పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/693

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము చర్మవ్యాధులు


చిత్రము - 184

చర్మమును అడ్డముగా కోసి సూక్ష్మదర్శినితో చూచిన యెడల మనకు గోచరించు దృశ్యము 1. ప్రభాసిని 2. స్థూలత్వక్కు 4. చెమటగ్రంధి 3. వెండ్రుక కుదురు 5. నాడుల కొనలు 6. నూ వెచెమర్చు గ్రంథులు

యము. ఎ. విటమిన్ కొరతవలన చర్మముపై మృదు త్వము పోయి అది గరుకుగా నగును. 'పలాగ్రా' యను వ్యాధి వచ్చినవారికి కాళ్ళు చేతులు క్రిందిభాగము నల్ల బడును.

నరములకు సంబంధించిన కుష్ఠరోగమువంటి వ్యాధులలో ఇంద్రియజ్ఞానము పోవును. చర్మముపై వ్రణములు లేచును. చర్మము గాజువర్ణము పొంది పలుచగా నగును. వెండ్రుకలు రాలిపోవును. వ్రణములు లేచును. రెండు కాళ్ళును పడిపోయిన వారికి పిరుదులపై ప్రణ ములు లేచుట గలదు. పొంగు, మసూచి మొదలగు వ్యాధు లలో చర్మముపై పొక్కులు కనబడును. సవాయివలన చర్మముపై లేచు పొక్కులు ఏ చర్మవ్యాధినైనా పోలి యుండవచ్చును.

పుట్టుకతో వచ్చు లోపములు : చెమట గ్రంధులు లేక పోవచ్చును. వేసవిలో రోగి తనఉష్ణోగ్రతను పూర్తిగా నింపు కొనలేక తడిబట్టలు ధరించి తిరుగవలసివచ్చును. శరీరమం దంతటను రోమములు లేకపోవుట జరుగవచ్చును. చేతులు పాదములపై అదనముగా చెమటపట్టుట కూడ కొందరికి ఉండవచ్చును. చెమటకు చాలా అరుదుగా దుర్వాసన యుండును. '5 క్తి జాసిస్ ' వ్యాధికలవారి చర్మము పొడిగా పొలుసులు కలిగి కొన్ని సందర్భములలో చేప యందు వలె పెరుగుదల రావచ్చును. ఇది వంశపారంపర్యముగ వచ్చు అవకాశము గల వ్యాధి.

రంగులో కలుగు మార్పులు : 'ఎడిసన్సు' వ్యాధిలో నోటిలోను, చంకలలోను రంగు ముదురుట సంభవించును. బొల్లి యనగా శరీరముపై రంగుపోయి తెల్లగా నగుట. దీనికి మేలడొమీన్ అను మలామాను, అదే పేరుగల గోలీ లను ఇచ్చియు, అల్ట్రావయలెట్ కిరణములతోడను చికిత్స