప్రోకెన్ మిశ్రమములు ఇంజక్షన్ ద్వారా పంపుట —— ఇందులకు ఉదాహరణములు. ఒక ప్రత్యేకస్థానములో మత్తు కల్గించుటకు 1/2 - 2% గల ప్రొకేన్ ద్రవమును శస్త్రచికిత్స కావలసినచోట స్థానికముగా ఇంజక్షను యిచ్చెదరు. నరములపని ఆపు చేయుటకు, నొప్పిని తగ్గించుటకు మందును నరములలోనికి ఇంజక్షనుల ద్వారా పంపుదురు. గజ్జి మొదలగు చర్మవ్యాధులకు కూడ మందులను నోటిద్వారా ఇచ్చుట వ్యర్థము. ఆ మందులను మలామా (ఆయింట్ మెంటు) రూపములో వేసలైనులో కలిపి ఇచ్చినయెడల, వాటిని కావలసినచోట రాచుకొనుటకు వీలుగా నుండును. కావున ఒక మందును ఏరీతిని ఇచ్చుట అను విషయము ఆ మందు శరీరములో ఏ భాగముపై పనిచేయగలదు ? అది ఎంతత్వరగా పనిచేయగలదు? అను రెండువిషయములపై నాధారపడును.
మోతాదు : రోగి వయస్సునుబట్టి తదనుగుణముగా మోతాదును నిర్ణయించవలెను. ఆ వ్యక్తి బరువును కొలిచి దానినిబట్టి మోతాదును నిర్ణయించుట అంతకన్న సరియగుపద్ధతి.
కిలోశరీరపు బరువు (2.2 పౌనులు) నకు ఇన్ని మిలీగ్రాములని మోతాదును వ్యక్తముచేయుదురు. పరస్పరానుగుణ్యములేని రెండుమందులు కలిపినయెడల ప్రతీఘాతకరముగ పరిణమించును. ఆమ్లములు, క్షారములు
666