చారిత్రక భౌతికవాదము duction) అను సాంకేతిక నామముతో వ్యవహరించు చున్నాము. ఉత్ప త్తిసాధనములకు దోహదకారులుగా అత్యవసరములైన ఇతర పదార్థములు లభ్యమైన నేగాని ఉత్పత్తికొనసాగదు. శ్రమచేయుమానవుడు లేనిదే యంత్ర 'పరికరములు సయితము వాటియంతట అవి కదలనేరవు గదా ! కనుక ఉత్పత్తి కవసరమైన ప్రధానాంగములలో మానవుడొకడు. అదే విధముగా మానవుడు వ్యవసా యము నేర్చినప్పటినుండి భూమికూడ ఉత్పత్తికి అవసర మైన పదార్థముగా పరిగణింపబడినది. ఈ ఉత్పత్తి సంబం ధములు సమాన ప్రాతిపదిక పై ఏర్పడియుండనువచ్చును; లేదా, అసమానత, ఆర్థిక పీడనము (Economic exploi- tation) లపై అధారపడియుండనువచ్చును. పెట్టుబడి దారీ సమాజవ్యవస్థలో (Capitalism-పూంజీవాదము) ఈ సంబంధములు విధిగా అసమాన ప్రాతిపదిక పై, ఆర్థిక పీడన మాధారముగ ఏర్పడును. ఇదే విధముగా, ఆదిమ సమాజమునందలి ఆర్థికసంబంధములు విడిచి పుచ్చినచో, గతచరిత్రలో అన్నిదళలందును అసమానములైన ఆర్థిక పీడన సంబంధములే కొనసాగుచు వచ్చినవి. కాగా, సామ్య వాద సమాజము (Socialism) నందలి ఆర్థిక, సాంఘిక సంబంధములు సరిసమాన ప్రాతిపదిక పై నుండుట కవ కాళము గలదు. వర్తమానకాలములో ఒకదాని సరసనే మరి యొకటి సహజీవన మాచరించుచున్న సామ్యవాద, పెట్టుబడిదారీ వ్యవస్థలలో వ్యవహారమునందున్న విభిన్న ములగు సంబంధములే ఇందుకు ప్రత్యదోదాహరణము లుగా ఎంచవచ్చును. సమాజ పరిణామమునకు మూలకారణములు : ప్రపంచ ములో నిరంతరము జరుగు మార్పులకు హేతుభూతము లైన సూత్రములు 'గతితార్కిక సిద్ధాంతము' అని (dia- lectical laws) పేర్కొనబడుచున్నవి. భౌతిక వాద దృక్పథము, గతితార్కిక పరిశీలనావిధానము - ఈ రెండును కలిసి 'గతితార్కిక భౌతిక వాదము' (dia- lectical materialism) అని పిలువబడినది. ఏదేని యొక సమస్యనుగూర్చి మొట్టమొదట స్థూలముగ నొక దృక్ప థమును కల్గించుకొని, అటు పిమ్మట ఆ సమస్య యొక్క పుట్టుపూర్వోత్తరములను పరిశీలించవలసి యం. స్థూలమైన దృక్పథమును ఏర్పరచుకొనుటలో ఆ సమ 650 సంగ్రహ ఆంధ్ర స్యకు పునాది (basic structure) ఏది? పునాదిపై నిర్మితమైన కట్టడ (super structure) మేది ? అని విత ర్కించవలసి యుండును, అందులో, మరల ప్రధాన మైన ప్రాతిపదిక ఎట్టిది ? దానిపై ఉద్భవించిన ఉపాంగము లెవ్వి? అనిగూడ విచారించవలెను. అనంతర మా పునాదిని సుదీర్ఘముగ పరిశీలించవలెను. ఆ పునాది ఎట్లేర్పడినది ? ఏర్పడుటకు పూర్వము ఏమి యుండెడిది? అందుండి పునాది ఎట్లు పుట్టుకొని పచ్చెను ? ఈ పునాది మారు చున్నదా? మారుచున్నచో అందుకు కారణమేమి? ఈ మొదలైన పెక్కు విషయములను గతితార్కిక సిద్దాంత ముల సహాయముతో పరిశీలించినచో సవ్యమైన సమా ధానములను సేకరించగలము. ఈ క్రింద నుదహరించినవి ప్రధానములైన గతితారిక సూత్రములుగు సిద్ధాంతీకరింపబడి, స్థిరపరుపబడినవి : (1) ఒక ఘటనమును (event) లేక ఒక దశను (period) పరిశీలించునప్పుడు, అంతకు పూర్వమున్న దశల నడుమగల సంబంధములను గుర్తించవలెను. | (2) ప్రతి ఘటనమునకు, ప్రతిదశకు నిరంతరము చల నము కలదు : అనగా మార్పుకలదు: సృష్టి, స్థితి, లయ ములు గలవు . అనగా భూత, వర్తమాన, భవిష్యత్కాల ములు గలవు. కనుక ప్రతిక్షణము భవిష్యత్తుకు సంబం ధించిన నూతనశక్తి మన ఎదుట ప్రత్యక్షమగు చుండును. భూత కాలమునాటి ప్రతీపశక్తులు క్షణక్షణము నశించుచునే యుండును. అనగా తొలిసమాజము నుండియే నూతన సమాజము ఆవిర్భవించు చుండు నని భావము. (3) ఈ నిరంతర చలనమునకు, ఆ ఘటనమునందో లేక దశయందో ఇమిడియున్న అంతర వైరుధ్యము లే (internal contradictions) మూల బీజములు . (4) ఈ మార్పులు, ఈ చలనములు ఎల్లప్పుడు ప్రశాంతముగ, పరిణామాత్మకముగ (evolutionarily) సంభవించక, అపుడపుడు ఆకస్మికముగ, ఉధృతముగ జరగు గుణాత్మక మైన పరివర్తనములుగ నుండును. ఈ (5) అభ్యుదయకరమైన పరివర్తనములు ఎల్లపుడు ముక్కు కుసూటిగా, సోపానక్రమములో జరగవు. అభ్యుదయము నత్తగుల్ల నడకలో సాగిపోవుచుండును. అంతేకాదు; మానవుడు శ్రమించి సాధించిన అభ్యుదయము $8
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/710
ఈ పుటను అచ్చుదిద్దలేదు