పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/697

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 చలనచిత్రములు

(iii) రసాయనిక ద్రవములు, (iv) విద్యుచ్ఛక్తి షాక్, (v) దెబ్బ తగులుట; ఇందులకు కారణములు.

ఈ పుండు మొదట ఎఱ్ఱపడి, చీముకారి నొప్పిగా నుండును. తర్వాత మెల్లగా మానును.

2. ఖర వ్రణములు : సిరాజవ్రణములు, వాతరక్త వ్రణములు, పడకలో చచ్చినపుండ్లు, మానుటకు దీర్ఘకాలము పట్టును.

3. నిర్దుష్ట వ్రణములు : (ఇవి నిర్దిష్ట కారణములవల్ల వచ్చును.) (అ) క్షయ, (ఆ) సవాయి, (8) టైఫాయిడ్, (ఈ) హెక్టినోమైకోసిస్. (ఉ) డెప్తీరియా (ఘటసర్పి), (ఊ) లీష్మేనియా (ఢిల్లీకురుపు) వీటికిగల కారణములకు చికిత్స చేసినయెడల వ్రణము మానును.

4. ప్రమాదకరమైన వ్రణములు : (i) పుట్టకురుపు (కాన్సరు) ఇది కఠినమగు కొనలను స్థానిక గ్రంధుల ద్వారా తినివేయును. (ii) ధ్వంసక వ్రణము (రోడంట్ అల్సర్). (iii) సెర్్కమీ.

5. ఉష్ణమండల వ్రణములు: వీటికి కారణములు తెలియవు. ఇవి దీర్ఘకాల వ్యాధులు. చాలాకాలము దురదపెట్టి మానును. ఒక్కొకప్పుడు శస్త్రచికిత్స అవసరమగును.

కాల్పులు, బొబ్బలు : శరీరపు ఉపరి భాగమునకు పొడి వేడిమి (dry heat) సోకుటవల్ల కాల్పులు సంభవించును. ఆవిరివంటి తేమగల వేడిమి శరీరమునకు తగిలిన యెడల బొబ్బలు కల్గును. ఈ క్రింది ఆరు తరతమ భేదములు గుర్తింపబడినవి.

(1) చర్మము ఎఱ్ఱపడుట,

(2) ప్రభాసిని (చర్మపు పైపొర పైకి లేచిపోవుట, బొబ్బలు కనబడుట,

(3) ప్రభాసిని నాశనము చేయబడుట, యుగాల నరముల కొనలకు ఎట్టి పైకప్పుదల లేకపోవుటచే నొప్పి అధికముగా నుండును. షాకు వచ్చుట సాధారణముగ జరుగు విషయము. త్వరగా నయమగును.

(4) చర్మమంతయును మరియు క్రింది ధాతువులలో కొంత భాగము నాళనమగును.

(5) కండరములు కూడా నాశనమునకు గురియగు

(6) శరీరావయవము పూర్తిగా కాలిపోవుట లేక క్రమము తప్పుట.

4, 5, 6 లలో నాడులు చివరి భాగములో నాశన మగుమ. కావున రోగికి నొప్పి తెలియదు. మానునప్పుడు అంగవైకల్యము కల్గును. కాలిన వెంటనే రోగికి ఆఘా తము తగిలినట్లగును. కాల్పు యొక్క తీవ్రతను బట్టి ఆఘాతము (షాకు) వచ్చును. నొప్పి తగ్గించుటకు (1) మార్ ఫైనును పెద్ద మోతాదులలో ఇవ్వవలెను. (2) రక్తనాళములలోనికి ప్లాస్మా లేక ప్లాస్మా వంటి మందులు ఇవ్వవలెను.

మొదటి ఆఘాతమునుండి తెప్పరిల్ల చేసిన పిమ్మట రోగిని ఏదైనా చికిత్సాలయమునకు చేర్చి, మత్తుమందు నిచ్చి కాలిన భాగమున విషక్రిమి నిరోధక వస్తువులతో శుభ్రపరచవలెను.

పెన్సిలిన్ ఆయింటు మెంటుతో కట్టు కట్టుటవలన రుండవతూరి సంపర్క దోషము రాకుండా నిరోధింప సంపర్కదోషము బడును.

ఈ క్రిందివి ప్రత్యేక రకపు కాల్పులు :

(1) పిడుగు దెబ్బ,
(2) విద్యుచ్ఛక్తివలన వచ్చిన కాల్పులు
(3) X రే - రేడియం వలన వచ్చిన కాల్పులు.

(ఇవి కొన్ని సంవత్సరముల తర్వాత మొండిజాతి వ్రణములకు కూడ దారితీయు అవకాశము కలదు).

(4) ఆమ్లములు, క్షారముల వలన వచ్చిన కాల్పులు.
(5) పై కప్పులేనిచోట్ల విపరీతమైన చలివలన వచ్చినవి.
(6) సూర్యుని వేడిమి వలన వచ్చు కాల్పులు.

శాం. నా. మా.


చలనచిత్రములు :

వార్తాపత్రిక, వేదిక, రేడియో, టెలివిజన్ ఈనాటి పంచములో ప్రచండమైన ప్రచారక సాధనములుగా పేరుగాంచినవి. ఆధునిక మానవజీవితము ఈ సాధనము లను ఆధారము చేసికొని తీర్పులు తీర్చిదిద్దుకొనుచున్నది. ఈ నాల్గింటిలో గర్భీకృతమైయున్న మహత్తరశక్తిని పుంజుకొనిన ప్రచారక సాధనము మరియొకటి కలదు. దీనినే చలన చిత్రమందురు. తక్కిన సాధనములకంటె