చర్మవ్యాధులు
సంగ్రహ ఆంధ్ర
నార్థము భారతదేశమునకు వచ్చియుండెను. రెండు శతాబ్దుల అనంతరము హుయాన్‌త్సాంగ్ కూడ అట్టి యుద్దేశముతోనే భారతదేశమునకు వచ్చెను. అటు పిమ్మట ఇత్సింగ్ హుయాన్‌త్సాంగును అనుసరించి భారత భూమికి విచ్చేసెను. ఈ మువ్వురు బౌద్ధధర్మ గ్రంథాన్వేషణార్థము తాము దర్శించిన భారతభూమియందు పర్యటించి, తమ యాత్రావిశేషములను దెలుపుచు దినచర్యా గ్రంథములు వ్రాసి యున్నారు. ఈ యాత్రావిశేషముల వర్ణనా సందర్భమున భారతీయుల ఆచారవ్యవహారములనుగూర్చి తమతమ యభిప్రాయములను ముచ్చటగొల్పు విధముగా గ్రంథస్థముచేసి యున్నారు.
ప్రాచీన భారతదేశములో జీవిత చరిత్రలకు సంబంధించిన వాఙ్మయము స్వల్పముగనే రచింపబడినది. అట్టి జీవిత చరిత్రలలో బాణుడను మహాకవి రచించిన హర్ష చరిత్ర యొకటి అత్యంతప్రముఖమైనది. అయితే పౌరాణిక కథలకు, అద్భుత గాథలకు, జానపదులకు సంబంధించిన సాహిత్యము అపరిమితముగా నున్నది. భాసుడు, కాళిదాసు, భవభూతి, భారతి అను మహాకవుల గ్రంథములు, పంచతంత్రము ఇత్యాది పెక్కు జానపదగాథలు ఈ సందర్భమున పేర్కొన దగినవి.
ప్రాచీన శాసనములు, నాణెములు చాల విలువగల చరిత్రాధారములుగా భావించబడుచున్నవి. అవిలేనిచో, విశ్వసనీయమయిన చరిత్రనిర్మాణము అసాధ్యమయి యుండును. కొన్ని చారిత్రకదశలను వర్ణించుటకు శాసనములు మాత్రమే మనకు ఆధారములుగా నున్నవి. అలహాబాదు నగరమునందలి అశోకుని శిలాస్తంభ శాసనము లేకున్నచో, అశోకుడు నామమాత్రుడుగనే ఉండి యుండెడివాడు. గుప్తరాజులయొక్క నాణెముల దర్శనము ఎంతయు ఆహ్లాదకరము. ఆ నాణెములమీద ముద్రితమైన రాజలాంఛనములు, బిరుదావళులు, ఏప్రభువులయొక్క ఆజ్ఞలపై ఆ నాణెములు ముద్రింపబడెనో తెలిసికొనుటకు ఘనముగా నుపకరించుచున్నవి.
ఇవియే మన ఆధారములు. వీటి పరస్పర విలువలను గూర్చి ఇచ్చట ముచ్చటించుట సందర్భశూన్యము కానేరదు. చరిత్రాధారములలోకెల్ల శాసనములు, నాణెములు అత్యంతప్రముఖములైనవి. అయినను వీటికిని కొన్ని పరిమితులు కలవు. ఎందుకనగా, కొన్నిశాసనములు అసంపూర్ణములు. మరికొన్ని శాసనములు అతిశయోక్తులతో నిండి యుండును. ఇట్టి లోపము లెన్ని యున్నను శాసనములు మిక్కిలి నమ్మక మైన చరిత్రాధారములుగా పరిగణింపబడుచున్నవి. ప్రాచీన భారతదేశములోని సామంతుల యొక్కయు, సామ్రాజ్యాధి నేతల యొక్కయు నామ పరం పరా పరిశీలన మూలకముగా వారి పూర్వ, అపర చారిత్రక కథనమును ఒక క్రమమునకు తెచ్చుటలో పురాణములు వంశ గ్రంథములుమన కెంతయు తోడ్పడుచున్నవి.
కె. స.
చర్మవ్యాధులు (Skin Diseases) :
చర్మమునందు రెండు పొరలు కలవు. అందు ప్రభాసిని (ఎపిడెర్మిస్) అనబడు బాహ్యచర్మము ఒకటి. స్థూలత్వక్కు (డెర్మిస్) అను లోపలిచర్మము మరియొకటి. ప్రభాసిని యొక్క లోతుపొరలలో లోపలిచర్మపువర్గము ఉండును.
స్థూలత్వక్కునందు ఈ క్రిందివి కలవు :
- (i) చర్మపు గ్రంధులు. ఉపరి భాగమునందలి తమ గొట్టములద్వారా అవి తెరచుకొనును. అందువల్ల చెమట వెలికి వచ్చును.
- (ii) వెంట్రుకల లఘురంధ్రములు.
- (iii) క్రొవ్వుద్రవమును తయారుచేయు గ్రంధులు.
- (iv) స్పర్శ, ఉష్ణోగ్రత, వేడి, చలి మొదలగువాటిని కనుగొను జ్ఞాననాడులు. ఈ నాడులు తుది అవయవముల యొద్ద ముగియును. వ్రేళ్ళయొక్క తుది భాగములు మొదలైనచోట్ల ఈ స్పర్శజ్ఞానము ఎక్కువగా నుండును.
చర్మముయొక్క పనులు : 1. శరీరావయవములను ఇది కాపాడును. 2. శరీరోష్ణోగ్రతను క్రమబద్ధము చేయుటలో ఇది ముఖ్యపాత్ర వహించును. శరీరమునుండి సుమారు 1000 ఘనసెంటిమీటరుల ద్రవము ఉప్పుతో శరీరము నుండి ఇగిరి పోవును. ఏ వాతావరణము నందైనను సుఖముగా నున్నామను భావన చర్మమునుండి కలుగు నదియే. బాహ్య ఉష్ణోగ్రతను, తేమను, ఒక ప్రత్యేక స్థాయిలో నుంచుటవలన అట్టిది కలుగుచున్నది. దీనినే 'ఎయిర్ కండిషనింగ్' అందురు.
చర్మములో మార్పులు కలిగించు సాధారణ వ్యాధులు : మధు మేహములో దురద పెట్టుట సామాన్యమైన విష
632