పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/703

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 643 చలనచిత్రములు

స్వరూపమును స్వీకరించి, శబ్దమునకు సంబంధించిన ఫిల్ము మీద 'రికార్డు' కాగలదు. షూట్ చేయబడిన చిత్రము యొక్క 'నెగెటివు'ను, సౌండ్ (ధ్వని) 'నెగెటివు'ను మొదట లేబరేటరీలోను, అటుపిమ్మట ఎడిటింగు శాఖ లోను సమశ్రుతిలో జోడింపబడును. దీనినే 'సింక్రో నైజే షన్' (synchronization) అనెదరు. చిత్రము విడుదల అగువరకు చిత్రమును, సౌండ్ నెగెటివులును ఒకే పాజి టివ్ మీద 'ప్రింట్' కానేరవు. చిత్రము విడుదల యయి నప్పుడు మాత్రమే ఆ రెండును కలిపి 'ప్రింట్' చేయ బడును. ఈలోగా ఈ నెగెటివులకు సంబంధించిన పాజి టివ్ ప్రింట్లను ఎన్నియయినను తీసికొనవచ్చును.

నేపధ్యగానము (Play - back): శబ్దగ్రహణ పథ ములో 'ప్లే బాక్' విధానము మరొక మైలురాయి వంటిది. పూర్వము చిత్రము షూటింగు జరుగుచున్నప్పుడే పాటలు గూడ 'రికార్డు' చేయబడెడివి. వర్తమానకాల మున పాటలను ప్రత్యేకముగా రికార్డుచేసి, షూటింగులో ఆ పాటలయొక్క శబ్లోచ్చారణకు అనువుగా నటీనటులచే పెదవుల సంచలనమును సరిచేయుట సంభవించుచున్నది. ఈ విధానముచే నేపథ్య గాయకీ గాయకుల ప్రాముఖ్యము హెచ్చెను.

పూర్వము శబ్దమును సరాసరి 'సౌండు ఫిల్ము' మీద నే రికార్డు చేసెడివారు. ఇప్పు డట్లుకాదు. ఆధునిక యుగ మున 'మాగ్నెటిక్ రికార్డింగు' అమలులోనికి వచ్చెను. టేపుమీద పాటలను రికార్డు చేసికొని వీటిని అప్పటి కప్పుడు విని అందుండి మేలైన వాటిని ఎన్నుకొనిన అనంతరము —— వాటిని సౌండ్ ఫిల్ముకు ట్రాన్స్ఫర్ చేయుట ఈనాడు జరుగుచున్న విధానము. ఈ విధానము వలన మిక్కిలి ఖరీదుగల ఫిల్మును పొదుపుగా వాడుటకు అవకాశము కల్గుచున్నది.

పొడుగు చిత్రములు; పొట్టి చిత్రములు : స్థూలదృష్టితో చూచినచో ఈనాడు నిర్మించబడుచున్న చిత్రములు రెండు రకములుగా నున్నవి. పొడుగు చిత్రములు మొదటి రక మునకు చెందినవి ; పొట్టి చిత్రములు రెండవరక మునకు చెందినవి. పొడుగు చిత్రములను 'ఫీచర్ ఫిల్ము'ల నెదరు. డాక్యుమెంటరీలు, వార్తా చిత్రములు, విద్యావిషయక చిత్రములు, వైజ్ఞానిక ప్రబోధక చిత్రములు, వ్యాపార ప్రకటనలకు చెందిన చిత్రములు— ఇవన్నియు పొట్టి చిత్రముల జాబితాలోనికి రాగలవు.

ఈనాడు సర్వసాధారణంగా థియేటర్లలో వినో దార్థము మనము పొడుగు చిత్రములనే చూచుచు న్నాము. ఇవి “టు డై మెన్షనల్" (Two dimensional) చిత్రములని పేర్కొనబడుచున్నవి. మనము ఒక కంటిని మూసికొని మరియొక కంటితో చూచినచో, మన సమ క్షములో కొంతమేర మాత్రమే కనిపించగలదు. ఈ మేరను 'టు డై 'మెన్షనల్' అనియెదరు. రెండు కండ్లను తెరచికొని చూచినచో, సమగ్రమైన మేర మనక గపడును. ఈ విశాల మైన మేరను కనపరచు చిత్రములే “త్రి డైమెన్ష నల్" (Three dimensional) చిత్రములని పిలువబడు చున్నవి. సినిమాథియేటర్లలో 'త్రిడై మెన్షనల్ ' చిత్రములు ఏక కాలమున రెండు ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శింపబడును. దుర్నిరీక్ష్యమైన కాంతి వీటియొక్క ప్రొజెక్షనులో ఉప యోగింపబడుట చేత, ఇట్టి చిత్రమును చూచువారు- నేత్ర దృష్టి దెబ్బతినకుండుటకై, ప్రత్యేక మైన సులోచనము లను ధరింపవలసి యుండును. ఈ చిత్రములలో పాత్రలు, సన్ని వేశములు, ధ్వనులు సాక్షాత్తు మన కళ్లముందు కన్పించుచున్నట్లు భ్రమ కల్గును. వీటిని స్టూడియోలో షూట్ చేయునప్పుడు గూడ శ క్తిమంతమైన కెమేరా లెన్సులు ఉపయోగింపబడును.

'సినీరమ', 'విస్టావిజన్', 'సినిమాస్కోవ్' మొదలైన చలనచిత్రరూపములు వివిధ పాత్రల స్వరూపమును స్నిగ్ద ముగా చూపించుటకును, సన్ని వేశముల ప్రాముఖ్యమును స్ఫుటముగా కన్పింపజేయుటకును దోహదము చేయ గలవు. బ్రహ్మాండ మైన యుద్ధదృశ్యములు ఈ రూపములలో ప్రస్ఫుటముగా కాన్పించును. అయి తే వీటిని స్టూడియోలో షూట్ చేయుటకు సాధారణమైన కేమెరాలు ఉపయో గింపబడినను, వాటి 'ఫ్రేమింగు' వైశాల్యమును చూపించును. థియేటరులో మనముచూచు సాధారణ చిత్రము 15'×20' వైశాల్యముగల వెండి తెరమీద ప్రొజెక్టు చేయబడును. పైన పేర్కొనబడిన చిత్రములు 20'+40' 3 20' + 40' వైశాల్యముగల వెండితెరమీదనే ప్రొజెక్టు చేయబడుటకు వీలగును.

ఈనాడు మనము సినిమాథియేటరులలో 35 మిల్లి