పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/702

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చలనచిత్రములు సంగ్రహ ఆంధ్ర


మొత్తముపై చలనచిత్రము విశ్వమంతటను ఒక విధమైన సంచలనమును కలుగజేసెను. ఉద్వేగమును, ఆ వేళమును కలిగించగల కథావస్తువులు చిత్రముల కెక్క వలసిన ఆవశ్యకత గుర్తింపబడినది. వేయి అడుగుల చిత్ర ములు క్రమముగా మూడువేల అడుగుల చిత్రములుగా అభివృద్ధి కాజొచ్చెను.

ఫిల్ముస్టూడియోల అవతరణ : దీర్ఘమైన చిత్రనిర్మాణము ఆరంభమగుటతో ఆధునిక యంత్రపరికరములతో కూడు కొని యున్న ఫిల్ముస్టూడియోలుగూడ వెలిసినవి. శక్తి మంతమైన కాంతిప్రసరణము నిచ్చుటకు బృహద్రూపమున విద్యుద్దీపములుగూడ వ్యాప్తిలోనికి వచ్చినవి. వివిధ దృశ్యములను కళాత్మకముగా గోచరింపజేయుటకై అను వైన 'సెట్స్' స్టూడియోలలో నిర్మాణము చెందనారంభించెను.

చిత్రము - 188 పటము - 5 ఇండ్లలో ఉపయోగించు సినిమా

క్రీ. శ. 1908 లో యూ జెనీలూస్ట్ యనునాతడు గొప్ప పరిశోధన సలిపి, చిత్రమునుతీయు ఫిల్ముమీద నే శబ్దమునుగూడ 'రికార్డు' చేయగలిగెను. కాని ఈ విధా నములో స్ఫుటత్వము సరిగా సిద్ధించలేదు. క్రీ.శ. 1914 వరకు ఇంగ్లండు, ఫ్రాన్సు, ఇటలీ, అమెరికా దేశ ములు వినోదమున కుపయోగపడు మూగచిత్రములను నిర్మిం చుటలో పందెపు గుఱ్ఱములవలె ముందునకు పరుగులిడ సాగెను. ఈ మూగచిత్రములలో 'సీరియల్స్' గూడ తయారయ్యెను. అంతలోనే ప్రపంచ మహాసంగ్రామ మారంభమయ్యెను. ప్రళయ సంక్షోభముగా పరిణమించిన 3 మహాసంగ్రామము కారణముగా సినిమా సాంకేతిక శాస్త్రాభివృద్ధికి గొప్ప అంతరాయము కలిగెను.

యుద్ధానంతరము యూరప్ ఖండమందలి పెక్కు దేశములు చలనచిత్రకళ మీద తమ దృష్టిని కేంద్రీభూత మొనర్చెను. శబ్దమును సశాస్త్రీయముగా 'రికార్డు' చేయుటకు ప్రయోగములు సాగెను. చిత్రమొక ఫిల్ము పైనను, శబ్దము వేరొక ఫిల్ము పైనను ఏక కాలములో, ఒకే వడిలో -' రికార్డు' చేయుటకు ప్రయత్నములు జరి గెను. క్రీ. శ. 1925 లో ఈ ప్రయత్నములకు అఖండ విజయము చేకూ రెను. క్రీ. శ. 1925 లో వార్నర్ బ్రదర్స్ “ది జాజ్ సింగర్”, “ది సింగింగ్ ఫూల్" అను రెండు శబ్దచిత్రములను నిర్మించిరి. ఈ చిత్రములు ప్రపంచమంత టను గొప్ప సంచలనమును కలిగించెను. చిత్రములలో మాట, పాట అనగా సాహిత్య సంగీతములు-ఇతర ధ్వనులు రసోత్పత్తికి కారణభూతము లగునను సత్యమును చిత్రముల నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక శాస్త్రజ్ఞులు గ్రహింపగలిగిరి.

శబ్దగ్రహణమున క్రొత్తపుంతలు: శబ్దగ్రహణము విష యములో శాస్త్రవేత్తలు క్రొత్తపుంతలు త్రొక్కిరి. చిత్రనిర్మాణములో సహజముగా మైక్రోఫోను ప్రధాన మైన పాత్ర వహించును. స్టూడియో సెట్టు నందు షూటింగు జరుగుచున్న సమయములో నటీనటుల తలల పైన - అనగా కెమేరా 'రేంజి'లోనికి అది రాకుండ జేయుటకై ఒక ఇనుపకడ్డీకి అది వ్రేలాడకట్టబడి యుండును. ఈ కడ్డీ 'బీమ్' అని పిలువబడును. దీనిని అవ సరము ననుసరించి అన్నిదిశలకు త్రిప్పుకొనవచ్చును. వ్రేలాడదీయబడు మైక్రోఫోను నటీనటుల మాటలను, పాటలను, ఇతరధ్వనులను గ్రహించును. శబ్దము ‘యాంప్లి ఫయర్' గుండా ప్రయాణించి, కాంతి తరంగముల