పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/674

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చమురుగింజలు

సంగ్రహ ఆంధ్ర

ఏనుగు తమ స్థానముల నుండి ఎట్టి పరిస్థితుల యందును కదల కూడదు. రాజునకును ఏనుగునకును మధ్య గల గడులయందు ఏ జంతువును అడ్డుండరాదు. శత్రుబలగము పగకూడ నుండరాదు. ఇట్టి నిబంధనలకు లోబడి తన గడి నుండి రాజు మూడు గళ్ళు ప్రక్కకు నడచును. ఏనుగు తన స్థానము నుండి, రాజును దాటి ప్రక్క గడిని ఆక్రమించును. ఇట్లు రాజును ఏనుగును, ఒకేసారి నడుపబడుచున్నను, ఒక ఎత్తుగనే పరిగణింపబడును. రాజు తన ప్రక్కకు మూడు గళ్ళు జరిగినచో రాజువైపు కోట యనియు, మంత్రి ప్రక్కకు మూడు గళ్ళు జరిగినచో మంత్రివైపు కోట యనియు వ్యవహరింతురు.

బలగము ఆమర్చుట : ఆటగాండ్రిద్దరును చివర తెల్లగడి గల భాగము తమ కుడిచేతివైపుండునట్లు బల్లనుమధ్య నుంచుకొనవలెను. తమ ముందుగల మొదటి వరుసలో బల్లకు రెండు చివరలయందును రెండు ఏనుగులను, వాని ప్రక్క గుఱ్ఱములను, గుఱ్ఱముల ప్రక్క శకటములను, మధ్యగల రెండుగళ్ళయందును రాజును, మంత్రిని అమర్చవలెను. తెల్లబలగము మంత్రిని తెల్లరంగు గడియందును, నల్లబలగము మంత్రిని నల్లగడియందును అమర్చవలెను. అనగా నల్ల బలగము రాజును తెల్లగడియందును. తెల్లబలగము రాజును నల్లగడియందును ఉంచవలెను. ఎనిమిది బంట్లను రెండవ వరుసలో జంతువులముందుగల గళ్ళలో అమర్చవలెను.

“రాజు” లేక “షా” చెప్పుట : ఒక ఆటగాడు తన బంటు, లేక జంతువు, లేక మంత్రియొక్క వీక్షణమును శత్రురాజుపై ప్రసరించునట్లు నడుపుట రాజునకు ' రాజు’ లేక 'షా' చెప్పుట అనబడును. అనగా “రాజును నడుపుము; లేనియెడల నా బలగము నీ రాజును చంపును" అని తెలుపుట. అట్లు పగవేయునపుడు 'రాజు' లేక 'షా' అని పలుకవలెను. అట్లు శత్రుబలగముచే పగపట్టబడి 'షా' లేక 'రాజు' అని చెప్పబడిన రాజు ఆ పగపట్టిన బలగమును చంపుటగాని, ఆ పగకు అడ్డముగ తన బలగమును నడుపుట గాని లేక ఆ పగనుండి రాజు తప్పుకొనుటగాని జరుగవలెను. అట్లు ఏది జరుగకపోయినను 'ఆటకట్టు' అనబడును. అనగా రాజు శత్రుబలగమునకు చిక్కినట్లుగ పరిగణించి ఆట ఓడినట్లు నిర్ణయింపబడును.

తట్టు : రాజు, శత్రుబలగము పగయందుండక తానుగాని, తన బలగముగాని నడచుటకు వీలులేని పరిస్థితులు కలిగినచో, ఆ ఆట 'తట్టు' అనబడును. అనగా సమానముగ పరిగణింపబడును.

బలగమునందుగల ఆటవస్తువును తన స్థానమునుండి తా నాక్రమింపగల మరియొక స్థానమునకు నడపుట ఒక ఎత్తు అనబడును.

సమస్యలు : చదరంగమునందు ఆటల విధానమేగాక సమస్యల విధానముగూడ గలదు. సమస్యయనగా రెండు బలగములనుండి కొన్ని ఆటవస్తువులనే గ్రహించి ఒక వ్యూహమును నిర్మించి, ఒక బలగము రెండవ బలగమును కొన్నినియమిత ఎత్తులలో కట్టించవలె నని నిర్ణయించెదరు. ఈ విధానమున రెండవ ఆటగాని ప్రసక్తి లేదు. ఒక ఆటగాడే రెండుబలగముల ఎత్తులను ఆలోచించును. ఆటకట్టు విధానమును తెలిసికొనుటకు ప్రయత్నించి ఆనందించుచుండును.

ది. సూ.


చమురుగింజలు :

మానవుని దైనందిన గృహజీవితమునందును, వివిధ పరిశ్రమలయందును పెక్కు రకముల చమురులు ఉపయోగింపబడు చున్నవి. ఈ తైలములలోని చాలరకములు కొన్ని మొక్కల గింజలనుండియు, ఫలముల నుండియు లభించుచున్నవి. కొన్ని రకముల తైలములు ఆయా మొక్కల ఇతర భాగములనుండి లభించునవి కూడ గలవు. వనస్పతి, సబ్బు, క్రొవ్వొత్తులు, వర్ణలేపనములు, వార్నీషులు, కందెన చమురులు, పరిమళ ద్రవ్యములు మొదలగు ముఖ్యమగు పరిశ్రమలలో వివిధ తైలములు ఉపయోగపడుచున్నవి.

తైలములు 'స్థిరతైలము' (Fixed oils) లనియు, 'అస్థిరతైలము' (Volatile or essential oils) లనియు రెండు ముఖ్యమగు రకములుగా నుండును. స్థిరతైలములు గాలిపారినచో శీఘ్రముగ హరించిపోక నిలచి యుండుము. అస్థిరతైలములు, గాలి సోకినచో, శీఘ్రముగ వాయురూపము నొంది హరించిపోవును. స్థిరతైలములను 'శోషకతైలము' లనియు (drying oils), అశోషక తైలము' లనియు (non-drying oils) మరల రెండు

614