పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/709

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 ముఖ్యముగా జర్మనీ దేశమున - భౌతిక వాద దృక్పథములో ప్రగతిశీలమైన పరిణామము సంభవించినది. హెగెల్ అను సుప్రసిద్ధ జర్మను తత్వవేత్త భౌతిక వాద దృక్పథములో క్రొత్తపుంతలు త్రొక్కి, క్రొత్త పరిశోధనములు జరపి, 'గతితార్కిక భౌతిక వాద 'మను (dialectical materi- alism) నూతన సిద్ధాంతమునకు బీజములు నా టెను. ఆతని అనంతరము మార్క్స్, ఎంగెల్స్ అను సుప్రసిద్ధ తాత్త్విక, రాజకీయ, ఆర్థిక వేత్తలు, హెగెల్ ప్రతిపాదించిన 'గతి తార్కిక ' సిద్ధాంతములయందు ఇతోధికముగా సుదీర్ఘము లైన పరిశోధనములు జరిపి, వాటిని చారిత్రక సంఘటన ముల కన్వయించి, పెక్కు రచనలు గావించిరి. ఈ అన్వయ ఫలితముగ, వారి జీవిత కాలమునందే, వారు ఆవిష్క రించిన సిద్దాంతములు సశాస్త్రీయము లైనవనియు, ఆచరణయోగ్యము లైనవనియు, అనుభవపూర్వక ముగ పెక్కు చారిత్రక సంఘటనముల ద్వారమున నిరూపింప బడెను. ఇక చారిత్రక భౌతికవాద మన నెట్టిదో తెలిసి కొందము. చరిత్ర అనగా నేమి ? మానవజాతి పరిణామశీలమైనది; నిరంతరము పరివర్తనము చెందునది. ప్రాచీన కాలము నుండియు సామాజిక వ్యవస్థలు ఒకటివెంట మరియొకటి అంతరించినవి. ఇన్నివ్యవస్థలు గడచి మనమీనాడు అధు నాతన మైన నాగరిక సమాజములో జీవించుచున్నాము. వెనుకటి తరములవారు బహుశః ఊహించి ఎరుగని విజ్ఞానశాస్త్ర పరిశోధనము లీనాడు శరవేగమున జరుగు చున్నవి. ఈ పరిశోధనముల ఫలితముగా మానవు లీనాడు ఎన్ని యో ఐహిక ప్రయోజనములను అనుభవింపగలు చున్నారు. పూర్వమెన్నడును కని విని ఎరుగని యాంత్రిక నాగరికత నేడు విశ్వమంతయు నావరించి యున్నది. అత్యంత ప్రాచీన కాలములో ఆటవికస్థితి యందు ద్రిమ్మరుచుండిన మానవజాతి పెక్కు దశలు దాటి, విశే షానుభవములు గడించి, అత్యంత ఆధునికములైన పరికర ములు నిర్మింపగల నవనాగరిక సమాజముగా పరిణామము చెందినది. ఆర్థిక, సాంఘిక, రాజకీయ క్షేత్రములం దేకాక, భావప్రపంచమునకు సంబంధించిన సాహిత్య, సాంస్కృ తిక, తాత్విక, నీతిశాస్త్రాది పెక్కు మానవశాస్త్రము 82 649 చారిత్రక భౌతికవాదము లందును మానవుని జీవితదృక్పథము ఊహాతీత మైన పరి వర్తనములు చెందుచున్నది. పరిణామశీలమైన ప్రపంచ చరిత్ర నిర్దిష్టమైన సూత్ర ముల ననుసరించి నడచుచున్నదా ? లేక దైవిక మైన, అనూహ్యమైన కారణములవలన గమించుచున్నదా ? అనెడి ప్రశ్న తాత్వికులైన మేధావులను చాలకాలముగా ఎదుర్కొనుచున్నది. చరిత్రగమనములో జరుగు పరివర్త నములు కేవలము యాదృచ్ఛికములైనవి కావనియు, సహజము, స్వతస్సిద్ధమునైన ప్రకృతి సూత్రముల ననుస రించి ఇవి ఘటిల్లుననియు హెగెల్, మార్క్స్, ఎంగెల్స్ ప్రభృతులు సిద్ధాంతీకరించి యున్నారు. పదార్థ విజ్ఞాన శాస్త్రము, రసాయన శాస్త్రము, ఖగోళ శాస్త్రము మున్నగు వివిధ శాస్త్రములు పలు సమస్యలను గూర్చి మానవునకు అఖండ మైన పరిజ్ఞానము కలుగ జేయుచున్నవి. ప్రామాణికములైన విజ్ఞానశాస్త్రములుగా వీటిని పరిగ ణించుచు వ్యవహారమున నుంచుచున్నాము. అట్లే సమాజపరిణామశాస్త్రము, చరిత్ర, తత్వశాస్త్రము, నీతి శాస్త్రము మున్నగు మానవశాస్త్రములలో (humani- ties) గూడ ప్రామాణిక మైన విజ్ఞానమును ఆర్జించవచ్చు నని నిరూపింపబడినది. మానవాకృతి భూతలముపై నేర్పడి 5 లక్షల వత్స రములై నట్లు పరిశోధనలవలన అంచనా కట్టబడినది. ఈ మొ త్తము కాలములో నాగరికదశ ప్రారంభ మై 10 వేల సంవత్సరములు గడచిన వట. యాంత్రిక నాగరికత మొదలై సుమారు నాలుగైదు శతాబ్దులు మాత్రమే జరగినవని తెలియవచ్చుచున్నది. తరువాతి మానవచరిత్ర నే మన మీ వ్యాసములో పరిశీలించము. తడి అయా ఆదిమ సమాజములో మానవులు సమష్టి కృషితో ఆహారసంపాదనము చేసికొనెడివారు. పరస్పరము వారు 'గావించుకొనిన సహాయ సహకారములు ఈ కాలము నాటి సాంకేతిక పరిభాషలో “ఆర్థిక సంబంధములు” (Economic relations) లేక “ఉత్పత్తి సంబంధములు" (Relations of Production) అని వ్యవహరింపబడు చున్నవి. అత్యంత ప్రాచీనములైన పరికరములనుండి, అత్యంత అధునాతనములైన యంత్రసాధనములవరకు అన్నింటినీ "ఉత్పత్తి సాధనములు" (Means of Pro-