పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/708

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చారిత్రక భౌతికవాదము 648 సంగ్రహ ఆంధ్ర

1765 సంవత్సరము నుండియు ఆంగ్లప్రభుత్వము వారీ సామర్లకోట ప్రాంతము చెఱకుపంటకు ప్రధానముగా నున్నదని గుర్తించిరి. ప్యారీకంపెనీయను బ్రిటీషు సంస్థ 1897 లో నిచ్చట నొక పంచదార ఫ్యాక్టరీని స్థాపించెను. అది దినదినాభివృద్ధి నొందినది. అనుదినము సుమారైదు వందల మంది పనివాండ్ర కిందు జీవనోపాధి లభించు చున్నది. 1952 నాటికి సంస్థ పెట్టుబడి 26,92000 రూపా యలు. పదిలక్షల రూప్యములు నిధులుకూడ నున్నవి. ఇందలి యంత్రములు దినమున కై దువందల టన్నుల చెఱకు ఆడగలవు. తాటిబెల్లము, చెఱకు బెల్లములనుండి పంచదార తీయుచున్నారు. సగటున సంవత్సరమున కిట అది వేల మణుగుల పంచదార యుత్పత్తి యగుచున్నది. చెఱకుపిప్పి మున్నగువాటిని వ్యర్థముగా పోనీక వానినుండి పిప్పరమెంట్లు మున్నగునవి తయారు చేయు యంత్రభాగముల నిట అనుబంధముగా జేర్చిరి.

చెఱకు తెగుళ్ళచే పంట క్షీణించుటచే ప్రభుత్వము వారు ఓషధీశాస్త్రనిపుణులను నియోగించి పరిశోధనలు గావింపజేసిరి. పరిశోధకుల సూచనలనుబట్టి సర్కారు వారు సామర్లకోటలో పరిశోధనాత్మక వ్యవసాయ కేంద్ర మును 1902 లో స్థాపించిరి. ఇది కాకినాడ కాలువ లోని సామర్లకోట లాకును ఆనుకొనియున్నది. సుమారు నలుబదియెకరముల విస్తీర్ణమున ఈ వ్యవసాయక్షేత్రము వారు వివిధములగు పంటలు పండించుచు. రైతులకు చక్కని వ్యవసాయిక విజ్ఞానము నందించుచున్నారు. ఈ సంస్థ శాశ్వత సంస్థగా మార్చబడినది.

సామర్లకోటలో మంగుళూరు పెంకుల పరిశ్రమకూడ విరివిగ పెంపొందినది. పెద్దాపురమునకు పోవు రోడ్డు నానుకొని మంగుళూరు పెంకుల కార్ఖానాలున్నవి. ఈ యూర, తోళ్ళను బాగుచేయు సంస్థకూడ నొకటి గలదు. ఇటీవల సర్కారువారు పారిశ్రామిక శిక్షణకేంద్రము నొకదానిని ఊరికు త్తర భాగమున స్థాపించిరి. యువకుల కిట వివిధ పారిశ్రామిక శిక్షణము లియబడుచున్నవి.

వా. రా.


చారిత్రక భౌతికవాదము (Historical Materialism) :

ప్రపంచ గమనమును, ప్రపంచ సమస్యలను పరిశీలిం చుట యందు భౌతిక వాద దృక్పథమును (materialist outlook) అనుసరించవలెననియు, అదియే సశాస్త్రీయ మైన, సహేతుక మైన మార్గమనియు పలు దేశములయం దలి దేహాత్మక వాదులు భావించి యుండిరి. ప్రపంచము యొక్క సృష్టిస్థితులకు పదార్థము (matter) మూల మనియు, పదార్థమే వివిధ రూపములలో మానవా కారము వరకు పరిణామము చెందినదనియు, అతి దీర్ఘ మైన ఈ పరిణామ దశలలో చిరకాలమున కేర్పడిన మానవజన్మమునకు, అంతకు పూర్వము జీవకోటికి లేని ఆలోచనాశక్తి, భావనావైశిష్ట్యము తన్మూలా ధార మైన 'మెదడు' అను పదార్థవి శేష మేర్పడినదనియు, మానవుని ఆలోచనా విధానమునే 'భావ' మని పిలుచుచున్నా మనియు దేహాత్మక వాదులు తార్కికముగను, హేతు బద్ధముగను వివరించియుండిరి. ఈ వివరణము ననుసరించి పదార్థము సనాతన మైనదనియు, మౌలిక మైనదనియు బోధపడుచున్నది. పదార్థ పరిణామక్రమములో అత్యు న్నతము, అతి సున్నితము, అత్యంత కోమలము నైన 'మెదడు' ద్వారమున భావ మేర్పడినది. పదార్థమునకును, భావమునకును నడుమగల అవినాభావ సంబంధమును పై విధముగా వివరించునదే దేహాత్మక (భౌతిక) వాద సిద్దాంతమనబడుచున్నది.

చరిత్ర పరిణామమునకు అన్వయించబడు భౌతిక వాద దృక్పథము చారిత్రక దేహాత్మక వాదమను పేర బరుగు చున్నది. ప్రాచీన కాలమునుండియు వివిధ దేశములలో వివిధ భావనారీతులకు చెందిన దేహాత్మవాదులు అవతరించి తమ సిద్ధాంతములను విపులముగ ప్రచారము చేసి యున్నారు. కాని పెక్కు కారణములవలన వారిలో చారిత్రక దృష్టి అంతగా అంకురించి యున్నట్లు గోచ రించదు. కాని ప్రాచీన కాలములో తలయెత్తిన విభిన్నము లైన భౌతిక వాద ధోరణులను అనంతర తరములవారు పర్యాలోకించి, విమర్శనాదృష్టితో అధ్యయనముగావించి, దీర్ఘమైన పరిశోధనములు చేసియున్నారు. తత్ఫలితముగా 'ప్రాచీనములైన భావధోరణులనుండి నూతన భావము లుత్పన్నమై క్రొత్తమార్గమున పరిణామము చెందినవి.

ఐరోపా ఖండములో భూస్వామ్యవ్యవస్థ (Feudalism) అంతరించి, పారిశ్రామి మికయుగ మవతరించిన అనంతరము