పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/687

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 627 చరిత్రాధారములు

ముగ దినదినాభివృద్ధి దేనియందైనను గాంచనగును అను పరిణామవాదము యొక్క ప్రధానాంశమును యవన మహాశయుడు అరిస్టాటిల్ రెండువేల సంవత్సరముల క్రిత మే చాటి చెప్పియుం డెను. కాని భౌతిక విజ్ఞాన పరిశో ధనయందు ఈ సిద్ధాంతము సక్రమముగ నిరూపింపబడ నండునను, క్రైస్తవమత విజృంభణమువలన మధ్యయుగము నందు సర్వమును భౌతి కేతరమయమని రూఢిగ నాటుకొని యున్నందునను సుమారు ఒక వేయి సంవత్సరముల కాలము ఈపరిణామవాదము నివురుగప్పుకొనిన నిప్పువలె నుండెను. అటుపిమ్మట కాంట్ (Kant), షెల్లింగ్ (Schelling), హెగెల్ (Hegel) మహామహుల పాండిత్య ప్రకర్ష యందు ఈ వాదము ప్రజ్వలింపపాగెను. హెగెల్ మహాశయునికి ఈ పరిణామవాదమే ప్రపంచ చరిత్ర యందలి అంతరార్థమును తెలియజేయు మూలసూత్ర మాయెను. మానవుని రాజకీయాభివృద్ధి యంతయు స్వాతంత్ర్యభావోన్మీలనముకొరకు జరిగినదే అని హెగెల్ భావించెను.

పరిణామవాదమున కార్యకారణ సంబంధము అవినా భావముగ నుండును. కాబట్టి భౌతిక శాస్త్రములందు వలెనే చరిత్ర యందును (సాంఘికశాస్త్రము లన్నిటి యందునుగూడ) అప్రతిహతములగు ధర్మములు (Laws) ఉండునని నిశ్చయించి, జాన్ స్టువర్ట్ మిల్ John Stuart Mill), ఆగస్టు కోంచె (August Counte), బకిల్ (T. H. Buckle) మున్నగువారు చరిత్ర రచనకు పూనుకొనిరి. ఈ దృక్పథమునందు మానవునికి స్వేచ్ఛా ప్రవృత్తి ఎంతమాత్రమును లేనట్లుగనే కాన్పించెను. సర్వమును అనుల్లంఘనీయమైన చట్టబద్ధము; కాబట్టి సర్వమును పూర్వనిశ్చిత మే; ఇక మానవుడు స్వతంత్రించి, ఆలోచించుకొని, ఇదమిత్థమని నిశ్చయించుకొని కార్యా చరణకు పూనుకొనుటకు ఆస్పద మేది ?

ఈ చిక్కు ప్రశ్నకు సులభమైన సమాధానము దొరక జాలదు. మన కష్టసుఖము లెంతవరకు మనపై ఆధార పడి యున్నవి ? మన మంచిచెడ్డలు కేవలము గ్రహవీక్షణ ప్రభావముపైననే ఆధారపడి యున్నవా ? ఇదంతయు కేవలము భగవంతుని లీల కాబట్టి, మనకు ఇందు ఎట్టి స్వాతంత్ర్యమును లేదా ? ఈ జన్మమున జరగున దంత యును పురాకృతకర్మపరిపాకము కాబట్టి తప్పించుకొను టకు వీలు లేదుకదా ! ఇత్యాది ప్రశ్నలు, చర్చలు, అనా దిగ అన్ని దేశములందును సాగుచునే వచ్చినవి.

సర్వమును పూర్వనిశ్చిత మే అనెడి పై సిద్దాంతమును ఇంగ్లండునందు చార్లెస్ కింగ్ స్లే (Charles Kingsley) అను నాతడు ప్రతిఘటించెను. ప్రౌడ్ (J. H. Froude) అను నాతడు కింగ్ వాదమును బలపరచెను. జర్మనీ పండితుడు డ్రాయ్ సెన్ (J. G. Droysen) అనునతడు ఈ ఖండనకు ఒక సంపూర్ణతను కల్పించెను.

ఈ సిద్ధాంత రాద్ధాంతముల మూలముగ రెండు ముఖ్య విషయములు తేలినవి. చరిత్రకును, భౌతిక శాస్త్రముల కును చాల భేద మున్నది. ఈ భేదము రెండువిధములుగ గోచరించుచున్నది. (1) చరిత్రపద్ధతికిని, భౌతిక శాస్త్ర పద్ధతికిని భేదము గలదు. భౌతిక శాస్త్రముల శాస్త్రీయత బాహ్య వస్తు పరిశీలనమునకును, యంత్రాగారములందలి పరిశోధనమునకును సంబంధించినది. చరిత్ర యొక్క శాస్త్రీయత అట్లుకాక, విమర్శనమునకు సంబంధించినది. (2) ఇక భౌతిక శాస్త్రజ్ఞులు ప్రతిపాదించు సిద్ధాంతములు పాంచభౌతిక ప్రపంచమునకు సంబంధించినవి, కాబట్టి అవి నిశ్చితముగను, సర్వవ్యాప్యముగను ఉండును. చారిత్రక సిద్ధాంతములు మానసిక ప్రపంచమునకు సంబంధించినవి. ఈ ప్రపంచమున సంకల్పము, ఉద్దేశ్యము ప్రధానము కాబట్టి, భౌతిక సిద్ధాంతములకున్న సర్వవ్యాపకత్వము గాని, సునిశ్చితముగాని యుండజాలదు. మానసిక ప్రపంచ మునకు భౌతిక ప్రపంచమునకు లేని స్వేచ్ఛ యున్నదికదా !

పు. శ్రీ.

చరిత్రాధారములు :

సమకాలీనాధారములు స్వీయపరిశీలనములు : తన కాలపు చరిత్రనుగూర్చి వ్రాయు రచయిత, తాను వర్ణించు చారి త్రక సంఘటనలలో తానొక పాత్రధారియైయుండినచో, కొంతవరకు స్వానుభవములపై ఆధారపడి అట్టి కార్య మునకు పూనుకొనును. అంతేకాక, సాధికారికములైన ఆధారములనుండి సేకరింపబడిన మూలగ్రంథముల పైన, పత్రముల పైనగూడ ఆతడాధారపడును. ఉదాహరణము నకు, జెనోఫన్ (Xenophon) విరచితమైన “పది వేలమంది యాత్ర” (Expedition of the Ten Thousand),