పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/695

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము _ 3 635 చర్మవ్యాధులు

గల కారణములు. ఆంటి ఇస్టమిన్ మందులవల్లను, ఎడ్రి నలీన్ ఇంజ నులవల్లను ఇది తగ్గును. కాని ఇది పదేపదే రాకుండా చేయుట మిగుల కష్టసాధ్యము. అందులకు ఏవేని హేతువు లునయెడల వాటిని తొలగించవలసి యుండును.

సోరయాసిస్ : ఇది క్రమరూపములో నుండని మచ్చ లుగా వచ్చును. ఇది కొంచెము పైకి యుండి | రజతవర్ణము గల పొలుసులు సమృద్ధిగా గోచరించును. వాటితో పాటు ఎట్టి స్రావము ఉండదు. అది ముఖ్యముగా మోకాళ్ళు, మోచేతులపై యుండును. నెత్తి చర్మము, శరీరములోని ఏదేని పార్శ్వము దీనికి గురికావచ్చును.

ఈ క్రింది చికిత్సలవలన లాభించును:

సరోచిన్ ఆయింట్ మెంట్ 2%
టార్ ఆయింట్ మెంట్
విటమిన్ బి 12 ఇంజెక్ష నులు
కార్తిసాన్ మాత్రలు.

సెబారియా (పొలుసులవంటి పుండ్లు) : గుండ్రని లేక కోడిగ్రుడ్డు ఆకారములో ఇది శరీరము లేక తలపై గోచరించును. నూనె కారెడు పసుపుపచ్చని పొలుసు లుండును. వీటిని తరచుగా కడగవలెను. వీటికి గంధకము, ఆసిడ్ కార్బాలిక్ లోషన్ లేక ఆయింటుమెంటు వాడ వలెను. రోగి ఆహారములో క్రొవ్వు పదార్థములు, కర్బన ఉదజనిదములు తగ్గించవలెను. కింది రెండర్-

శిలీంధ్రపు (ఫంగన్) సంపర్క దోషములు : ఎఱ్ఱని మచ్చలు, కోడిగ్రుడ్డు ఆకృతిలోగాని, ఉంగరపు రూప ములోగాని పొలుసులతో పెరిగి దోబీకురుపులు టెంకాక్ర సీస్ చర్మము యొక్క హారనీ పొరలలో వచ్చును. అందు వల్ల మిగుల భాధకరములైన ఎఱ్ఱని మచ్చలగును. దీనికి (1) ‘విట్ ఫీల్డ్ ' మలామా వాడవలెను. సలిసిలిక్ ఆసిడ్ ను, బెంజాయిక్ ఆసిడ్ న్ను 26% వాసలీన్ లో కలిపి వాడ వలెను. (2) అన్ డిసిలినిక్ ఆసిడ్ ఆయింట్ మెంటు. (3) ఆంటీబయటక్ వర్గమునకు చెందిన గ్రీసియోఫోలిన్ మాత్రలు ప్రొద్దున రెండు, సాయంత్రము రెండు చొప్పున 8 వారములు వాడినచో మంచిగుణము కనబడుచున్నట్లు ఇటీవల తెలియుచున్నది.

టెనీయాసర్సినేటా: శరీరముపై తామర వచ్చును. ఈ కురుపులు జంతుజాతికి సంబంధించినవి. ఈ పొడలు సుస్పష్టమైన ఉంగరము ఆకృతిలో నుండును. ముఖము, చేతులు, మెడ సాధారణముగా ఇందుకు గురియగును.

పిటేరియాసిస్ వెర్సికోలార్ : హరనీలేయర్ (పొర) సాధారణముగా ఇందుకు గురియగును. శిలీంధ్రపు సూక్ష్మ జీవులే ఇందులకు హేతువులు. శరీరకాండముపై ముఖ్య ముగా రొమ్ముపై యిది కనబడును. దీనికి క్రమబద్ధ మైన ఆకారము ఉండదు. ఇది పొడిగా నుండి, పొలుసులు కల్గి, పసుపు గోధుమరంగు మచ్చలతో నుండును. వానిని సులభముగా గోకివేయవచ్చును. పది రోజుల కొకసారి కుర

తామర (టీనియాటాన్సురాన్సు) : తెల్లని పొలుసులు గల గుండ్రని మచ్చలు కనబడును. అందులో వెంట్రుకల ముక్కలు ఉండును. తలకు కర్మ చేయించవలెను. వ్యాధి ఒకేచోట ఉన్న యెడల పిక్ నిక్ ఆసిడ్ 7 పాళ్లు, కర్పూరము, శుద్ధిచేసిన స్పిరిటు, ఒక్కొక్కటి ఔన్సు చొప్పున కలిపి రోజుకు 2 సార్లు రాచిన యెడల మంచిగుణము కనబడును. మూడు వార ములలో వెంట్రుకలు వదులుగా నగును. వాటిని లాగి వేయవచ్చును. నిపుణుడైన రేడియాలజిస్టుచే ఎక్సు రే ద్వారా వెంట్రుకలు రాలిపోవునట్లు చేయుట మంచిది. ఆ పిమ్మట మలామాను వాడవచ్చును.

ఫీవస్ : ఇది తల, శరీములపై వచ్చును. క్రమబద్ధముగ నుండని పసుపురంగు పెచ్చులు కప్పు ఆకారముగల పసుపు కొనలతో కనబడుట, దుర్వాసనయుండుట దీనిలక్షణములు. ట్రెకోఫైటాన్ షాన్లినైన్ వలన ఇదిసంభవించును. ఇది దీర్ఘ కాల వ్యాధి. దీనివలన మచ్చలు మిగులును.

ఇంపు గోకంటే జియోసా : ఇది ఒక బిడ్డనుండి మరొక బిడ్డకు వెనువెంటనే వ్యాపించును. ముఖము, శరీరముకూడ ఇందుకు గురియగును. స్టెప్టోకోకె, స్టెఫలో కోకై అను సూక్ష్మజీవులు ఇందుకుగల సాధారణ కారణ కారణములు. చీముపొక్కుల రూపేణాగూడ ఇది సంభ వింప వచ్చును. అవి పగిలి పుండ్లగును. ఇది సాధారణ ముగ కొద్ది వారములలో నే పోవును. పెచ్చులను నూనెతో తీసి వైచి మెర్క్యురీ ఆయింట్ మెంట్ వాడవలెను. లేక సల్ఫతై జాల్ క్రీం 5% కాని, పెన్సిలిన్ ఆయింట్ మెంటు కాని, జన్షన్ పై లెట్ 1% గల ద్రవమునుగాని వాడవలెను.