పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/707

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము – 3 647 3 చామర్లకోట

నుండి ఏలేరు అను ఏటి తీరమునుండి ఈ కుమారా రామము మీదుగనే సర్పవరము చేరి, తుల్యభాగానదిని గడచి, భీమమండలమును బ్రవేశించెనని శ్రీనాథకవి వర్ణిం చెను. ఈ ప్రదేశమంతయు వరిచేలు, చెఱకు తోటలు, మామిడి, కొబ్బరి, పోక మొదలగుతోటలు కలిగి యొప్పె నని వర్ణింపబడెను. 'కలమశాలి శారదాముఖాది వ్రీహి సస్యంబులవలనను నిరంతర నారికేళ చ్ఛదచ్ఛాయాచ్ఛన్న హరిదంతరంబులగు భుజంగవల్లిమతల్లీ కాలింగిత క్రముక కంఠోపకంఠంబుల గ్రీడించునసఫలసారణి పరంపరా రంభాపలాశ సంభారంబులు ... అఖిల భువనాభిరామంబు లైన యారామంబుల వలనను"-ఇట్లు భీమేశ్వర పురాణ మున (2-55) గలదు.

సామర్లకోట ప్రాంత దేశము ఆంధ్రదేశము నేలిన పెక్కు వంశముల రాజుల పాలనము ననుభవించెను. కాకతీయ కొంతకాలము పతనానంతరమున గజపతుల రాజ్య యొకయు, కొండవీడు, రాజమహేంద్రవరపు రెడ్డిరాజు యొక్కయు ప్రాభవ మిట చెల్లెను. కాటయ వేమా రెడ్డి యీప్రాంతమును జయించెను. పిమ్మట మొగలాయి పాలనమునకును, తరువాత హైదరాబాదు నై జాముల యాధిపత్యమునకు ఈ ప్రాంతము గురియయ్యెను. పెద్దా పురము, పిఠాపురము, విజయనగరములందు సంస్థానా ధీశులును, జమీందారులును నెలకొని శతాబ్దముల తర డిగా నీ ప్రాంతము నేలుచు బలాఢ్యులును విజేతలును నగు సమ్రాట్టులతో సందర్భానుసారముగా వైరము లును, నెయ్యములును నెరపుచు ప్రజలనుండి పన్నులు గ్రహించుచుండిరి. సామర్లకోట పిఠాపురపు సంస్థాన ములో జేరినట్టిది. మాధవరావు అను వెలమ ప్రభువు ఈ వంశమున నొక మూలపురుషుడు. పిఠాపురపు జమీం దారు మొదట సామర్లకోటలో నివసించుచు తరువాత పిఠాపురము చేరుకొనెను. ఈ వంశములో తెనుగురావు అను నతడు రాజమహేంద్రవర సర్కారుకు సర్దా రాయెను. పదు నెనిమిదవ శతాబ్దములో సామర్లకోట మరల రాజధానీస్థల మాయెను. అప్పటికి డచ్చివారు. ఫ్రెంచివారు, ఆంగ్లేయులు మొదలగు విదేశీయు శ్రీ దేశ మున పరిపాలనము నెలకొల్పుకొనుటకు పరస్పర యుద్ధ ములతో దేశమును అట్టుడికించున ట్లుడికింప జొచ్చిరి. 1758 లో ఆంగ్లసై స్యములు విజయనగర సంస్థానాధీశుని ప్రోత్సాహమున సామర్లకోట మీదికి నడచెను. ఇచ్చటి కోట మూడు నెలలపాటు ఆంగ్లేయుల ముట్టడిని ధిక్క రించి నిలువగలిగెను. తుదకు లొంగిపోయెను. ఆంగ్లే యులు 1759 లో సామర్లకోటను వశముచేసికొని ఫ్రెంచి సేనలను కాకినాడకు తరిమిరి. 1765 నాటికి ఉ త్తరసర్కార్ల ప్రాంతము నై జాముపాలననుండి తొలగి, ఆంగ్లేయుల వశమాయెను. ఢిల్లీ చక్రవర్తి ఉత్తర సర్కార్లను ఆంగ్లేయులకు దానముగా నిచ్చుచు ఫర్మానా నిచ్చెను. నాటినుండియు ఈ ప్రాంతమునకు పరిపాలనా స్థైర్యము కలిగెను. అప్పుడు సామర్లకోట ఆంగ్లేయ సైనికదళము లకు ప్రధాన ఆరోగ్య నివాస కేంద్రమాయెను. 1786 లో నిట సేనానివేశములు (బ్యారక్సు) కట్టిరి. సైనికుల కవాతులకు సామర్లకోట ఊరి యుత్తరముననున్న పెద్ద బయళ్ళు కంటోన్మెంటు బయళ్ళుగా నేర్పడెను. 1888 లో ఆంగ్లసైనికు లిచ్చటికోటను నేలమట్టము చేసిరి. 1868 లో నిచ్చటి సేనాని వేళములు ఎత్తివేయబడెను. భద్రాచలపు మన్యప్రాంతములో 1879 లో రంపపితూరీ జరుగుట చే రెండు ఆంగ్లపటాలములు సామర్లకోటలో నిలుపబడెను. అవికూడ 1893 లో తొలగింపబడెను. ఫ్రెంచి, ఆంగ్ల సేనానులును, విజయనగర సంస్థానాధిపతులును, నైజా మును పరస్పర యుద్ధములలో చిక్కుకొనియున్న కాల ములో ఫ్రెంచివారి సహాయమున విజయనగర రాజు బొబ్బిలికోటను ముట్టడించెను. బొబ్బిలి వెలమవీరులు యుద్ధభూమికి తమప్రాణములను ధారపోయ నురికిరి. బొబ్బిలికోట సర్వనాశనమగు స్థితిరాగా, రాణివాసపు స్త్రీలు అగ్నిలో దమ ప్రాణము లర్పింప సిద్ధపడిరి. బొబ్బిలి రాణి మల్లమదేవి, చినవెంకట రావను తన యైదేండ్ల బాలునికి బ్రాహ్మణకుమారు వేషమువేసి యొక దాసిచే, సామర్లకోటలో నున్న తన చెల్లెలు జగ్గయ్య దేవి కడకు బం పెను. బాలుడు శత్రువులచేత జిక్కెను. విజయ నగర రాజు శత్రువంశాంకుర ముండరాదని వధింపనెంచగా, ఫ్రెంచి సేనాని బుస్సీ యను నాతడు బాలుని గాపాడెనని బొబ్బిలి యుద్ధకథ వలన తెలియు చున్నది. ఇట్లు సామర్లకోట దేశ చరిత్రలో కొంత కీలక స్థానము వహించెను.