చరకుడు
సంగ్రహ ఆంధ్ర
చుట శ్రేష్ఠము, (రసాయనములనగా “యజ్జరా వ్యాధి విధ్వంసి – భేషజం తద్రసాయనం” వ్యాధిని హరింప జేయునట్టియు - శరీరమునందు ముడుతలు, తలనెరియుట, చత్వారము – చెముడు మొదలగు ముసలితనపు లక్షణములు రానీయకుండ కాపాడునట్టియు - ద్రవ్యములు రసాయనము లని ఆయుర్వేదనిర్వచనము.
(2) తైలగండూషాభ్యాసో దంతబల రుచికరాణాం— నిత్యాభ్యాసమున నువ్వులనూనెను పుక్కిలించుట — దంతములకు బలమును, నోటికి రుచిని కలిగించును. దీనికి తైలగండూషాభ్యాస మని వాడుక - ఇందుకు విధి ఇది. సుమారు రెండు మూడు తులముల నువ్వుల నూనెను గోరు వెచ్చగా కాచి— ఉదయము దంతధావనానంతరము పుక్కిట బట్టి బాగా పుక్కిలించి ఉమ్మివేయ వలయును - ఇట్లు చేయుటచే చిగుళ్లు గట్టిపడి ఎట్టి రోగములకును తావీయక దంతములను పదిలముగా కాపాడును. పుప్పిపండ్లురావు. నోటిపూత కలుగదు. కలిగియున్న వెంటనే శమించును. పెదవులు పగులవు.
(3) మధుకం - చక్షుష్య - వృష్య - కేశ్య - కంఠ్య - వర్ణ్య—విరజనీయ—రోపణియానాం-కండ్లకుహితమును — శుక్రమునకు బలమును - వెండ్రుకలకు పెంపుదలను — సుస్వరమును శరీరచ్ఛాయను వృద్ధి నందించుటను - మాలిన్యమును తొలగించుటను - వ్రణములనుమాన్పుటను- చేయు ద్రవ్యములలో యష్టిమధుకముశ్రేష్ఠమైనది.
ఇట్లే ఆహారమున పాటించవలసిన ధర్మములు అనేకములు గలవు. మచ్చునకు : (1) కాలభోజనం ఆరోగ్య కరాణాం — ఆరోగ్యకరములగు పనులలో సకాలమున భుజించుట - శ్రేష్ఠ మయినది.
(2) ఏకాశన భోజనం సుఖపరిణామ కరణాం - ఆహార పదార్థము సుఖముగ జీర్ణింప జేయుటలో - ఒక పూటనే భుజించుట - ఉత్తమమైనది.
(3) గురు భోజనం దుర్విపాకానాం - గురుకరపదార్థ భక్షణ మజీర్ణమును కలిగించును.
(4) అతి మాత్రాశనం - ఆమప్రదోష హేతూనాం - మితిమీరి భుజించుట, అజీర్ణదోషమును కలిగించును.
(5) అనశనం-ఆయుషో హ్రాస కరాణాం - ఆహారము తీసికొనకపోవుట ఆయుష్యమును క్షీణింపచేయును.
(6) ప్రమితాశనం - కర్మనీయానాం - మిక్కిలి తక్కువగా భుజించుట - శరీరమును శుష్కింపచేయును.
(7) విరుద్ధవీర్యా శయనం - నిన్దితవ్యాధి కరాణాం- పరస్పర విరుద్ధ వీర్యములగు ఆహార పదార్థములను భుజించుట - కుష్ఠువు మొదలగు అసహ్యకరమైన వ్యాధులను కలుగచేయును.
(8) మాత్రా శీస్యాత్ - మనుజుడు ప్రమాణము ననుసరించి భుజింపవలయును.
(9) అహారమాత్రా వునరగ్ని బలాపేక్షిణీ - భుజింప తగిన ఆహారద్రవ్య ప్రమాణము - జఠరాగ్ని బలము ననుసరించి యున్నది.
(10) యావద్ధ్యస్యాశన- మశితమనుపహత్య - ప్రకృతిం యధాకాలం - జరాంగచ్ఛతి తావ - దస్య - మాత్రా ప్రమాణం - వేదితవ్యం భవతి.
ఎవనికి ఎంత భుజించిన - ప్రకృతికి బాధకలుగక - సకాలమున జీర్ణముచెందునో - అంత యాహారము వానికి తగిన ప్రమాణముగా తెలిసికొనతగినది.
ఆహారోపయోగ ధర్మము లిట్లు నాలు గంతరములుగా ముప్పదిమూడు (33) మాత్ర ముదాహరణమున కిచట తెలియచేయబడినవి. సవివరముగ చరకసూత్రమున 27 వ అధ్యాయమునందును, నిదాన, విమాన శారీర చికిత్సా స్థానములందును చూడనగును. శరీర రక్షణమునకు ఆయుఃపాలన మవసరము. ఆయుఃపాలనమునకు హితమైనఆహార సేవనము ముఖ్యము. హితాహార సేవనఫలమిట్లుగలదు.
షట్త్రిం శతం సహస్రాణి, రాత్రీణాం హితభోజనః
జీవత్యనాతురో జంతుః, జితాత్మా సమ్మతః సతాం.
(చ. సూ. 27-350)
ద్రవ్య, రస, గుణ, వీర్య, విపాక, ప్రభావ ధర్మములను తెలిసికొని, ఇంద్రియ నిగ్రహముకలిగి, తన శరీరేంద్రియ సత్వాత్మలకు మేలు చేయునట్టి ఆహారమును భుజించునట్టి మానవుడు రోగరహితుడై సజ్జన సమ్మతమగు పూర్ణాయువు గలిగి, ముప్పదియారు వేల (36,000) మ్రాత్రులు, అనగా - నూరు సంవత్సరములు సుఖముగా జీవించును.
తస్మాత్ హితోపచార మూలం జీవితం - అతో వివర్యాసాన్మృత్యుః.
(చ. వి. 3-42).
622