పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/699

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 8 చలనచిత్రములు

ఆతనికి తలవని తలంపుగా ఒక సూత్రము అవగాహన మయ్యెను. ఈ సూత్రము ప్రకారము సూర్యునికిరణములు పడుటకు అవకాశముగల భాగములనే ఈ రసాయనిక పదా ర్థము నలుపు చేయగల్గును. ఈ సూత్రముపై డా. లూయీ అను ఆంగ్లేయుడు మరికొన్ని పరిశోధనలు జరిపెను. పరిశోధన లన్నిటిని ఆతడు గ్రంథస్థముచేసి, హఠాత్తుగా చనిపోయెను. ఆ గ్రంథము మరొక ఆంగ్లేయుడైన జోసయా వెడ్జివుడ్ యొక్క హస్తములలో పడేను. మర. ఆ ణించిన డా. లూయీకి సహాయకుడుగా పనిచేసిన చిస్ హోం కూడ వచ్చి వెడ్జివుడ్ యింటిలో ప్రవేశించెను.

వెడ్జివుడ్ యొక్క నాల్గవ కుమారుడైన థామస క్కు వైజ్ఞానిక పరిశోధనలయెడల మిక్కిలి ఆసక్తి ఉండి యుండెను. డా. లూయీ ఛాయాగ్రహణము విషయ ములో గావించిన పరిశోధనల నన్నిటిని అతడు చిస్ హోం ముఖతః విని కార్యరంగములోని దూకెను. వెలుగు ప్రస రణము ద్వారా అతడు వస్తువుల ప్రతిబింబములను కెమేరా అబ్స్క్యూ సహాయముతో 'రికార్డు' చేయ

ఛాయాగ్రహణ విధానమునకు ఈ పరిశోధనలు ఎంతయో సహాయపడెనని దీనవలన మనము గ్రహింప గలము. సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్లో ముంచి తీయబడిన తెల్లని కాగితములుగాని లేక తోలుముక్కలు గాని వివిధ పదార్థములు ప్రతిబింబములను 'రికార్డు' చేయుటకు ఉపయోగింపబడెను. సూర్యరశ్మి వీటిపై సూటిగా ప్రసరించినపుడు త్వరితగతిని యివి నలు పె క్కును. కొన్ని గంటలవరకు వీటిని నీడలో ఉంచినప్పుడు గూడ ఇవి నలుపురంగుకు తిరుగగలెను. దురదృష్టవశాత్తు కెమేరా అబ్ స్స్క్యూరా ద్వారా 'రికార్డు' చేయబడిన వస్తువుల ప్రతిబింబములలో స్ఫుటత్వము లేకుండెను; అనగా ఈ ప్రతిబింబములన్నియు రేఖామాత్రముగానే గోచరించిన వన్నమాట, 'ప్రింట్ల'కు కాపీలు తయారు చేయుటకు కూడ వెడ్జివుడ్ చాల బాధపడెను. ఎన్ని యో పర్యాయములు అవి నీటియందు కడుగబడి శుభ్రపరుప బడినప్పటికిని సత్ఫలితములు చేకూరకపోయెను. ఆ ప్రింట్ల మీదగల సిల్వర్ కాంపౌండు మార్పునకు గురికాక యథాప్రకారముగనే ఉండిపోవుటచే, అతడు వాటిని తీసివేయలేక పోయెను. ఈనాడు విరివిగా ఉపయోగింప బడెడు 'హైపో' యను రాసాయనిక పదార్థము క్రీ. శ. 1799 సం.లో కనిపెట్టబడినను, ఇతర వస్తువులుగూడ ఈ విషయములో ఉపయోగార్హతను సంపాదించినను, వెడ్డి ఫుడ్ తన పరిశోధనలను విజయవంతముగా కొనసాగించ లేక పోయెను. అతని ఆరోగ్యము పూర్తిగా దెబ్బతిని నందున, వెడ్జివుడ్ ముప్పది అయిదేండ్ల వయస్సుకూడ ముగియక మునుపే శాశ్వతముగా కన్నుమూసెను.

ఫ్రాన్స్ దేశీయులైన జోసెఫ్ నిసిఫోర్ నివ్స్, డాగరే అను శాస్త్రజ్ఞులును, ఆంగ్లేయుడైన విలియం హెన్రీ ఫాక్స్ టాల్ బట్ అను నాతడును వెడ్జివుడ్ గావించిన పరిశోధనలను ఆధారము చేసికొని ముందునకు వెళ్ళగలి గిరి. ప్రతిబింబములను గ్రహించుటకై కాగితములకును, తోలుముక్కలకును బదులు లోహపు ముక్కలు ఉప యోగింపబడెను. ఈనాడు ఛాయాగ్రహణములో మన ముపయోగించెడి 'నెగెటివ్' లకు ప్రాణదాత ఫాక్స్ టాల్ బట్ అను నాతడు ; 'పాజిటివ్' లకు జీవముపోసిన వాడు డాగరే. వీరిద్దరి కృషివలన 'నెగెటివ్' మీద

చిత్రము - 188 పటము - 2 య - మొట్టమొదట స్టూడియో కెమెరా